మన భూమి మీద జీవజాలం బతుకుతుందుంటే సూర్యుడు చలవే అని చెప్పుకోక తప్పదు. ఆ సూర్యుని వెలుతురే మొక్కలు ఆహారం. ఆ మొక్కలు తిని చాలా జంతువులు జీవనం సాగిస్తాయి. అలాంటి సూర్యుడు లేకుంటే అసలు ఈ భూమి మీద జీవమే లేదు. అయితే ఈ సృష్టికి ప్రతిసృష్టి చేయడానికి ఈ చైనా శాస్త్రవేత్తలు ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా లాంటి జీవులను పుట్టించి ప్రపంచ వినాశనానికి కేంద్రమైన చైనీయులు తాజాగా కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తున్నారు.
అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్(ఈస్ట్) అని పిలువబడే టెక్నాలజీ సహాయంతో చైనా "కృత్రిమ సూర్యుడి"ని సృష్టిస్తుంది. కృత్రిమ సూర్యుని ప్రయోగ పరీక్షలో భాగంగా 70 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను దాదాపు 17 నిమిషాల 36 సెకన్ల పాటు విజయవంతంగా ఉత్పత్తి చేసింది. ఇది నిజమైన సూర్యుడి కంటే దాదాపు ఐదు రెట్లు వేడిగా ఉంటుంది. సూర్యుని కోర్ వద్ద 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అణు సంలీన శక్తిలో భాగంగా హైడ్రోజన్, డ్యూటీరియం వాయువులను ఇంధనంగా ఉపయోగించి సూర్యుడి వలే అణు కలయిను ప్రేరేపించడం ద్వారా ఈ స్వచ్ఛమైన శక్తిని నిరంతరం ఉత్పత్తి చేసి సరఫరా చేయవచ్చని చైనా శాస్త్రవేత్తలు నిరూపించారు. అయితే, ఈ ప్రయోగ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రయోగం వల్ల భూమి అంతం కానుందా అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రయోగంలో భాగంగా న్యూక్లియర్ ఫ్యూజన్ పవర్ భారీ హైడ్రోజన్, డ్యూటిరియం పరమాణువులను ఢీకొట్టి హీలియంను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు భారీ మొత్తంలో శక్తి విడుదల అవుతుంది. ఇది మన సూర్యుడి వంటి నక్షత్రాలలో సహజంగా జరిగే ప్రక్రియ.. దాన్ని చైనా శాస్త్రవేత్తలు కృత్రిమంగా రూపొందించి ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేశారు. చైనాలోని తూర్పు ప్రావిన్స్ అన్హుయిలోని హెఫీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ లో తాజా ప్రయోగం జరిగింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక 10,000 కంటే ఎక్కువ మంది చైనీస్, విదేశీ శాస్త్రీయ పరిశోధకులు ప్రాజెక్టులో భాగంగా పనిచేస్తున్నారని తెలపింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 7,060 కోట్లు వ్యయం చేస్తున్నట్లు తెలుస్తుంది. 2040 నాటికి ఈ కృత్రిమ సూర్యుని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
(చదవండి: రిలయన్స్ జియో కీలక నిర్ణయం..! ఇక యూజర్లకు పండగే..?)
Comments
Please login to add a commentAdd a comment