ఆకాశంలో వింత.. సూర్యుడి చుట్టూ వలయాలు! | Krishna District, Strange Rings Around the Sun In The Sky | Sakshi
Sakshi News home page

ఆకాశంలో వింత.. సూర్యుడి చుట్టూ వలయాలు!

Published Sat, Jun 29 2019 6:17 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఆకాశంలో వింత చోటుచేసుకుంది. తీక్షణంగా ఎండ కాస్తున్న సమయంలో సూర్యుని చుట్టూ నల్లని విశాలమైన వలయాలు ఏర్పడ్డాయి. ఎన్నడూ చూడనిరీతిలో సుర్యుడి చుట్టు నల్లని వలయాలు ఉండటం చూపరులను ఆకట్టకుంది. దీంతో అదేపనిగా ఆకాశం వైపు చూస్తూ ప్రజలు ఈ వింత గురించి చర్చించుకోవడం కనిపించింది. కృష్ణా జిల్లా కంచికచర్ల పట్టణంలో శనివారం ఉదయం సమయంలో ఇది చోటుచేసుకుంది. ఎండ కాస్తూ.. భగభగలాడే సూర్యుడి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడ్డాయి. దీంతో ఆకాశం వైపు చూస్తూ.. ఈ వింతను ఆసక్తిగా గమనిస్తూ.. దీనిని తమ ఫోన్లలో చిత్రీకరించేందుకు పలువురు ఉత్సాహం కనబర్చారు. ఆకాశంలో వింత అంటూ ఈ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement