సూర్యుడి కన్నా భారీ నక్షత్రం! | Astronomers Discover a Young Heavyweight Star in the Milky Way | Sakshi
Sakshi News home page

సూర్యుడి కన్నా భారీ నక్షత్రం!

Published Tue, Aug 23 2016 3:00 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

సూర్యుడి కన్నా భారీ నక్షత్రం!

సూర్యుడి కన్నా భారీ నక్షత్రం!

లండన్: భూమికి దాదాపు 11 వేల కాంతి సంవత్సరాల దూరంలో పాలపుంతలో కొత్త నక్షత్రాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. తక్కువ వయసున్న ఈ నక్షత్రం సూర్యుడి కన్నా పరిమాణంలో దాదాపు 30 రెట్లు అధికంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల భారీ నక్షత్రాలు ఏర్పడే విధానాన్ని సులువుగా తెలుసుకునే వీలు కలగనుంది. ఇప్పటికీ ఈ నక్షత్రం తన మాతృ అణువుల నుంచి పదార్థాలను సేకరించే పనిలోనే ఉందని, ఆ ప్రక్రియ పూర్తయితే మరింత భారీగా తయారవుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ భారీ నక్షత్రం పుట్టుకలోని కీలకమైన దశను ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఈ నక్షత్రాలు కూడా చిన్న నక్షత్రాల మాదిరిగానే, గాలి, దుమ్ము ఒక్కచోటికి చేరి గుండ్రంగా తిరగడం వల్ల ఏర్పడినట్లు గుర్తించారు. సూర్యుడి వంటి నక్షత్రాల కన్నా 8 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉన్న నక్షత్రాలను అధ్యయనం చేయడం కష్టమని కేంబ్రిడ్జ్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన జాన్ ఇలీ పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement