Artificial Sun
-
చైనా మరో కీలక ప్రయోగం.. భూమి అంతం కానుందా?
మన భూమి మీద జీవజాలం బతుకుతుందుంటే సూర్యుడు చలవే అని చెప్పుకోక తప్పదు. ఆ సూర్యుని వెలుతురే మొక్కలు ఆహారం. ఆ మొక్కలు తిని చాలా జంతువులు జీవనం సాగిస్తాయి. అలాంటి సూర్యుడు లేకుంటే అసలు ఈ భూమి మీద జీవమే లేదు. అయితే ఈ సృష్టికి ప్రతిసృష్టి చేయడానికి ఈ చైనా శాస్త్రవేత్తలు ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా లాంటి జీవులను పుట్టించి ప్రపంచ వినాశనానికి కేంద్రమైన చైనీయులు తాజాగా కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తున్నారు. అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్(ఈస్ట్) అని పిలువబడే టెక్నాలజీ సహాయంతో చైనా "కృత్రిమ సూర్యుడి"ని సృష్టిస్తుంది. కృత్రిమ సూర్యుని ప్రయోగ పరీక్షలో భాగంగా 70 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను దాదాపు 17 నిమిషాల 36 సెకన్ల పాటు విజయవంతంగా ఉత్పత్తి చేసింది. ఇది నిజమైన సూర్యుడి కంటే దాదాపు ఐదు రెట్లు వేడిగా ఉంటుంది. సూర్యుని కోర్ వద్ద 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అణు సంలీన శక్తిలో భాగంగా హైడ్రోజన్, డ్యూటీరియం వాయువులను ఇంధనంగా ఉపయోగించి సూర్యుడి వలే అణు కలయిను ప్రేరేపించడం ద్వారా ఈ స్వచ్ఛమైన శక్తిని నిరంతరం ఉత్పత్తి చేసి సరఫరా చేయవచ్చని చైనా శాస్త్రవేత్తలు నిరూపించారు. అయితే, ఈ ప్రయోగ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రయోగం వల్ల భూమి అంతం కానుందా అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రయోగంలో భాగంగా న్యూక్లియర్ ఫ్యూజన్ పవర్ భారీ హైడ్రోజన్, డ్యూటిరియం పరమాణువులను ఢీకొట్టి హీలియంను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు భారీ మొత్తంలో శక్తి విడుదల అవుతుంది. ఇది మన సూర్యుడి వంటి నక్షత్రాలలో సహజంగా జరిగే ప్రక్రియ.. దాన్ని చైనా శాస్త్రవేత్తలు కృత్రిమంగా రూపొందించి ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేశారు. చైనాలోని తూర్పు ప్రావిన్స్ అన్హుయిలోని హెఫీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ లో తాజా ప్రయోగం జరిగింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక 10,000 కంటే ఎక్కువ మంది చైనీస్, విదేశీ శాస్త్రీయ పరిశోధకులు ప్రాజెక్టులో భాగంగా పనిచేస్తున్నారని తెలపింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 7,060 కోట్లు వ్యయం చేస్తున్నట్లు తెలుస్తుంది. 2040 నాటికి ఈ కృత్రిమ సూర్యుని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: రిలయన్స్ జియో కీలక నిర్ణయం..! ఇక యూజర్లకు పండగే..?) -
ప్రపంచ రికార్డు నెలకొల్పిన దక్షిణి కొరియా శాస్త్రవేత్తలు
ప్రపంచంలో ప్రస్తుతం చాలా దేశాలు కృత్రిమ సూర్యుడిని రూపొందించే పనిలో ఉన్నాయి. కృత్రిమ సూర్యుడి తయారీ కోసం ఒక దేశంతో మరో దేశం పోటీ పడుతున్నాయి. ఇప్పటికే చైనా న్యూక్లియర్ ల్యాబ్‌లో ఓ కృత్రిమ సూర్యుడిని సృష్టించింది. దీనిని ‘హెచ్ఎం2 టోకామర్ రియాక్టర్’ అని పేరుతో పిలుస్తున్నారు. చైనా తయారు చేసిన కృత్రిమ సూర్యుడు నిజమైన సూర్యుడు కంటే అధిక శక్తిని, వేడిని విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కూడా కే-స్టార్(KSTAR) అనే కృత్రిమ సూర్యుడిని రూపొందించినట్లు పేర్కొన్నారు. సూర్యుని యొక్క కోర్ వద్ద 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. గతంలో తయారు చేసిన కృత్రిమ సూర్యుడిని 100 మిలియన్ డిగ్రీల వద్ద కేవలం 10 సెకెన్ల పాటు మండించారు. అయితే ఇప్పుడు దక్షిణి కొరియా శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యుడిని 100 మిలియన్ డిగ్రీలపై ఉష్ణోగ్రత వద్ద 20 సెకన్ల పైగా మండించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. (చదవండి: ఫేమస్ అవ్వాలని బాంబు పెట్టాడు!) నివేదికల ప్రకారం, దక్షిణ కొరియా భౌతిక శాస్త్రవేత్తల బృందం కృత్రిమ సూర్యుడు కే-స్టార్(కొరియా సూపర్ కండక్టింగ్ టోకామాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్) అని పిలువబడే ప్రయోగం కోసం సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ పరికరాన్ని ఉపయోగించారు. ఇందులో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిపి ఏకంగా 10 కోట్ల డిగ్రీల వేడిని పుట్టించారు. దక్షిణి కొరియా సియోల్ నేషనల్ యూనివర్శిటీ, యునైటెడ్ స్టేట్స్ యొక్క కొలంబియా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా కలిసి కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీలోని పరిశోధనా కేంద్రంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 2018లో మొదటిసారిగా నిర్వహించిన KSTAR ప్రయోగం 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కేవలం 1.5 సెకన్ల పాటు మాత్రమే మండించారు. 2025 నాటికి ఒకేసారి 300 సెకన్ల పాటు ఫ్యూజన్ జ్వలన సాధించడమే ఈ సంస్థ లక్ష్యం అని నివేదిక తెలిపింది. -
చైనా సంచలనం; సూర్యుడి ప్రతిసృష్టి!
బీజింగ్: కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనాపై ప్రపంచ దేశాలు అసహనంతో ఉన్నాయి. తన తీరుతో ఇతర దేశాలకు ఆగ్రహం తెప్పించే డ్రాగన్ దేశం తాజాగా అవే దేశాలు మెచ్చుకునేలా చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా టెక్నాలజీతో ప్రయోగాలు చేయడంలో ముందుంటుంది. అలా అత్యాధునిక సాంకేతికతను తన సొంతం చేసుకుంటూ అగ్రరాజ్యం అమెరికాను సైతం వణికేలా చేస్తుంది. అయితే సృష్టికి ప్రతిసృష్టి అన్నట్టుగా ఈ డ్రాగన్ దేశం తాజాగా కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది. తన సాంకేతికతతో ఆర్టిఫిషియల్ సన్ను తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తమ దేశ శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యుడిని విజయవంతంగా తయారు చేసినట్లు మంగళవారం చైనా ప్రభుత్వ మీడియా ప్రకటించింది. ఈ సూర్యుడి పేరు హెచ్ఎల్-2ఎమ్ టోకామాక్ రియాక్టర్. ఇది చైనాలో అతి పెద్ద, అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగ పరిశోధనా పరికరమని.. ఇది న్యూక్లియర్ ఎనర్జీని విజయవంతంగా ఇవ్వగలదని సైంటిస్టుల అంచనా. అయితే ప్రపంచ దేశాలు ఎప్పుడు తనవైపే చూడాలన్నది చైనా కోరిక. అందుకే ఏకంగా సూర్యుడినే తయారు చేసి సాంకేతికపరంగా ఇతర దేశాలు తమ వైపు చూసేలా ప్రయోగం చేసి చూపించింది. (చదవండి: యూఎస్ తర్వాత ఆ రికార్డు చైనాదే..) చైనా తయారు చేసిన కృత్రిమ సూర్యుడు అత్యంత శక్తివంతమైన మాగ్నెటిక్ ఫీల్డ్‌ను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ న్యూక్లీయర్ గుండా వేడి ప్లాస్మాను విచ్చిన్నం చేసి దాని ద్వారా 15 కోట్ల డిగ్రీల సెల్సియస్(అసలు సూర్యుడి మధ్య భాగంలో ఉండే వేడి కంటే 10 రెట్లు ఎక్కువ) ఎనర్జీని విడుదల చేయగలదని చైనా ‘పీపుల్స్ డైలీ’ వెల్లడించింది. ఇది ఎక్కువ పవర్ రిలీజ్ చేస్తున్నందున దీన్ని ‘ఆర్టిఫిషియల్ సన్’గా పిలుస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే సూర్యుడి పరమాణు కేంద్రంలో విపరీతమైన సూపర్ పవర్ ఉంటుంది. అణువులను విచ్ఛిన్నం చేస్తే దాని నుంచి విపరీతమైన ఎనర్జీ విడుదలవతుంది. అందుకే ఈ రియాక్టర్ ద్వారా చైనా పరిశోధకులు అదే చేశారు. కాగా ఈ రియాక్టర్ వాయువ్య చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉంది. 2019లోనే చైనా దీని నిర్మాణాన్ని పూర్తి చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకే చైనా ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. 2006 నుంచి ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ తయారీపై చైనా సైంటిస్టులు దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ కూడా ప్రపంచంలోనే అతి పెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ తయారు చేస్తోంది. అది 2025 నాటికి పూర్తికానుందని ప్రాన్స్ సైంటిస్టులు భావిస్తున్నారు. (చదవండి: చైనా సూపర్ సైనికులను సృష్టిస్తోంది: అమెరికా) -
కృత్రిమ సూర్యుడిని సృష్టించిన జర్మనీ
బెర్లిన్: హైడ్రోజన్ వాయువును మండించడం వల్ల అపార ఇంధన శక్తి లభిస్తుంది. అలా మండించడం వల్ల ఎలాంటి కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి వెలువడవు. అందుకని భవిష్యత్తులో అన్నిరకాల ఇంధన వనరులకు హైడ్రోజన్‌పైనే ఆధారపడాల్సి వస్తుంది. అయితే భూవాతావరణంలో హైడ్రోజన్ వాయువు సహజసిద్ధంగా దొరకదు. నీటి ఆవిరితో కలసి ఉంటుంది. అత్యంత ఉష్ణోగ్రతతో సూర్య కిరణాలు తగిలినప్పుడు మాత్రమే నీటి నుంచి ఈ వాయువు విడిపోతుంది. నీటి నుంచి హైడ్రోజన్ వాయువును విడదీయడం కోసం జర్మనీ శాస్త్రవేత్తలు కత్రిమ సూర్యుడినే సష్టించారు. కలోగ్నికి 30 కిలోమీటర్ల దూరంలోని జూలిచ్ వద్ద ఈ కత్రిమ సూర్యుడిని నిర్మించారు. సహజ సూర్యకాంతిని ప్రతిబింబించడం కోసం సినిమా షూటింగ్లో వాడే 149 ఆర్క్లైట్లను అతిపెద్ద తేనెటీగా తెట్టులాగా అమర్చారు. ఈ ఆర్క్లైట్లను అధికారికంగా ‘సిన్లైట్స్’ అని పిలుస్తారు. ఆ అన్ని లైట్ల నుంచి వచ్చే కాంతిని ఎనిమిది అంగుళాల పొడువు, వెడల్పు కలిగిన ఓ పలకపై పడేలా చేశారు. అంతే స్థలంలో ప్రసరించే సూర్యుడి రేడియేషన్‌కన్నా పదివేల రెట్ల రేడియేషన్ ఈ లైట్ల వల్ల ఉత్పత్తి అయినట్లు ప్రయోగంలో తేలింది. ఇది మూడు వేల డిగ్రీల సెల్సియస్‌కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. హైడ్రోజన్‌ను తేమ నుంచి ఒడిసిపట్టుకోవాలంటే ఎక్కువ ఉష్ణోగ్రత అవసరమని ఈ ప్రయోగం నిర్వహించిన జర్మన్ ఏరోస్సేస్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్తులో హైడ్రోజన్ ఇంధనాన్ని అధికంగా ఉపయోగించేందుకు తమ ప్రయోగం ఉపయోగంగా పడుతుందని వారన్నారు. ముందుగా సహజ సూర్యశక్తిని పెంచే ప్రయోగమే నిర్వహించాలనుకున్నామని, దానికన్నా కత్రిమ సూర్యుడిని సష్టించడం కూడా ఉపయోగకరం, సులభమని ఆలోచించి ఈ ప్రయోగం నిర్వహించామని వారు వివరించారు. -
సూర్యుడికే కళ్లు చెదిరే కాంతి!
-
సూర్యుడికే కళ్లు చెదిరే కాంతి!
కాలుష్యం తగ్గాలి. భూమి పచ్చగా ఉండాలి. ఇలా కోరుకోని వారెవరూ ఉండరుగానీ.. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. అన్నింటికంటే ముందుగా... కాలుష్యాన్ని పెంచేస్తున్న పెట్రోలు, డీజిళ్లకు సరైన ప్రత్యామ్నాయం దొరకాలి. ఇదిగో... పక్క ఫొటోల్లో కనిపిస్తున్న సెటప్ అంతా అందు కోసమే! అర్థం కావడం లేదా? కొంచెం సింపుల్‌గా అర్థంచేసుకునేందుకు ప్రయత్నిద్దాం. విశ్వం మొత్తమ్మీద అత్యంత విస్తారంగా లభించే హైడ్రోజన్ గురించి మీరు వినే ఉంటారు. రెండు హైడ్రోజన్ అణువులు ఒక ఆక్సిజన్‌తో కలసి నీరవుతుందనీ మీకు తెలుసు. అయితే ఈ వాయువు అత్యంత సమర్థమైన ఇంధనమని... కాలుష్యం కూడా దాదాపు ఉండదని కొద్దిమందికే తెలుసు. అందుకే కొంచెం కష్టమైనప్పటికీ ఉపగ్రహ ప్రయోగాల్లో హైడ్రోజన్‌నే ఇంధనంగా వాడుతూంటారు. ఇప్పుడు ఫొటోల విషయానికి వద్దాం. పెళ్లిళ్లు, బహిరంగ సమావేశాల్లో ఇలాంటి ఫోకస్ లైట్లు వాడటం మీరు చూసే ఉంటారు. జర్మన్ అంతరిక్ష కేంద్రం ఇలాంటి 149 జినాన్ లైట్లను ఒక్కదగ్గర ఏర్పాటు చేసింది. ఒక్కో లైట్ సామర్థ్యం దాదాపు ఏడు కిలోవాట్లు. వీటన్నింటినీ ఒక్కసారి ఆన్ చేస్తే పుట్టే వెలుగు తాలూకూ శక్తి ఎంతుంటుందో తెలుసా? భూమిని తాకే సూర్యుడి శక్తికంటే పదివేల రెట్లు ఎక్కువ! పుట్టే వేడి కూడా దాదాపు మూడు వేల డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుంది. ఈ వెలుతురును కేవలం 20 చదరపు సెంటీమీటర్ల విస్తీర్ణమున్న ప్రాంతంపైకి కేంద్రీకరించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఇంకోలా చెప్పాలంటే భూమ్మీద మరో సూర్యుడిని సృష్టించారన్నమాట! ఇదంతా ఎందుకూ అంటే.. శుద్ధమైన ఇంధనం హైడ్రోజన్‌ను సులువుగా తయారు చేసే పద్ధతులను తెలుసుకునేందుకే అంటున్నారు శాస్త్రవేత్తలు. సూర్యరశ్మిని నీటిపై ప్రసరింప చేసి హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొట్టడంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఈ ప్రయోగాల ద్వారా పరిష్కరిస్తామని అంటున్నారు. ఆ ఇబ్బందులను తొలగిస్తే ఎంచక్కా హైడ్రోజన్‌ను ధారాళంగా వినియోగించుకుని కాలుష్యాలను తగ్గించుకోవచ్చు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘కృత్రిమ సూర్యుడి’ని పరీక్షించిన శాస్త్రజ్ఞులు
బెర్లిన్: పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తికి దోహదపడేలా కాంతిని ఉపయోగించే పరీక్షను జర్మనీ శాస్త్రజ్ఞులు గురువారం చేపట్టారు. ఒకే ఫ్రేములో 149 స్పాట్లైట్లను అమర్చి వాటిని గురువారం స్విచాన్ చేసి పరీక్షించారు. ఈ 149 లైట్ల ఫ్రేమును అధికారికంగా ‘సిన్‌లైట్’అని పిలుస్తారు. అలాగే ప్రపంచపు అతిపెద్ద కృత్రిమ సూర్యుడిగా దీనిని వ్యవహరిస్తున్నారు. జర్మనీలోని జ్యూలిచ్‌లో జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ పరీక్షను నిర్వహించారు. 149 లైట్ల కాంతిని కేవలం 20 చదరపు సెంటీమీటర్లున్న ఒక ప్రదేశంపైకి ప్రసరించేలా ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ ప్రదేశం సాధారణం కన్నా పదివేల రెట్ల ఎక్కువ రేడియేషన్‌తో వెలిగిపోయింది. అక్కడ దాదాపు 3 వేల డిగ్రీ సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు ఉండేలా చూసి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి కొత్త మార్గాలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. హైడ్రోజన్ మండినప్పుడు కర్బన ఉద్గారాలు వెలువడవు. తద్వారా గ్లోబల్ వార్మింగ్‌కు హైడ్రోజన్ కారణమవ్వదు. అందువల్ల దానిని భవిష్యత్తు ఇంధనంగా చాలా మంది భావిస్తున్నారు. కానీ హైడ్రోజన్ సహజంగా ప్రకృతిలో దొరకదు. నీటి నుంచి దానిని విడదీయాలి. దీనికి పెద్దమొత్తంలో విద్యుత్తు అవసరం. అంత విద్యుత్తు వాడకుండా సూర్యకాంతితో హైడ్రజోజన్ను ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ పరీక్షను నిర్వహించారు.