High resolution
-
తవాంగ్ ఘర్షణ: ఎటునుం‘చైనా’.. హెచ్చరిస్తున్న ఛాయా చిత్రాలు..
కయ్యాలమారి చైనా దుందుడుకుగా వ్యవహరిస్తూ ఈశాన్య రాష్ట్రాలపై గురి పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఇటీవల ఘర్షణల అనంతరం టిబెట్‌లోని వైమానిక స్థావరాల్లో భారీ సంఖ్యలో డ్రోన్లు, యుద్ధ విమానాలను మోహరించి మనపై కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చేసింది. మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ మక్సర్ తీసిన హై రిజల్యూషన్ ఉప గ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం తేటతెల్లమైంది. మన వైమానిక దళం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కొంది. గగనతలంలో నిరంతరం యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తూ డ్రాగన్ దేశం కార్యకలాపాలను గట్టిగా అడ్డుకుంటామని చాటి చెప్పింది. భవిష్యత్‌లో చైనా నుంచి ఎటు నుంచైనా ముప్పు పొంచి ఉందని ఈ ఛాయా చిత్రాలు హెచ్చరిస్తున్నాయి. బాంగ్డా వైమానిక కేంద్రం డబ్ల్యూజెడ్–7 ‘‘సోరింగ్ డ్రాగన్’’ డ్రోన్, ఈ డ్రోన్‌ని గత ఏడాది చైనా అధికారికంగా వైమానిక దళంలోకి ప్రవేశపెట్టింది. 10 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు. నిఘా వ్యవస్థకు ఈ డ్రోన్ పెట్టింది పేరు. భారత్‌లో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించడానికి క్రూయిజ్ క్షిపణులు పని చేసేలా డేటాను ప్రసారం చేసే సామర్థ్యం కూడా ఈ డ్రోన్ కలిగి ఉంది. ఈ తరహా డ్రోన్లు భారత్ వద్ద లేవు. ఇక డిసెంబర్ 14నాటి ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో బాంగ్డాలో ఫ్లాంకర్ టైప్ యుద్ధ విమానాలు రెండు మోహరించి ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు భారత్ దగ్గర ఉన్న ఎస్‌యూ–30ఎంకేఐ మాదిరిగా పని చేస్తాయి. లాసా వైమానిక కేంద్రం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకి 260 కి.మీ. దూరం నాలుగు జే–10 యుద్ధవిమానాలను సిద్ధంగా ఉంచింది. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీలో ఈ యుద్ధ విమానాలు అత్యంత విశ్వసనీయమైనవిగా గుర్తింపు పొందాయి. 1988 నుంచి వీటిని వాడుతున్న చైనా ఆర్మీకి ఈ యుద్ధ విమానాలు బాక్ బోన్ అని చెప్పొచ్చు. ఇక లాసాలో మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తోంది. రెండో రన్‌వే నిర్మాణం శరవేగంగా సాగుతోంది. షిగాట్సే వైమానిక కేంద్రం సిక్కిం సరిహద్దుకి 150కి.మీ. దూరం ఇక్కడ చైనా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ)లను మోహరించింది. టిబెట్‌లో మొత్తం రక్షణ వ్యవస్థనే ఆధునీకరిస్తోంది. ఆధునిక యుద్ధ విమానాలైన జే–10సీ, జే–11డీ, జే–15 విమానాలు కూడా మోహరించి ఉన్నాయి. ఇవన్నీ గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ వినియోగించే జెట్స్‌ను అడ్డుకునే అవకాశాలున్నాయి. బలం పెంచుకుంటున్న ఇరుపక్షాలు 2017లో డోక్లాం సంక్షోభం తర్వాత భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఆయుధాలపరంగా, సదుపాయాలపరంగా బలం పెంచుకుంటున్నాయి. వివాదాస్పద జోన్లలో భారత్ సైన్యం కదలికల్ని అనుక్షణం అంచనా వేయడానికి చైనా వైమానిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. సరిహద్దుల్లో చైనా మోహరిస్తున్న ఆధునిక యుద్ధ విమానాలు, ఇతర కొత్త ప్రాజెక్టులు, నిర్మాణాలు డ్రాగన్ బలాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయని టిబెట్ ప్రాంతంలో ఆ దేశ మిలటరీ కార్యకలాపాలను నిరంతరం ట్రాక్ చేసే మిలటరీ అనలిస్ట్ సిమ్ టాక్ అభిప్రాయపడ్డారు. టిబెట్, తూర్పు లద్దాఖ్ మీదుగా చైనా బలగాలను అనుసంధానం చేయడానికి కొత్త మార్గాలను నిర్మించే పనిలో డ్రాగన్ దేశం ఉందని చెప్పారు. అస్సాం, బెంగాల్లో మైదాన ప్రాంతాలైన తేజ్‌పూర్, మిసామరి, జోర్హాట్, హషిమారా, బాగ్డోగ్రాలో దశాబ్దాలుగా భారతీయ యుద్ధ విమానాల నిర్వహణ మన దేశానికి ఎంతో కలిసొస్తోంది. కొండ ప్రాంతాల్లోని టిబెట్ వైమానిక స్థావరాల నిర్వహణలో చైనాకు యుద్ధ విమానాల బరువుపై పరిమితులున్నాయి. మనకది లేకపోవడం కలిసొచ్చే అంశమని విశ్లేషకులు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాత ఫొటోల్ని క్వాలిటీగా కోరుకుంటున్నారా?
ఫొటోల్ని భద్రంగా దాచుకోవడం పెద్ద సవాల్‌గా ఫీలవుతుంటారు చాలామంది. ఆల్బమ్‌కు అత్కుకుపోవడం, మరకలు, చినుగుళ్లు.. ఇలాంటివి గుర్తులను చెరిపేసే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే ఆ పాత ఫొటోల్ని క్వాలిటీగా మార్చేందుకు రెండు పెయిడ్ మోడల్స్‌ను తీసుకొచ్చింది గూగుల్. గూగుల్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బ్లాగ్ ద్వారా ఇమేజ్ సూపర్ రీ-సొల్యూషన్(ఎస్ఆర్3), కాస్కాడెడ్ డిఫుషన్ మోడల్స్(సీడీఎం) పేరుతో మోడల్స్‌ను రిలీజ్ చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా పాత తరం ఫొటోల్ని క్వాలిటీ మోడల్స్‌లోకి మార్చడంతో పాటు బ్లర్ ఇమేజ్‌లను హై రెజల్యూషన్ మోడ్‌లోకి మార్చేయొచ్చు. ఇమేజ్ సూపర్ రెజల్యూషన్(ఎస్ఆర్3).. లో రెజల్యూషన్ ఫొటోల్ని హైరెజల్యూషన్‌కు మారుతుంది. బాగా డ్యామేజ్, మరకలు ఉన్న పాత ఫొటోల్ని సైతం క్లారిటీ మోడ్‌కు తీసుకొస్తుంది. మల్టీపుల్ అప్లికేషన్స్‌తో పనిచేసే ఈ టెక్నాలజీకి సంబంధించి డెమోను సైతం బ్లాగ్‌లో ఉంచింది గూగుల్ ఏఐ. చదవండి: దేశంలో VPN బ్యాన్? కాస్కాడెడ్ డిఫుషన్ మోడల్స్(సీడీఎం).. ఫొటోల్ని సహజంగా అందంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగించే టెక్నాలజీ ఇది. ఇంతకు ముందు ఉన్న ఇమేజ్‌నెట్ కష్టంగా మారడంతో.. ఈ కొత్త మోడల్‌ను డెవలప్ చేసినట్లు పేర్కొంది గూగుల్. ఇమేజ్ రెజల్యూషన్‌ను పెంచడంతో పాటు ఫొటోల్ని నేచురల్‌గా చూపించనుంది ఈ ఏఐ మోడల్. ఈ రెండింటితో పాటు అగుమెంటేషన్ టెక్నిక్ ‘కండిషనింగ్ అగుమెంటేషన్’ను సీడీఎంకు సమానంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది గూగుల్. 64x64 రెజల్యూషన్ ఈమేజ్‌ను 264x264 రెజల్యూషన్కి, ఆపై 1024x1024కి మార్చనుంది సీడీఎం మెథడ్. అయితే పాత ఫొటోల్ని క్వాలిటీకి మార్చే క్రమంలో.. డిజైన్ విషయంలో కొన్ని సవాళ్లు ఎదురు కానున్నాయని, వాటిని అధిగమించే ప్రయత్నం చేయనున్నట్లు గూగుల్ ఏఐ బ్లాగ్ పేర్కొంది. చదవండి: వర్క్‌ఫ్రమ్ హోంపై గూగుల్ కీలక ప్రకటన -
యూట్యూబ్ యూజర్లకు గుడ్‌న్యూస్!
న్యూఢిల్లీ: మళ్లీ ఇప్పుడు ఇండియాలో హెచ్డీ క్వాలిటీలో వీడియోలు చూసే అవకాశాన్ని యూట్యూబ్ కల్పించనుంది. లాక్డౌన్ సమయంలో ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగిలిన వారందరూ వర్క్ ఫ్రం హోం ద్వారా సేవలను అందించారు. అందువల్ల మొబైల్ నెట్‌వర్క్‌ల మీద అధిక భారం పడింది. దీనిని అదుపు చేయడానికి యూట్యూబ్ మార్చి నెలలో 1080 పిక్సల్ హెడీ వీడియోలను నిలిపివేసింది. బ్రాండ్ బాండ్ సేవలకు అంతరాయం కలగకుండా 480 పిక్సల్ క్వాలిటి వీడియోలకు మాత్రమే యూట్యూబ్ అనుమతినిచ్చింది. మొబైల్‌నెట్ వర్క్, బ్రాండ్‌బాండ్ నెట్‌వర్క్‌ల మీద కూడా ఈ నిషేధాన్ని విధించింది. అయితే ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేయడంతో దాదాపు కార్యాలయాలన్ని తిరిగి ప్రారంభమయ్యాయి. ఇంటి నుంచి కాకుండా ఆఫీసుల నుంచి వర్క్ చేయడం ప్రారంభిస్తున్నారు. దీంతో భారతదేశంలో మళ్లీ హెచ్డీ 1080 పిక్సల్ హెడీ వీడియోలకు యూట్యూబ్ అనుమతినిచ్చింది. వైఫై నెట్వర్క్ ద్వారా వీడియోలను హై క్వాలిటీలో చూడొచ్చు. కొన్ని ఫోన్స్‌లో 1080 పిక్సల్ వీడియోలు ప్లే అవుతుండగా కొన్ని మొబైల్స్‌లో 1440 పిక్సల్ వీడియోలు ప్లే అవుతున్నాయి. అయితే రీసెంట్గా విడుదలై ఐవోఎస్‌తో నడిచే ఐఫోన్ XR, ఐఫోన్ 11 వంటి వాటిలో ప్రస్తుతం మొబైల్ నెట్‌వర్క్‌ల ద్వారా 4కే వీడియోలను ప్లే చేయవచ్చు. అదేవిధంగా ఎయిర్టెల్, జియో నెట్‌వర్క్‌లలో ఐఫోన్ ఎక్స్ఆర్లో 4 కె వీడియోలను, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రోలో 1440 పి వీడియోలను ప్లే చేయవచ్చు. వీడియో క్వాలిటీ మీద ఉన్న నిషేధాలను ఎత్తివేయడంతో ఇక నుంచి హెచ్డీ వీడియోలను చూసి ఆనందించవచ్చు. చదవండి: రికార్డు బ్రేక్: ఈ పాటకు 7+ బిలియన్ వ్యూస్ -
హైపర్ రియలిస్టిక్ ‘బ్రహ్మ’
హైపర్ రియలిజం.. హై రిజల్యూషన్ చిత్రాలను పోలి ఉండే చిత్రలేఖనం లేదా శిల్పశైలి. ఇది అంత తేలికైన కళేం కాదు. 1970లో యూరోప్, అమెరికాలో అభివృద్ధి చెందిన ఈ కళ..ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. హైపర్ రియలిజం ఆర్ట్‌లో చేయితిరిగిన కళాకారులు ప్రపంచంలో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ కొద్ది మంది కళాకారుల సరసన తానూ నిలవాలని తపించాడో వ్యక్తి. లక్ష్యం దిశగా అడుగులేసే క్రమంలో చిత్రకళాప్రపంచంలో అతిరథ మహారథులను కలిశాడు. పెయింటింగ్‌లో మెళకువలను అవపోసన పట్టాడు. తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. హైపర్ రియలిస్టిక్ ‘బ్రహ్మ’గా పేరు సంపాదించిన కళాకారుడు యేలూరి శేషబ్రహ్మం విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లా కవులకు, కళాకారులకు పట్టుకొమ్మ అని అనేక సందర్భాల్లో నిరూపితమవుతూనే ఉంది. మన జిల్లాకు రెండు వేల సంవత్సరాల కళావారసత్వం ఉంది. బౌద్ధులు, ఇక్ష్వాకులు, చాళుక్యుల కాలం నుంచి ఇప్పటి ఆధునిక కాలం వరకు ఈ గడ్డ అబ్బురపడే కళాకారులని ప్రపంచానికి అందిస్తూనే ఉంది. ఈ నేల అస్తిత్వం కలిగిన ఈ తరం చిత్రకారుడు యేలూరి శేషబ్రహ్మం. చిత్రకళా ప్రపంచంలో బ్రహ్మగా పిలువబడే శేషబ్రహ్మం 1976లో వెంకటసుబ్బారావు, వరలక్ష్మి దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. వీరి పూర్వీకుల నుంచి కళాకారుల నేపథ్యం ఉండటంతో బ్రహ్మం చిన్నతనం నుంచే చిత్రకళపై అమితాసక్తి చూపుతూ అదే రంగంలో రాటుదేలాడు. చిన్న వయసులో చిత్రలేఖనం సాధన ప్రారంభించి ఒంగోలులో కొంతకాలం డ్రాయింగ్ మాస్టర్ రామకృష్ణ, సూర్య ఆర్ట్స్ జె.వెంకటేశ్వర్లు వద్ద శిష్యరికం చేశాడు. పదో తరగతి వరకు ఒంగోలులో విద్యనభ్యసించిన బ్రహ్మం.. చిత్రకళనే జీవితంగా మలుచుకోవాలని భావించాడు. ఒంగోలుకు చెందిన ఆధునిక చిత్రకారుడు డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు సలహా మేరకు హైదరబాద్‌లోని జేఎన్టీయూలో సీటు సాధించి బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్ఏ) పూర్తి చేశాడు. యూనివర్శిటీలో బీఎఫ్ఏ చేసే రోజుల్లో బ్రహ్మం ఆసక్తిని గమనించిన గురువులు, సీనియర్లు చిత్రలేఖనం, పెయింటింగ్‌తోపాటు పలు అంశాల్లో మెళకువలు నేర్పారు. వాటిని అందిపుచ్చుకున్న బ్రహ్మం తనకంటూ ఒక శైలిని ఎంచుకోవడంలో అడుగు ముందుకు వేశాడు. అబ్బురపరిచే చిత్రాలను వేసి ఔరా అనిపించాడు. యూనివర్శిటీలో తరగతులు ముగియగానే ఎక్కువ సమయం లైబ్రరీలో గడపడం, చిత్రకారులు, శిల్పకారులు, ఫోటోగ్రాఫర్ల జీవితాలను, కళలను అధ్యయనం చేసేవాడు. పెన్సిల్, క్రేయాన్స్, ఆయిల్ కలర్స్, వాటర్ కలర్స్ ఇలా అన్ని రకాల మీడియంలలో చిత్రాలను సాధన చేసి వందలాది చిత్రాలను మలిచాడు. హైపర్ రియలిజం వైపు అడుగులు బ్రహ్మం ప్రపంచంలోనే అతి తక్కువ మంది చెయ్యగలిగే శైలి అయినటువంటి ‘హైపర్ రియలిజం’ శైలిని ఎంచుకుని అనేక చిత్రాలను గీశాడు. రాష్ట్రీ, జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ అందుకోవడమే కాకుండా ఒక సందర్భంలో ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ నుంచి ప్రశంస పత్రం అందుకున్నాడు. కాలేజీ విద్య అనంతరం ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా తన కళా సాధనను ఇంకా వృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. పదేళ్లపాటు దేశంలోని అనేక చారిత్రక, గ్రామీణ, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు తిరుగుతూ ప్రకృతిలోని రంగుల మేళవింపును ఆకళింపు చేసుకున్నాడు. ఒక కళాకారునికి ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధం కొన్ని వందల పెయింటింగ్‌లు వేసేందుకు పురిగొల్పింది. తాను కళా సాధన చేస్తూనే వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాడు. ఇప్పుడు వారంతా చిత్రకళా రంగంలో స్థిరపడి ఉండటం విశేషం. శిల్పకళలోనూ ప్రావీణ్యం కేవలం చిత్రకళలోనే కాకుండా శిల్పకళలోనూ తర్ఫీదు పొంది మోల్డింగ్ క్లే, ఫైబర్, గ్రానైట్ స్టోన్పై శిల్పాలు మలచడంలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానం పొందారు. శిల్పకళా ప్రావీణ్యం గమనించిన హైదరబాద్‌లోని జనహర్ష కంపెనీ నిర్మించ తలపెట్టిన వందకోట్ల ప్రాజెక్టుకు సంబంధించి డిజైనింగ్ ఇన్చార్జిగా బ్రహ్మాన్ని నియమించారు. జనహర్ష చేపట్టిన ప్రాజెక్టులోని రిసార్టుల్లో కళాకౌశలం దేశంలో అత్యంత అందమైనదిగా రూపుదిద్దుకుంటోంది. గుళ్లాపల్లి గ్రోత్ సెంటర్లో స్వయంగా కంపెనీ ప్రారంభించి అందమైన శిల్పాలు తయారు చేస్తున్నారు. తన స్నేహితులు బాలసుబ్రహ్మణ్యం, చిన్నమస్తాన్తో కలిసి స్వయంగా కటింగ్ మిషన్ తయారు చేసుకోవడం విశేషం. కళలతో పాటు సామాజిక బాధ్యతను మరువకుండా గతంలో ఒంగోలులో ‘ఒపాక్’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి భూగోళాన్ని కభళిస్తున్న ప్లాస్టిక్ వ్యర్ధాలపై యుద్ధం ప్రకటించారు. నో ప్లాస్టిక్ నినాదంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి సామాజిక బాధ్యతను గుర్తుచేశారు. తిరుమల సన్నిధిలో వెంకన్న నేత్రదర్శనం పెయింటింగ్ తిరుమల వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం పెయింటింగ్ వేసేందుకు దేశంలో పేరుగాంచిన చిత్రకారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. బ్రహ్మంలోని రియలిస్టిక్ ఆర్టిస్ట్‌ను గుర్తించి ఎంపిక చేశారు. నాలుగు గురువారాలు స్వామివారి సన్నిధిలో గడిపి వేంకటేశ్వరుని నేత్రదర్శనం పెయింటింగ్ వేశారు బ్రహ్మం. ఆ పెయింటింగ్ ఎంతో ప్రాచుర్యం పొంది ఇప్పుడు వాడవాడలా దర్శనమిస్తోంది. ఇప్పటికీ ఆ ఒరిజినల్ పెయింటింగ్ పద్మావతి అమ్మవారి దేవస్థానంలో గర్భగుడి ఎదురుగా అలకరించి ఉంది. ఆ పెయింటింగ్ వేసే సమయానికి బ్రహ్మం వయసు కేవలం 21 సంవత్సరాలు. విస్తరించిన కళ బ్రహ్మం నెమ్మదిగా తన కళను అనేక రంగాలకు విస్తరించాడు. ఇంటీరీయర్, ఎక్స్టీరియర్, డిజైనింగ్, ఫ్యాబ్రిక్ డిజైనింగ్, డిజిటల్ పెయింటింగ్స్, మెషిన్ మేకింగ్ ఇలా పలు రకాలుగా ప్రయోగాలు చేస్తూ.. విజయం సాధిస్తూ.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎంతోమంది కవులు రాసిన పుస్తకాల కవర్ పేజీలు బ్రహ్మం కుంచె నుంచి జాలువారినవే. నాన్నకు ప్రేమతో, భాగమతి, మహానుభావుడు, లై తదితర చలనచిత్రాల్లో తను వేసిన పెయింటింగ్‌లు ప్రముఖంగా కనిపిస్తాయి. ముంబయిలోని పలు ఫైన్ఆర్ట్స్ కాలేజీల్లో బ్రహ్మం చిత్రాల డెమోనిస్ట్రేషన్ జరిగిందంటే ఆయన ప్రతిభ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిమిషాల వ్యవధిలో ఎంఎఫ్ హుస్సేన్ చిత్రం చదువుకునే రోజుల్లో ఒకసారి ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ హైదరాబాద్ రావడంతో ఆయనను కలిశాడు. ఆయనతో మాట్లాడుతూ కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే చార్కోల్తో ఎంఎఫ్ హుస్సేన్ స్కెచ్ వేసి ఆశీస్సులు పొందాడు. ప్రఖ్యాత వ్యంగ్య చిత్రకారుడు మోహన్.. బ్రహ్మం గీసిన చిత్రాలను మెచ్చుకుని ఆయన వద్దే కొంత కాలం ఉంచుకుని రొమాంటిసిజం, ఇంప్రెషనిజం, క్యూబిజం, మోడరన్ ఆర్ట్స్ తదితర చిత్రకళా రీతులను, జపనీస్, చైనీస్ వాటర్ కలర్, ఇండియన్ మినీయేచర్ చిత్రాల గొప్పదనాన్ని వివరించి శిక్షణ ఇచ్చారు. శ్రీమతి సహకారం.. స్నేహ బంధం బ్రమ్మం శ్రీమతి వాణి కూడా కళాకారిణి కావడంతో తన సాధనకు చేయూత లభించిందని ఆయన చెబుతుంటారు. అంతేకాకుండా కాలేజీ రోజుల నుంచి తన సహ విద్యార్థి అయిన ప్రముఖ చిత్రకారుడు ఆంజనేయులు, బ్రహ్మంది విడదీయరాని స్నేహబంధం. ఎవరి సాధన వారు చేస్తున్నా ఒకే రూమ్‌లో ఉండటం, వివాహాలైన తర్వాత కూడా ఒకే నివాసంలో పక్కపకనే ఉండటంతోపాటు ఒకే స్టూడియోలో ఇప్పటికీ పెయింటింగ్ వేసుకుంటూ స్నేహానికి నిర్వచనంగా నిలుస్తున్నారు. టార్గెట్ 2020 రెండేళ్ల క్రితం ప్రముఖ చిత్రకారుడు పద్మశ్రీ జగదీశ్ మిట్టల్ బ్రహ్మం డ్రాయింగ్ కొనుగోలు చేసి తన నివాసంలోని హాల్లో అలంకరించుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మం దృష్టి 2020లో ఢిల్లీలో నిర్వహించనున్న పెయింటింగ్ ఎగ్జిబిషన్పైనే ఉంది. పదహారు కళాకండాలతో పద్రర్శించబోయే ఈ సోలో ప్రదర్శనలో శేషబ్రహ్మం విజేతగా నిలవాలని ఆశిద్దాం. -
సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది..
లాస్ ఏంజెలిస్: సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దదైన కృష్ణబిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీర్ఘవృత్తాకారంలో ఉండే భారీ పాలపుంతలో ఏర్పడిన కృష్ణ బిలం (బ్లాక్ హోల్) సూర్యుడితో పోల్చి చూస్తే 60 కోట్ల రెట్లు పెద్దదిగా ఉన్నట్లు కాలిఫోర్నియా వర్సిటీ, ఇర్విన్ (యూసీఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అర్రే (ఏఎల్ఎంఏ) నుంచి హై రిజల్యూషన్ డేటాను సేకరించి ఈ భారీ కృష్ణబిలం కొలతను కనుగొన్నారు. ‘ఎన్జీసీ 1332’ అనే పాలపుంత కృష్ణబిలం మధ్యలో తిరుగుతున్న చల్లటి పరమాణు వాయువు, ధూళి వేగాన్ని లెక్కించారు.