గ్రహాంతరవాసుల వస్తువేనా? | aliens found in spain country and they afraid on that matter | Sakshi
Sakshi News home page

గ్రహాంతరవాసుల వస్తువేనా?

Published Wed, Nov 11 2015 2:51 PM | Last Updated on Sun, Sep 3 2017 12:22 PM

గ్రహాంతరవాసుల వస్తువేనా?

గ్రహాంతరవాసుల వస్తువేనా?

మిస్టరీ కంటిన్యూస్..
అంతుచిక్కని రహస్యమొకటి స్పెయిన్‌వాసులను కలవరపరుస్తోంది. అకస్మాత్తుగా పంటపొలాల్లో పెద్దపెద్ద గొయ్యిలు ఏర్పడడం.., వింతైన గోళాకారపు వస్తువులు ఆకాశంలో నుంచి అమాతంగా వచ్చిపడుతుండడంతో ఆ దేశంలోని కలస్పార్రా ప్రాంత ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పంటపొలాల్లో గొయ్యిలు ఎందుకు ఏర్పడుతున్నాయి? అంతరిక్షం  నుంచి అమాంతంగా వచ్చిపడుతున్న ఆ వస్తువులేంటి? అవి తమ ప్రాంతంలోనే ఎందుకు పడుతున్నాయి? జవాబు చెప్పమంటూ స్థానిక అధికారులను, శాస్త్రవేత్తలను నిలదీస్తున్నారు.
 
ఐదు రోజుల్లో ఇది రెండోసారి..
ఈ నెల 3వ తేదీన నల్లని రంగులో, గోళాకారంలో ఉన్న వస్తువు ఇక్కడి పంటపొలాల్లో పడింది. అది పడిన చోట పెద్ద గొయ్యి కూడా ఏర్పడింది. దీనిని గమనించిన స్థానిక రైతు విషయాన్ని పోలీసు అధికారికి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చేదాక ఆ వస్తువును జాగ్రత్తగా కాపాడారు. ఆ గోళం ఎక్కడి నుంచి పడింది? ఇంతకీ ఆ వస్తువు ఏ లోహంతో తయారు చేసింది? దానిపై ఉన్న దారపు పోగులవంటి పదార్థమేంటి? తదితర విషయాలపై పరిశోధన చేసేందుకు తీసుకెళ్లారు.

మళ్లీ అలాంటిదే...

శాస్త్రవేత్తలు తమ పరిశోధనను ఒవైపు కొన సాగిస్తుండగానే తాజాగా మంగళవారం మరోసారి అలాంటి ఘటనే పునరావృ తమైంది. 80 డయామీరట్ల వ్యాసా ర్దంతో దాదాపు 20 కేజీల బరువున్న గోళాకారపు వస్తువొకటి మర్సియా ప్రాంతంలో పడింది. కేవలం 9,700 మంది జనాభా ఉండే గూడెంలాంటి ప్రాంతంలో పడిన ఈ వస్తువు కూడా ఆకాశం నుంచే పడినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి.

మరి మండిపోలేదెందుకు?
ఈ వస్తువు గురించి తలోరకంగా చెప్పుకుంటున్నారు. స్వర్గం నుంచి పడిన వస్తువంటూ కొందరు, గ్రహాంతరవాసులు విసిరిన వస్తువంటూ మరికొందరు చెబుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఇంకా స్పష్టమైన వివరాలేవీ వెల్లడించలేకపోతున్నారు. గ్రహశకలమని చెప్పలేమని.., అలాగని మానవులు పంపిన ఉపగ్రహాల తాలూకు వస్తువు కూడా అయి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తల అభిప్రాయంతో ఏకీభవిద్దామన కున్నా.. అంతపై నుంచి భూమిపైకి దూసుకొస్తున్నప్పుడు తప్పనిసరిగా మండిపోవాలి. మండుతున్న వస్తువు నేలపై పడినప్పుడు ఆ ప్రాంతంలోని పంటకు తప్పనిసరిగా నిప్పంటుకోవాలి. కానీ అలాంటిదేమీ జరగలేదని మరికొందరు చెబుతున్నారు.
 
 ‘ప్రజల ఆందోళనకు కారణమవుతున్న ఆ వస్తువు లేమిటో చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అవి ఎక్కడి నుంచి పడుతున్నాయి? ప్రత్యేకించి ఒకే ప్రాంతంలో పడడానికి కారణమేంటో వెల్లడించాలి. మరిన్ని పడే అవకాశముందా? లేదా? అనే విషయం కూడా చెప్పాలి. జనాభా తక్కువగా ఉన్న ప్రాంతంలో పడుతున్నాయి కాబట్టి సరిపోయింది లేదంటే ప్రాణనష్టం తప్పదు కదా! దీన్ని స్పెయిన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి.’
 - కాలస్పర్రా మేయర్ జోస్ వెలెజ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement