అయోధ్య.. శ్రీరాముడు కొలువైన నగరం. ఇక్కడ దైవత్వం, వైభవం, నూతనత్వం నిండుగా కనిపిస్తాయి. దీనికితోడు శ్రీరాముని మహా మందిరంలో, ఆయన విగ్రహంలోనూ అతీంద్రియ శక్తులు సంతరించుకున్నాయని ఆలయ ట్రస్టు తెలిపింది.
ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ ప్రతియేటా శ్రీరామనవమి నాడు సూర్య భగవానుడు స్వయంగా శ్రీరామునికి అభిషేకం చేయనున్నాడన్నారు. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తల సలహా మేరకు ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్ల పక్షంలో తొమ్మిదో రోజన సూర్యకిరణాలు శ్రీరాముని విగ్రహం నుదుటిపై పడేలా విగ్రహం పొడవు, ఎత్తును తీర్చిద్దిదారు. శ్రీరామనవమి నాడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామునికి సూర్యుడు తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడు.
ముగ్గురు హస్తకళాకారులు వేర్వేరుగా శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేశారని, వాటిలో ఒక విగ్రహాన్ని భగవంతుని ప్రేరణతో ఎంపిక చేశారని చంపత్‌రాయ్ తెలిపారు. ఎంచుకున్న విగ్రహం పొడవు పాదాల నుండి నుదిటి వరకు 51 అంగుళాలు ఉందని, విగ్రహం బరువు ఒకటిన్నర టన్నులు ఉందన్నారు. ఈ విగ్రహంలోని సౌమ్యతను వివరిస్తూ.. ముదురు రంగు రాతితో చేసిన విగ్రహంలో విష్ణుమూర్తి దివ్యత్వం, రాజకుమారుడి తేజస్సు మాత్రమే కాకుండా ఐదేళ్ల బాలుని అమాయకత్వం కూడా కపిస్తున్నదని తెలిపారు.
జనవరి 16 నుంచి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. జనవరి 18న గర్భగుడిలోని సింహాసనంపై శ్రీరాముని ప్రతిష్ఠించనున్నారు.ఈ శ్రీరాముని విగ్రహానికున్న ప్రత్యేకత ఏమిటంటే.. దానిని నీటితో, పాలతో స్నానం చేయించినా విగ్రహంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడదు.
జనవరి 22న దేశవ్యాప్తంగా ఐదు లక్షల దేవాలయాల్లో అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయని, సాయంత్రం ప్రతి ఇంటి బయట కనీసం ఐదు దీపాలైనా వెలిగించాలని ట్రస్ట్ కోరింది. జనవరి 26 తర్వాతే దర్శనం కోసం సామాన్యులు ఆలయానికి రావాలని, రాత్రి 12 గంటలైనా అందరూ దర్శనం చేసుకునేంత వరకు ఆలయ తలుపులు తెరిచి ఉంచుతామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: 22న పుట్టేవారంతా సీతారాములే..!
Comments
Please login to add a commentAdd a comment