ఫీజుల ‘మోత’..‘నా కుమారుడి ప్లేస్కూల్‌ ఫీజు రూ.4.3 లక్షలు’ | Delhi CA pays Rs 4.3 lakh as son pre school fees | Sakshi
Sakshi News home page

నా కుమారుడి ప్లేస్కూల్‌ ఫీజు రూ.4.3లక్షలు.. నా మొత్తం చదువు ఖర్చు కంటే ఎక్కువ

Published Sun, Apr 14 2024 7:32 PM | Last Updated on Mon, Apr 15 2024 1:45 PM

Delhi CA pays Rs 4.3 lakh as son pre school fees - Sakshi

న్యూఢిల్లీ : అక్షరాల రూ.4.3లక్షల ఫీజు. ఇది ఎంబీబీఎస్‌ చదువుకో. ఇంజినీరింగ్‌ చదువుకో కాదు. ప్లేస్కూల్‌!! కోసం. అవును మీరు విన్నది కరెక్టే

కొత్త విద్యా సంవత్సరం వస్తోంది. అప్పుడే దోపిడీ ప్రణాళిక కూడా మొదలైంది. గత ఏడాది కంటే 40 శాతం నుంచి 50 శాతం వసూలు చేసేందుకు ఢిల్లీ కార్పొరేట్‌ స్కూల్స్‌ రెడీ అయినట్లు తెలుస్తోంది. దీంతో పిల్లల్ని అష్టకష్టాలు పడుతున్న పేరెంట్స్‌ చివరికి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ తమ పిల్లల స్కూల్‌ ఫీజు రసీదులను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.  

ఢిల్లీకి చెందిన ఆకాష్‌ కుమార్‌ చార్టర్డ్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే తన కుమారుడు ప్లేస్కూల్ ఫీజు గురించి ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

ఆ ట్వీట్‌లో నేను మొత్తం చదివిన చదువుకు ఎంత ఫీజు చెల్లించానో.. అంతకంటే ఎక్కువగా నా కుమారుడు ప్లేస్కూల్‌ కోసం చెల‍్లిస్తున్నాను. ఆ స్కూల్లో కనీసం ఆడటం నేర్చుకుంటాడని నేను ఆశిస్తున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఫీజు రిసిప్ట్‌ను సైతం ట్వీట్‌లో చేశారు.

అందులో ఏప్రిల్ 2024 - మార్చి 2025 విద్యా సంవత్సరానికి 

రిజిస్ట్రేషన్‌ ఫీ                                  - రూ.10వేలు
ఏడాది ఫీజు                                    - రూ.25వేలు 
టర్మ్‌-1 (ఏప్రిల్‌ - జూన్‌ 2024)          - రూ.98,750
టర్మ్‌-2 (జులై- సెప్టెంబర్‌ 2024)      - రూ.98,750
టర్మ్‌-3 ( అక్టోబర్‌ -డిసెంబర్‌ 2024) - రూ.98,750
టర్మ్‌ -4 ( జనవరి - మార్చ్‌ 2025)    - రూ.98,750
టోటల్‌ ఫీజు                                    - రూ.4,40,000

అంటూ స్కూల్‌ ఫీజు గురించి షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ స్టోరీ పోస్ట్‌ చేసే సమయానికి 2.3 మిలియన్ల మంది వీక్షించారు. ఈ ట్వీట్‌పై ఢిల్లీలోని అనేక మంది తల్లిదండ్రులు తమ అనుభవాల్ని షేర్‌ చేస్తున్నారు. 

గుర్గావ్‌లోని ఒక వ్యక్తి ఇటీవల తన 3వ తరగతి కుమారుడి స్కూల్‌ ఫీజు నెలకు రూ. 30,000 చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆ లెక్కన అతను ఇంటర్‌ వచ్చేసరికి ఆ మొత్తం సంవత్సరానికి రూ. 9 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement