
లండన్: ప్రపంచవ్యాప్తంగా రానున్న ఐదేళ్ల పాటు సూర్యుడు సెగలు పుట్టించనున్నాడు. 2020 నుంచి 2024 మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెల్సియస్ నుంచి 1.60 డిగ్రీల వరకు పెరుగుతుందని బ్రిటన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీంతో చరిత్రలో ఎన్నడూ లేనంత వేడితో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతుందని హెచ్చరించింది. దీని కారణంగా పారిస్ ఒప్పందానికి ఉల్లంఘనలు తప్పవని తెలిపింది. ఇప్పటివరకు అత్యంత అధిక ఉష్ణోగ్రత నమోదైన 2016 సంవత్సర రికార్డు రానున్న ఐదేళ్లలో మాసిపోతుందని పేర్కొంది. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ప్రాంతాలు అధిక వేడికి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. కేవలం ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రతలు పెరిగితేనే కార్చిచ్చులు, కరువు ఇతర అనర్థాలు జరుగుతున్నాయని, అలాంటిది రానున్న ఐదేళ్లలో పెరిగే ఉష్ణోగ్రతల వల్ల ఎలాంటి విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందో అని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment