
కృత్రిమ సూర్యుడిని సృష్టించిన జర్మనీ
బెర్లిన్: హైడ్రోజన్ వాయువును మండించడం వల్ల అపార ఇంధన శక్తి లభిస్తుంది. అలా మండించడం వల్ల ఎలాంటి కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి వెలువడవు. అందుకని భవిష్యత్తులో అన్నిరకాల ఇంధన వనరులకు హైడ్రోజన్‌పైనే ఆధారపడాల్సి వస్తుంది. అయితే భూవాతావరణంలో హైడ్రోజన్ వాయువు సహజసిద్ధంగా దొరకదు. నీటి ఆవిరితో కలసి ఉంటుంది. అత్యంత ఉష్ణోగ్రతతో సూర్య కిరణాలు తగిలినప్పుడు మాత్రమే నీటి నుంచి ఈ వాయువు విడిపోతుంది. నీటి నుంచి హైడ్రోజన్ వాయువును విడదీయడం కోసం జర్మనీ శాస్త్రవేత్తలు కత్రిమ సూర్యుడినే సష్టించారు.
కలోగ్నికి 30 కిలోమీటర్ల దూరంలోని జూలిచ్ వద్ద ఈ కత్రిమ సూర్యుడిని నిర్మించారు. సహజ సూర్యకాంతిని ప్రతిబింబించడం కోసం సినిమా షూటింగ్‌లో వాడే 149 ఆర్క్‌లైట్లను అతిపెద్ద తేనెటీగా తెట్టులాగా అమర్చారు. ఈ ఆర్క్‌లైట్లను అధికారికంగా ‘సిన్‌లైట్స్’ అని పిలుస్తారు. ఆ అన్ని లైట్ల నుంచి వచ్చే కాంతిని ఎనిమిది అంగుళాల పొడువు, వెడల్పు కలిగిన ఓ పలకపై పడేలా చేశారు. అంతే స్థలంలో ప్రసరించే సూర్యుడి రేడియేషన్‌కన్నా పదివేల రెట్ల రేడియేషన్ ఈ లైట్ల వల్ల ఉత్పత్తి అయినట్లు ప్రయోగంలో తేలింది.
ఇది మూడు వేల డిగ్రీల సెల్సియస్‌కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. హైడ్రోజన్‌ను తేమ నుంచి ఒడిసిపట్టుకోవాలంటే ఎక్కువ ఉష్ణోగ్రత అవసరమని ఈ ప్రయోగం నిర్వహించిన జర్మన్ ఏరోస్సేస్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్తులో హైడ్రోజన్ ఇంధనాన్ని అధికంగా ఉపయోగించేందుకు తమ ప్రయోగం ఉపయోగంగా పడుతుందని వారన్నారు. ముందుగా సహజ సూర్యశక్తిని పెంచే ప్రయోగమే నిర్వహించాలనుకున్నామని, దానికన్నా కత్రిమ సూర్యుడిని సష్టించడం కూడా ఉపయోగకరం, సులభమని ఆలోచించి ఈ ప్రయోగం నిర్వహించామని వారు వివరించారు.