ప్రపంచంలో ప్రస్తుతం చాలా దేశాలు కృత్రిమ సూర్యుడిని రూపొందించే పనిలో ఉన్నాయి. కృత్రిమ సూర్యుడి తయారీ కోసం ఒక దేశంతో మరో దేశం పోటీ పడుతున్నాయి. ఇప్పటికే చైనా న్యూక్లియర్ ల్యాబ్‌లో ఓ కృత్రిమ సూర్యుడిని సృష్టించింది. దీనిని ‘హెచ్ఎం2 టోకామర్ రియాక్టర్’ అని పేరుతో పిలుస్తున్నారు. చైనా తయారు చేసిన కృత్రిమ సూర్యుడు నిజమైన సూర్యుడు కంటే అధిక శక్తిని, వేడిని విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కూడా కే-స్టార్(KSTAR) అనే కృత్రిమ సూర్యుడిని రూపొందించినట్లు పేర్కొన్నారు. సూర్యుని యొక్క కోర్ వద్ద 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. గతంలో తయారు చేసిన కృత్రిమ సూర్యుడిని 100 మిలియన్ డిగ్రీల వద్ద కేవలం 10 సెకెన్ల పాటు మండించారు. అయితే ఇప్పుడు దక్షిణి కొరియా శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యుడిని 100 మిలియన్ డిగ్రీలపై ఉష్ణోగ్రత వద్ద 20 సెకన్ల పైగా మండించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. (చదవండి: ఫేమస్ అవ్వాలని బాంబు పెట్టాడు!)
నివేదికల ప్రకారం, దక్షిణ కొరియా భౌతిక శాస్త్రవేత్తల బృందం కృత్రిమ సూర్యుడు కే-స్టార్(కొరియా సూపర్ కండక్టింగ్ టోకామాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్) అని పిలువబడే ప్రయోగం కోసం సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ పరికరాన్ని ఉపయోగించారు. ఇందులో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిపి ఏకంగా 10 కోట్ల డిగ్రీల వేడిని పుట్టించారు. దక్షిణి కొరియా సియోల్ నేషనల్ యూనివర్శిటీ, యునైటెడ్ స్టేట్స్ యొక్క కొలంబియా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు సంయుక్తంగా కలిసి కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీలోని పరిశోధనా కేంద్రంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 2018లో మొదటిసారిగా నిర్వహించిన KSTAR ప్రయోగం 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కేవలం 1.5 సెకన్ల పాటు మాత్రమే మండించారు. 2025 నాటికి ఒకేసారి 300 సెకన్ల పాటు ఫ్యూజన్ జ్వలన సాధించడమే ఈ సంస్థ లక్ష్యం అని నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment