బెర్లిన్: పర్యావరణ అనుకూల ఇంధన ఉత్పత్తికి దోహదపడేలా కాంతిని ఉపయోగించే పరీక్షను జర్మనీ శాస్త్రజ్ఞులు గురువారం చేపట్టారు. ఒకే ఫ్రేములో 149 స్పాట్‌లైట్లను అమర్చి వాటిని గురువారం స్విచాన్ చేసి పరీక్షించారు. ఈ 149 లైట్ల ఫ్రేమును అధికారికంగా ‘సిన్‌లైట్’అని పిలుస్తారు. అలాగే ప్రపంచపు అతిపెద్ద కృత్రిమ సూర్యుడిగా దీనిని వ్యవహరిస్తున్నారు.
జర్మనీలోని జ్యూలిచ్‌లో జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ పరీక్షను నిర్వహించారు. 149 లైట్ల కాంతిని కేవలం 20 చదరపు సెంటీమీటర్లున్న ఒక ప్రదేశంపైకి ప్రసరించేలా ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ ప్రదేశం సాధారణం కన్నా పదివేల రెట్ల ఎక్కువ రేడియేషన్‌తో వెలిగిపోయింది. అక్కడ దాదాపు 3 వేల డిగ్రీ సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు ఉండేలా చూసి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి కొత్త మార్గాలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు.
హైడ్రోజన్ మండినప్పుడు కర్బన ఉద్గారాలు వెలువడవు. తద్వారా గ్లోబల్ వార్మింగ్‌కు హైడ్రోజన్ కారణమవ్వదు. అందువల్ల దానిని భవిష్యత్తు ఇంధనంగా చాలా మంది భావిస్తున్నారు. కానీ హైడ్రోజన్ సహజంగా ప్రకృతిలో దొరకదు. నీటి నుంచి దానిని విడదీయాలి. దీనికి పెద్దమొత్తంలో విద్యుత్తు అవసరం. అంత విద్యుత్తు వాడకుండా సూర్యకాంతితో హైడ్రజోజన్‌ను ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ పరీక్షను నిర్వహించారు.
‘కృత్రిమ సూర్యుడి’ని పరీక్షించిన శాస్త్రజ్ఞులు
Published Fri, Mar 24 2017 9:47 AM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM
Advertisement
Advertisement