
ముత్యమంత మెరుపు
మానసిక ఒత్తిడి, ఎండ, కాలుష్యం వంటివి చర్మం సాధారణ రంగు కోల్పోయేలా చేస్తాయి. కళ్ల కింద నలుపు, మోచేతుల నలుపు, పెదవుల నలుపు తగ్గాలంటే
బ్యూటిప్స్
మానసిక ఒత్తిడి, ఎండ, కాలుష్యం వంటివి చర్మం సాధారణ రంగు కోల్పోయేలా చేస్తాయి. కళ్ల కింద నలుపు, మోచేతుల నలుపు, పెదవుల నలుపు తగ్గాలంటే...
♦ టీ స్పూన్ కొబ్బరి నూనె, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి మోచేతులు, మోకాళ్లపైన మసాజ్ చేయాలి. తర్వాత వేడి నీళ్లలో ముంచిన టవల్‌ని పిండి, ఆ ప్రాంతంలో మెల్లగా అద్దుతూ తుడవాలి. నలుపు తొలగిపోతుంది.
♦ టీ స్పూన్ దోస రసం, టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని అండరార్మ్స్‌కు రాసి, ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే అండరార్మ్స్‌లో నలుపుదనం తగ్గుతుంది.
♦ ముల్లంగి రసాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసి, సున్నితంగా మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. బ్లాక్‌హెడ్స్ సమస్య తగ్గుతుంది.
♦ కొత్తిమీర రసం పెదవులకు రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారంలో మూడుసార్లు ఈ విధంగా చేస్తే పెదవులపై నల్లని మచ్చలు తగ్గిపోతాయి.
♦ రాత్రి పడుకునేముందు రోజ్‌వాటర్‌లో ముంచిన దూదితో కంటి చుట్టూ రెండు, మూడుసార్లు తుడవాలి. తర్వాత ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా వేలికి అద్దుకొని, కంటిచుట్టూ రాయాలి. రోజూ ఈ విధంగా చేస్తుంటే కళ్ల కింద నలుపు తగ్గుతుంది.