సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల ఆన్‌లైన్ తరగతులు, ఫీజులపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. పాఠశాలల్లో ఫీజులపై హైకోర్టులో విద్యాశాఖ కౌంటర్ దాఖలు చేసింది. వివరాల్లోకి వెళ్తె.. ఈ ఏడాది ఫీజులు పెంచవద్దని ఏప్రిల్ 21న జీవో 46ను జారీ అయిందని విద్యాశాఖ కౌంటర్‌లో పేర్కొంది. జీవో ప్రకారం బోధన రుసుములు నెలవారీగా తీసుకోవాలి, కానీ 55 పాఠశాలలు జీవోని ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తున్నట్లు విద్యాశాఖకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.
జీవోను ఉల్లంఘించి వసూలు చేస్తున్న 55 పాఠశాలలకు విద్యాశాఖ షోకాజు నోటీసులు జారీ చేసింది. కాగా షోకాజు నోటీసులకు 47 పాఠశాలలు వివరణ ఇచ్చాయి. అధికారుల నుంచి క్షేత్రస్థాయి నివేదికలు రాగానే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తెలిపింది. కాగా జీవోకు విరుద్దంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు విద్యాశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఎస్ఈ గడువు కోరగా, తదుపరి విచారణను అక్టోబరు 8కు హైకోర్ట్ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment