
సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది..
లాస్ ఏంజెలిస్: సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దదైన కృష్ణబిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీర్ఘవృత్తాకారంలో ఉండే భారీ పాలపుంతలో ఏర్పడిన కృష్ణ బిలం (బ్లాక్ హోల్) సూర్యుడితో పోల్చి చూస్తే 60 కోట్ల రెట్లు పెద్దదిగా ఉన్నట్లు కాలిఫోర్నియా వర్సిటీ, ఇర్విన్ (యూసీఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అర్రే (ఏఎల్‌ఎంఏ) నుంచి హై రిజల్యూషన్ డేటాను సేకరించి ఈ భారీ కృష్ణబిలం కొలతను కనుగొన్నారు. ‘ఎన్‌జీసీ 1332’ అనే పాలపుంత కృష్ణబిలం మధ్యలో తిరుగుతున్న చల్లటి పరమాణు వాయువు, ధూళి వేగాన్ని లెక్కించారు.