సాయం సంధ్యావేళ.. నింగిలో కారుమబ్బులు కమ్ముకోగా.. ఆకాశం నుంచి ఆ మబ్బులు ఇలా భూమిపైకి జాలువారుతున్నట్లు కనిపించాయి. కుమురం భీం జిల్లా కౌటాల సమీపంలో ఈ మనోహర దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రవారం ఈ చిత్రాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.
– చింతలమానెపల్లి
భానుడి కిరణాలు.. బంగారు వర్ణాలు..
కారుమబ్బులను చీల్చుకుంటూ నీటిపై పడిన భానుడి కిరణాలు బంగారు వర్ణాన్ని సంతరించుకున్నాయి. కుమురం భీం జిల్లా చింతలమానెపల్లి మండలం బాబాసాగర్ అర్కగూడ ప్రాజెక్టు వద్ద ఈ దృశ్యం కనువిందు చేసింది. శుక్రవారం సాయంత్రం సూర్యకిరణాలతో ప్రాజెక్టు నీరు మొత్తం పసిడి వర్ణం పులుముకోగా చేపల కోసం వేటగాళ్లు పడవల్లో తిరుగుతుండడం.. చిత్రకారుడు గీసిన బొమ్మలా ఆకట్టుకుంది.
– చింతలమానెపల్లి
ఇవి కూడా చూడండి:
సోనూ సూద్ ఇంటికి జనం తాకిడి
Comments
Please login to add a commentAdd a comment