ఉపగ్రహాలు, గ్రిడ్లపై పెను ప్రభావం
ఆఫ్రికాలో రేడియో బ్లాకౌట్లు
సౌరప్రకోపం భూమిని అల్లాడించనుంది. సూర్యుని కొంతకాలంగా అల్లకల్లోలంగా ఏఆర్3842 సన్‌స్పాట్ మరోసారి బద్దలైంది. ఎక్స్9.1 కేటగిరీలోకి వచ్చే అత్యంత అత్యంత శక్తిమంతమైన సోలార్ ఫ్లేర్‌కు దారితీసింది. దీని దెబ్బకు భూమి ఎగువ వాతావరణమంతా పూర్తిగా అయోనీకరణం చెందింది! ఈ పేలుడు ధాటికి పుట్టుకొచి్చన శక్తిమంతమైన సౌర జ్వాలలు ఆదివారం భూమిని గట్టిగా తాకనున్నాయి. ఇప్పటికే సూర్యునిలో సంభవించిన కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) దీనికి తోడవనుంది. ఫలితంగా భూ అయస్కాంత తుఫాన్లు ఏర్పడి, పెద్దపెట్టున విడుదలయ్యే రేడియేషన్ ప్రపంచమంతటా ప్రభావం చూపనుంది. దెబ్బకు ఉపగ్రహాలతో పాటు పలు దేశాల్లో పవర్ గ్రిడ్లతో పాటు నావిగేషన్ వ్యవస్థలు కూడా మొరాయించే ప్రమాదముంది. ముఖ్యంగా ఆఫ్రికాతో పాటు అట్లాంటిక్ దక్షిణ ప్రాంతంలోని పలు దేశాల్లో షార్ట్‌వేవ్ రేడియో బ్లాకౌట్లు సంభవించవచ్చని సైంటిస్టులు హెచ్చరించారు. రేడియో ఆపరేటర్లకు కనీసం అరగంటకు సిగ్నల్స్ అందబోవని వివరించారు. వీటివల్ల అరోరాలు (కాంతి వల యాలు) ఏర్పడనున్నాయి.
కొంతకాలంగా ఉగ్ర రూపు
సూర్యుడు ప్రస్తుతం తన 25వ సౌరచక్రం మధ్యలో ఉన్నాడు. దాంతో కొంతకాలంగా ఉగ్రరూపు దాలుస్తున్నాడు. సోలార్ మాగ్జిమంగా పేర్కొనే ఈ పరిస్థితులు ఊహించిన దానికంటే ముందే సంభవిస్తున్నట్టు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంసూర్యునిపై నిరంతర పేలుళ్లకు, సన్‌స్పాట్స్‌కు, సీఎంఈలకు దారి తీస్తుంది. ఇవి భూమిపై పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment