![Solar Storm Warning: Expert Says At Least Two Big Flare Players Released From The Sun - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/22/solar-flares.jpg.webp?itok=zkjKMJG0)
సూర్యుడి నుంచి భూమివైపుగా మరో పెను ఉప ద్రవం ముంచుకొచ్చే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది. సూర్యుడిపై నెలకొన్న పరిస్థితుల కారణంగా మరోసారి సౌర తుఫాన్స్ ఏర్పడే అవకాశం ఉందని నాసా పేర్కొంది. ఇప్పటికే నాసా శాస్త్రవేత్తలు సౌర తుఫాను హెచ్చరికలను జారీ చేశారు. అయితే ఈ సారి రెండు "పెద్ద సౌర తుఫానులు" త్వరలో సూర్యుడి నుంచి విడుదల కావచ్చని అంతరిక్ష వాతావరణ భౌతిక శాస్త్రవేత్త డా.తమిత స్కోవ్ పేర్కొన్నారు.
అతి త్వరలోనే ఈ రెండు సౌర తుఫానుల భూమిని తాకే అవకాశం ఉందని డాక్టర్ తమిత అభిప్రాయపడ్డారు. ఈ ఏడాదిలో సుమారు ఐదారు సౌర తుఫానులు భూమిని తాకయని తెలిపింది. కాగా ప్రస్తుతం సూర్యుడి నుంచి వెలువడనున్న సౌర తుఫానుల తీవ్రతను ఇంకా నిర్దారించలేదు. గతంలో జీ2, జీ3 మాగ్నెటిక్ సౌర తుఫానులు వచ్చాయని తమిత పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ త్వరలోనే రానున్న సౌర తుఫానులు "హై అలర్ట్‌లో" ఉన్నాయని ఆమె తెలిపారు.
ఇలా ఎందుకు జరుగుతుదంటే..!
ప్రతి పదకొండు సంవత్సరాలకొకసారి సూర్యుడి మాగ్నెటిక్ సైకిల్ ఓవర్‌డ్రైవ్ అవుతూ ఉంటుంది. ఈ సైకిల్ జరిగే సమయంలో సూర్యుడి అయస్కాంత ద్రువాలు మారుతూ ఉంటాయి. దీనినే సోలార్ మాగ్జిమమ్‌గా పిలుస్తారు. సూర్యుని అయస్కాంత క్షేత్రంలోని మార్పులు ఎక్కువ సంఖ్యలో సన్ స్పాట్స్, భారీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అయస్కాంత క్షేత్రంలోని హెచ్చుతగ్గుల వల్ల సోలార్ ప్లేర్స్ ఏర్పడతాయి.
సౌర తుఫాన్ భూమిని తాకితే...!
- రేడియో కమ్యూనికేషన్‌లు బాగా ప్రభావితమయ్యాయి.
- జీపీఎస్ ఆధారిత వ్యవస్థలు కుప్పకూలిపోతాయి.
- ఇంటర్నెట్‌కు విఘాతం కల్గవచ్చును.
- ఆర్కిటిక్ దృవాల వద్ద ఏర్పడే అరోరా బొరియాలిస్ ఇతర ప్రాంతాల్లో కూడా కన్పిస్తాయి. ముఖ్యంగా న్యూయర్క్ లాంటి ప్రాంతాల్లో అరోరా బోరియాలిస్ కాంతులను చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- ప్రపంచవ్యాప్తంగా పవర్‌గ్రిడ్లలో విద్యుత్ హెచ్చుతగ్గులకు కారణమవుతాయి.
చదవండి: భగభగమండే సూర్యుడి వాతావరణాన్ని చూశారా..! అందులో ఎన్నో అద్బుతాలు..!
Comments
Please login to add a commentAdd a comment