29న స్కూల్ ఫీజుల కమిటీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదికను సిద్ధం చేస్తోంది. విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటినుంచే ఫీజుల నియంత్రణను అమలు చేసేలా ప్రభుత్వానికి సిఫా రసు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం పాఠ శాల విద్యాశాఖ కార్యాలయంలో యాజమాన్యాలు, తల్లి దండ్రులతో కమిటీ సమావేశం నిర్వహించింది. యాజమాన్యాలు తాము మరిన్ని ప్రతిపాదనలు అందజేస్తామని, ఇందుకు సమయం కావాలని కోరాయి. ఈ నెల 25న సాయంత్రం 4లోగా ప్రతిపాదనలు అందజేయాలని కమిటీ యాజమాన్యాలకు సూచించింది.
ఈ నెల 29న నివేదిక ను ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించింది. యాజమాన్యాలు ఇప్పటికే ఎక్కువ ఫీజులను వసూలు చేసి ఉంటే వాటిని తర్వాత సర్దుబాటు చేసేలా చర్యలు చేపట్టాలన్న ఆలోచనకు వచ్చింది. జిల్లా స్థాయిలో ఫీజుల నియంత్రణ కమిటీని (డీఎఫ్‌ఆర్‌సీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా రిటైర్డ్ జడ్జి లేదా ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయి లో పని చేసిన రిటైర్డ్ అధికారిని డీఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌గా నియమించేలా సిఫారసు చేస్తున్నట్లు తెలిసింది.
జూన్ నుంచి స్కూల్ ఫీజుల నియంత్రణ
Published Wed, May 24 2017 12:35 AM | Last Updated on Sat, Sep 15 2018 5:39 PM
Advertisement