జూలైలో సూర్యుడి చెంతకు.. | NASA's First Mission To Sun Arrives In Florida To Start Final Preparations For July Launch | Sakshi
Sakshi News home page

జూలైలో సూర్యుడి చెంతకు..

Published Mon, Apr 9 2018 1:46 AM | Last Updated on Mon, Apr 9 2018 1:46 AM

NASA's First Mission To Sun Arrives In Florida To Start Final Preparations For July Launch - Sakshi

వాషింగ్టన్‌: అంతరిక్ష ప్రయోగాల్లో మరో కీలక ఘట్టం రానున్న జూలైలో ఆవిష్కృతం కానుంది. ఇప్పటివరకు చేపట్టిన ప్రయోగాలు ఒక ఎత్తయితే.. జూలైలో చేపట్టబోతున్న ఈ ప్రయోగం మరో ఎత్తు. కన్నెత్తి నేరుగా కూడా చూడలేని సూర్యుడిపైనే ఈ ప్రయోగాన్ని చేపట్టనుండటమే దీని ప్రత్యేకత. తొలిసారి సూర్యుడి వాతావరణాన్ని శోధించేందుకు ‘పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌’మిషన్‌ను నాసా చేపట్టనుంది. జూలై 31న చేపట్టనున్న ఈ ప్రయోగం కోసం తుది దశ సన్నాహాలు జరుగుతున్నాయి.

కొన్ని రోజుల క్రితమే ఈ ప్రయోగానికి సంబంధించిన అంతరిక్ష నౌకను అమెరికా వాయుసేన ఫ్లోరిడాకు తరలించింది. మూడో దశలో భాగంగా ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌లోని డెల్టా–4 హెవీ లాంచింగ్‌ వెహికల్‌కు దీనిని అనుసంధానం చేస్తారు. ఇప్పటివరకు ఏ అంతరిక్ష నౌక కూడా ప్రవేశించని సూర్యుడి కరోనా కక్ష్యలో ఈ నౌక పరిభ్రమించనుంది. ఆ ప్రాంతంలో ఉండే వేడి, రేడియేషన్‌ తట్టుకుని సౌర గాలులు ఏర్పడటానికి గల ప్రాథమిక కారణాన్ని కనుగొననుంది.

రానున్న 2 నెలలు పూర్తిస్థాయిలో నౌకకు పరీక్షలు చేపట్టి.. సూర్యుడి వేడిని తట్టుకునే కీలకమైన థర్మల్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌ (టీపీఎస్‌)ను ఏర్పాటు చేయనున్నారు. ఏడేళ్ల సుదీర్ఘ సమయంపాటు ఇది సూర్యుడి కరోనా కక్ష్యలో పరిభ్రమించనున్నట్లు ఈ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఆండీ డ్రైస్‌మన్‌ తెలిపారు. ఏళ్లపాటు శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్న అనేక ప్రశ్నలకు ఈ ప్రయోగం ద్వారా సమాధానం లభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement