‘క్యూరియాసిటీ’ రివర్స్‌గేర్! | curiosity reverse gear | Sakshi
Sakshi News home page

‘క్యూరియాసిటీ’ రివర్స్‌గేర్!

Published Mon, Feb 24 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM

‘క్యూరియాసిటీ’ రివర్స్‌గేర్!

‘క్యూరియాసిటీ’ రివర్స్‌గేర్!

 వంద మీటర్లు వెనక్కి నడిచిన రోవర్


 వాషింగ్టన్: అంగారకుడి పై పరిశోధనలు జరుపుతున్న నాసా రోవర్ ‘క్యూరియాసిటీ’ చక్కని విన్యాసం పూర్తిచేసింది. 100.3 మీటర్ల దూరం వెనక్కి నడిచింది. ఈ నెల 18న దాదాపు  సమతలంగా ఉన్న ప్రాంతంలో ఈ ఫీట్ చేసింది.
 
  రాళ్లురప్పలపై వెళ్లేటప్పుడు రోవర్ చక్రాలు దెబ్బతినకుండా ఉండేందుకు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు నాసా శాస్త్రవేత్తలు దీన్ని నిర్వహించారు. క్యూరియాసిటీ అల్యూమినియం చక్రాలకు ఊహించినదానికంటే ముందే రంధ్రాలు పడ్డట్టు గత ఏడాది చివర్లో గుర్తించడంతో ఈ ప్రయోగం చేశారు. అంగారకుడిపై జీవం ఆనవాళ్ల అన్వేషణ కోసం క్యూరియాసిటీని మౌంట్ షార్ప్ కొండ  దిశగా తీసుకెళ్తుండడం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement