సూర్యుడిపై భారీ మచ్చ!
లండన్: సూర్యుడిపై భూమికి దాదాపు రెట్టింపు పరిమాణం గల మచ్చని యూరప్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికోసం వారు అటకామా లార్జ్ మిల్లీమీటర్/సబ్ మిల్లీమీటర్ ఎరే(అల్మా) యాంటీనాల ద్వారా ఈ మచ్చను గుర్తించారు. సూర్యుని నుంచి వెలువడే తీక్షణమైన కాంతి వల్ల ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
సూర్యుడి పనితీరును విశ్లేషించడానికి అల్మాకు ఉన్న సామర్థ్యాన్ని తెలియజేయడానికి వారు ఈ దృశ్యాలను ఉపయోగించారు. దీని ద్వారా సూర్యుడి మీద ప్రతి మిల్లీమీటరు, సబ్ మిల్లీ మీటరును అధ్యయనం చేయవచ్చని వారు తెలిపారు.