నింగిలోకి సోలార్‌ ఆర్బిటర్‌ | Solar orbiter Launched To Spot Sun | Sakshi
Sakshi News home page

నింగిలోకి సోలార్‌ ఆర్బిటర్‌

Published Tue, Feb 11 2020 4:27 AM | Last Updated on Tue, Feb 11 2020 4:27 AM

Solar orbiter Launched To Spot Sun - Sakshi

వాషింగ్టన్‌: అంతరిక్ష చరిత్రలోనే తొలిసారిగా సూర్యుడి ధృవాల చిత్రాలను మనకు పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ)లు సంయుక్తంగా తయారు చేసిన సోలార్‌ ఆర్బిటర్‌ అంతరిక్ష నౌక సోమవారం నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు రూ.10 వేల కోట్ల ఖర్చుతో రూపొందించిన ఈ అంతరిక్ష నౌకను అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్‌ కెనవరల్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి అలియన్స్‌ అట్లాస్‌–వీ రాకెట్‌ సాయంతో నింగిలోకి పంపినట్లు నాసా తెలిపింది.

ఈ ప్రయోగం విజయవంతమైన సంకేతాలు జర్మనీలోని యురోపియన్‌ స్పేస్‌ సెంటర్‌కు అంతరిక్ష నౌక నుంచి వచ్చినట్లు నాసా తెలిపింది. ప్రయోగించిన రెండు రోజుల తర్వాత ఈ సోలార్‌ ఆర్బిటార్‌ భూమి మీదకు సమాచారాన్ని చేరవేసేందుకు ఉపయోగపడే పరికరాలైన ‘బూమ్‌’, పలు ఆంటెన్నాలను అంతరిక్షంలో విచ్చుకుంటాయి. సూర్యుడి ఫొటోలను తీసేందుకు ఈ ఆర్బిటార్‌ బుధగ్రహం కక్ష్యలో తిరగనుంది. బుధగ్రహం చుట్టూ తిరుగుతూ ఇప్పటివరకు మానవుడు కనిపెట్టని సూర్యుడి ధృవాల చిత్రాలను తీయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement