mistery
-
గుట్టు విప్పిన సమాధి..
‘తండ్రి సమాధి దగ్గర అన్నదమ్ముల తన్నులాట. ఉత్తరప్రదేశ్‌లోని అజీజ్పూర్లో జరిగిన ఈ సంఘటన ఊళ్లో వాళ్లందరినీ విస్మయానికి గురి చేసింది. శిథిలావస్థకు చేరిన తండ్రి సమాధికి మరమ్మతులు చేయాలని తమ్ముడు, అవసరంలేదు.. ఎలా ఉందో అలాగే ఉంచాలని అన్న పట్టుబట్టడంతో వాదన తగువుగా మారి, చేయి చేసుకోవడం వరకు వెళ్లింది. అన్న మొండిపట్టుపై అనుమానం వచ్చిన తమ్ముడు, అన్న మీద నిఘా పెట్టాడు. ఓ రాత్రివేళ అన్న.. తండ్రి సమాధి పక్కనున్న గుంతలోంచి ఒక కుండను తీసుకెళ్లడం తమ్ముడి కంటబడింది. అన్నకు ఎదురెళ్లి ఆ కుండను లాక్కొని చూశాడు. అందులో బంగారం ఉంది. హతాశుడయ్యాడు. అన్న మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ’ అంటూ చదువుకుపోతున్నాడు ఐటీ ఆఫీస్‌లో.. ఓ ఉద్యోగి.నవ్వుతూ ఆ వార్తను వింటున్న ఓ మహిళా ఉద్యోగికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. వెంటనే తన కొలీగ్ చేతుల్లోంచి ఆ పేపర్ లాక్కొని తమ ఆఫీసర్ క్యుబికల్ వైపు పరుగెత్తినట్టే వెళ్లింది. ఆమె చర్యకు ఆశ్చర్యపోయాడు అప్పటిదాకా వార్త చదివిన కొలీగ్. బాస్ దగ్గరకు వెళ్లిన ఆ మహిళా ఉద్యోగి ‘సర్.. మన లాస్ట్ రైడ్‌లో..’ అని ఏదో చెప్పబోతుండగా..‘లీవిట్ .. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఓ పెద్ద వ్యక్తిని ఇన్సల్ట్ చేసినట్టయింది. డిపార్ట్మెంట్ పరువుపోయింది’ అన్నాడు బాస్ అసహనంగా!‘సర్.. అతని సొంతూరులో.. ’ అని మళ్లీ ఆమె ఏదో చెప్పబోతుండగా.. ‘ఆ విషయాన్ని వదిలేయండి అన్నాను కదా..’ అన్నాడు ఫైల్లోంచి ముఖం బయటపెట్టకుండానే!‘అదికాదు సర్.. అతని సొంతూరు.. ’ అని తన మాటను పూర్తి చేయాలని ఆమె ప్రయత్నిస్తుండగా.. బాస్ మళ్లీ అడ్డుపడుతూ ‘సొంతిల్లు, బంధువుల ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదామ్లు అన్నీ సర్చ్ చేశాం. ఎక్కడా చిల్లి గవ్వ, చిరిగిన డాక్యుమెంట్ కూడా దొరకలేదు’ అన్నాడు కాస్త చిరాగ్గా. ‘బట్ సర్ అతని తండ్రి సమాధి సర్చ్ చేయలేదు కదా’ స్థిరంగా అన్నది ఆ ఉద్యోగిని. అప్పుడు తలెత్తి ఆమె వంక చూశాడు అతను. ఆమె అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.. ‘సర్.. ఆ బడాబాబు, రీసెంట్గా తన తండ్రి పదిహేనో వర్ధంతి సందర్భంగా.. తన పొలంలో ఉన్న తండ్రి సమాధిని రెనోవేట్ చేశాడని మొన్ననే పేపర్లో చదివాను. దాన్నో విశ్రాంతి మందిరంలా తీర్చిదిద్దాడని పేపర్లు తెగ పొగిడాయి’ అంటూ ఆగింది. ‘అయితే ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు. వెంటనే అతని చేతుల్లో తను లాక్కొచ్చిన పేపర్ పెట్టి, ఇందాక తన కొలీగ్ చదివిన వార్తను చూపించింది ఆమె. ఆ వార్త మీద దృష్టిసారించాడు ఆఫీసర్. రెండు నిమిషాల తర్వాత ‘యెస్.. ఎలా మిస్ అయ్యాం ఈ పాయింట్‌ని?’ అన్నాడు పేపర్‌ను మడిచేస్తూ!‘సర్.. ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు!’ అంది ఆమె ఉత్సాహంగా!నాలుగు రోజలకు.. బడాబాబు సొంతూరులోని పొలానికి చేరుకుంది ఐటీ టీమ్. పేపర్లు పొగిడినట్టే అది నిజంగానే సమాధిలా లేదు. వాచ్‌మన్ ఉన్నాడు. తామెవరో చెప్పి, ముందుకు మూవ్ అయ్యారు. ఆ సమాధిని పరిశీలిస్తుండగానే బడాబాబు తన పరివారంతో రెండు కార్లలో అక్కడికి చేరుకున్నాడు. కారు పార్క్ అవుతుండగానే హడావిడిగా కారు దిగి, పరుగెడుతున్నట్టుగా ఐటీ టీమ్‌ని చేరాడు. ‘మా కుటుంబానికి మాత్రమే పర్మిషన్ ఉన్న ప్లేస్ ఇది’ అంటూ బడాబాబు.. ఐటీ ఆఫీసర్ మీదకు పళ్లునూరుతుండగానే ‘కూల్ సర్, మీకు సంబంధించిన అన్ని చోట్లా ఇన్క్లూడింగ్ ఈ సమాధి.. సర్చ్ చేసుకునే పర్మిషన్ మాకుంది’ అంటూ అనుమతుల పత్రం చూపించాడు ఐటీ ఆఫీసర్. ప్యాంట్ జేబులోంచి కర్చీఫ్ తీసుకుని నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు బడాబాబు. పక్కనే ఉన్న అతని అíసిస్టెంట్తో ‘సర్కి మంచినీళ్లు’ అంటూ సైగ చేశాడు ఐటీ ఆఫీసర్. ‘నో థాంక్స్’ అంటూ కోపంగా అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూలబడ్డాడు బడాబాబు. సమాధి చుట్టూ పరిశీలించారు ఐటీ వాళ్లు. అనుమానం ఉన్న చోటల్లా తట్టారు. ఏమీ కనిపించలేదు. రహస్య అరలేవీ తెరుచుకోలేదు. ఇదీ వృథా ప్రయాసే కాదు కదా అనుకుంటూ బడాబాబు వైపు చూశాడు ఐటీ ఆఫీసర్. అతని ముఖంలో చాలా కంగారు కనపడుతోంది. అయితే అంతా కరెక్ట్‌గానే జరుగుతోంది అనే భరోసాకు వచ్చాడు ఐటీ ఆఫీసర్. అతను అలా అనుకుంటున్నాడో లేదో.. ‘సర్’ అంటూ పిలిచాడు ఉద్యోగి. ఒక్క అంగలో అక్కడికి వెళ్లాడు ఆఫీసర్. సరిగ్గా సమాధికి ముందు ఫ్లోరింగ్‌లోని నాలుగు మార్బుల్స్ డిజైన్‌లో ఏదో తేడాగా ఉంది. చూపించాడు ఉద్యోగి. చూశాడు ఆఫీసర్. ప్రత్యేక డిజైన్లా కనపడుతోంది కానీ.. సమ్‌థింగ్ ఫిషీ అనుకున్నాడు. బడాబాబు వైపు చూశాడు. అతనిలో కంగారు ఎక్కువైంది. కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్లారిటీ వచ్చేసింది ఆఫీసర్‌కి.‘సర్..’ పిలిచాడు ఆఫీసర్. ‘ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు బడాబాబు. ‘కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ఇట్?’ అడిగాడు ఆఫీసర్. ‘ఓపెన్ చేయడానికి అదేమన్నా తలుపా?’ బడాబాబు సమాధానం.‘డోర్ అయితే మేమే ఓపెన్ చేసేవాళ్లం. ప్లీజ్ ఓపెన్ ఇట్..’ స్థిరంగా చెప్పాడు ఆఫీసర్. అట్టే బెట్టు చేయక జేబులోంచి రిమోట్ తీసి ఓపెన్ చేశాడు. టెన్ బై టెన్ సైజులోని నేలమాళిగ అది. అందులో అన్నీ లాకర్లే! డబ్బు, బంగారం, వెండి, బంగారు విగ్రహాలు, వజ్రాలు ఎట్సెట్రా చాలానే దొరికాయి. అయినా ఆ ఆఫీసర్ ముఖంలో విజయం తాలూకు ఆనవాళ్లు లేవు. ఎందుకంటే ఆయనకందిన లెక్కలో దొరికినవాటి లెక్క సగం కూడా లేదు. ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని, తిరుగు ప్రయాణమవుతూ ‘ఇంకేదో క్లూ మిస్ అయి ఉంటాం’ అనుకున్నాడు.ఇవి చదవండి: ఈ కిక్కిరిసిన అపార్ట్మెంట్ ఎక్కడుందో తెలుసా!? -
‘డార్లీ.. డార్లీ.. నీకేం కాలేదుగా?’
అ ర్థరాత్రి 2 దాటింది. ఉన్నట్టుండి ‘డా..రిన్.. సేవ్ మీ.. సేవ్ మీ’ అనే ఆర్తనాదాలు వినిపించసాగాయి. గాఢనిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన డారిన్, ఆ గొంతు.. కింద నిద్రపోతున్న తన భార్యదేనని గ్రహించి క్షణాల్లో ‘డార్లీ ఏమైంది?’ అంటూ మెట్లవైపు పరుగుతీశాడు. వెళ్తూ వెళ్తూ లైట్స్ ఆన్ చేశాడు. డార్లీ నొప్పితో రొప్పుతూ గుమ్మం నుంచి బయటికి పరుగులు తీయడం కనిపించింది. ఆమె చేతిలో రక్తమోడుతున్న కత్తి ఉంది. ఆమె పరుగు చూస్తుంటే, ముందు ఎవరో పారిపోతున్నట్లే అనిపించింది. డారిన్ వేగం పెంచాడు.ఇంటికి కాస్తదూరంలో డార్లీ ఆగడం చూసి ‘డార్లీ.. డార్లీ.. నీకేం కాలేదుగా?’ అంటూనే ఆమెను పరిశీలనగా చూశాడు. ఆమె దుస్తుల నిండా రక్తం, ఒంటి మీద కత్తిపోట్లు చూసి డారిన్కి వణుకు పుట్టుకొచ్చింది. ‘డ.. డా..రిన్ .. ఎవ..డో ఇంట్లోకొచ్చి, క.. కత్తితో దాడి చేసి పారిపోయాడు’ అంది డార్లీ వణుకుతున్న స్వరంతో. భార్య మాటలు వినగానే డారిన్ కు ఇంట్లో నిద్రపోతున్న పిల్లలు గుర్తొచ్చారు. ‘íపిల్లలు?!’ అని అరుస్తూనే క్షణాల్లో లోపలికి పరుగుపెట్టాడు. చేతిలోని కత్తి అక్కడే పారేసి, అతడి వెనుకే డార్లీ కూడా పరుగెత్తింది.డార్లీ అరుపులకు కంగారులో బయటికి పరుగు తీసినప్పుడు చూడలేదు కానీ హాల్ అంతా నెత్తుటిమయంగా ఉంది. చాలాచోట్ల మనిషి ఎర్రటి అడుగుజాడలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ పిల్లలు పడుకున్నవైపు వెళ్తుంటే, డారిన్ కి ప్రాణం పోయినట్లు అనిపించింది. ధైర్యం చేసి పిల్లల దగ్గరకు వెళ్లేసరికి ఇద్దరు కొడుకులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.అంబులెన్ ్స వచ్చేసరికే పెద్దకొడుకు ఆరేళ్ల డెవాన్ కన్నుమూశాడు. ఆసుపత్రికి వెళ్లేసరికి రెండో కొడుకు ఐదేళ్ల డామన్ చనిపోయాడు. ఆసుపత్రిలో ఉండగా అప్పటికే కత్తిగాయాలతో అల్లాడుతున్న డార్లీకి సీరియస్ అయిపోయింది. వెంటనే ఐసీయూలో పెట్టి డాక్టర్లు ఆమెకు చికిత్స మొదలుపెట్టారు. ఆ ఇంట్లో ఏ ప్రమాదానికి గురికానివారు ఇద్దరే మిగిలారు. ఒకరు డారిన్ , ఇంకొకరు మూడో కొడుకు డ్రేక్. (ఆ రాత్రి తండ్రితోనే నిద్రపోయాడు) వాడికి 9 నెలలు. దాంతో పోలీసుల కన్ను డారిన్ పైనే పడింది. అయితే 24 గంటలు గడవకముందే కథ అడ్డం తిరిగింది. డార్లీనే పిల్లల్ని చంపి, ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ ఆధారాలు పుట్టుకొచ్చాయి.కత్తి మీద డార్లీ వేలిముద్రలు బలమైన సాక్ష్యాలయ్యాయి. ఇంటి లోపలికి చొరబడటానికి వీలుగా మనిషి పట్టేంత రంధ్రం ఓ తలుపు పక్కనే కనిపించింది. అయితే అక్కడ డార్లీ తల వెంట్రుకలు దొరకడంతో నేరం నుంచి తప్పించుకోవడానికి డార్లీనే ఆ రంధ్రాన్ని చేసుంటుందని అనుమానించారు. దాంతో ఆమె కోలుకోగానే అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు అధికారులు.‘‘ఆ రాత్రి కిల్లర్ నా పిల్లల్ని, నన్నూ పొడిచిన కత్తిని పడేసి పారిపోతుంటే, కంగారులో అదే కత్తిని నేను తీసుకుని వెంటపడ్డాను. వాడు గ్యారేజీ వైపు పారిపోయాడు’’ చెప్పింది డార్లీ. ‘సింక్‌లో రక్తం క్లీన్ చేసిన ఆనవాళ్లు ఉన్నాయని, పిల్లల్ని పొడిచేశాక, తనని తాను జాగ్రత్తగా పొడుచుకోవడం కోసం డార్లీ సింక్ ముందు చాలాసేపు ఉందని, ఆ తర్వాత డ్రామాలో భాగంగా పైన నిద్రపోతున్న డారిన్ ని పిలవడం మొదలుపెట్టిందని, ఇంట్లోకి ఏ దుండగుడు రాలేదని నమ్మిన అధికారులు ఆమెను కోర్టుకెక్కించారు.సరిగ్గా మర్డర్స్ జరిగిన వారానికి డెవాన్ పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్ తీసిన డెవాన్ బర్త్‌డే వీడియోలో సమాధి దగ్గర డార్లీ నవ్వడమే కోర్టుకు బలమైన ఆధారంగా మారింది. పైగా డార్లీకి డ్రేక్ పుట్టాక, మానసిక సమస్యలతో కొన్ని నెలలు డిప్రెషన్ లోకి వెళ్లిందనే పాయింట్ డిటెక్టివ్స్ నమ్మకానికి ఊతమైంది. దాంతో కోర్టు డార్లీకి మరణశిక్ష విధించింది.అయితే భర్త డారిన్ మాత్రం డార్లీ నిర్దోషి అని బలంగా నమ్మాడు. ‘అసలే డిప్రెషన్లో ఉన్న ఒక మనిషి తన ఇద్దరు పిల్లల్ని కళ్లముందే పోగొట్టుకున్నప్పుడు మానసిక స్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించాలి. అదేరోజు(బర్త్‌డే) ఉదయం తను చాలా ఏడ్చింది’ అంటూ డార్లీ కుటుంబం మొత్తం ఆమెకే మద్దతుగా నిలిచింది. దాంతో మరణశిక్షకు బ్రేక్స్ పడ్డాయి. మరోవైపు హత్యలు జరిగిన రాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఒక నల్లటి వింత కారు డార్లీ ఇంటికి సమీపంలో ఆగి ఉండటం చూశామని కొందరు సాక్షులు చెప్పారు. డార్లీ అరుపులు వినిపిస్తున్నప్పుడే ఒక కారు స్టార్ట్ అయిన శబ్దం విన్నామని ఇంకొందరు పొరుగువారు చెప్పారు. పైగా అప్పటికే ఆ ప్రాంతంలో అనేక హింసాత్మక హత్యలు, అత్యాచారాలు జరిగాయి. కొందరు దుండగులు వేలిముద్రలు దొరక్కుండా చేతులకు గ్లోవ్స్ ఉపయోగించేవారు. ఆ క్రమంలోనే డార్లీ ఇరుక్కుని ఉంటుందని కొందరు, లేదంటే డార్లీపై కక్షతో ఎవరైనా ఆమెను ఇరికించారేమోనని ఇంకొందరు నమ్మడం మొదలుపెట్టారు.1996 జూన్ 6 రాత్రి, అమెరికా, టెక్సస్, రౌలెట్లో ఈ ఉదంతం జరిగింది. డార్లీ తన ఇద్దరు పిల్లల్ని చంపిందన్న నేరారోపణలతో నేటికీ జైల్లోనే ఉంది. టెక్నాలజీ పెరగడంతో కోర్టు డీఎన్ఏ పరీక్షలకు అనేకసార్లు ఆదేశించింది. అయితే, ఇప్పటికీ ఆ పరీక్షా ఫలితాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు విచారణలో భాగంగా అధికారులకు ఆ ఇంట్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల వేలిముద్రలు లభించాయి. వాటిని గ్యారేజీ తలుపు మీద, ఆ రాత్రి డార్లీ నిద్రపోయిన సోఫా మీద గుర్తించారు. అయినా డార్లీ విడుదల కాలేదు.ఇద్దరు కొడుకులకు జీవిత బీమా పాలసీ ఉన్నందుకే డార్లీ పిల్లల్ని చంపిందని ప్రాసిక్యూషన్ వాదించింది. నిజానికి డార్లీ డబ్బుకోసమే హత్యలు చేసుంటే, ఆమె భర్త డారిన్ పేరుమీద ఇంకా పెద్దమొత్తంలో జీవిత బీమా పాలసీ ఉందని, మరి అతడ్ని ఎందుకు చంపలేదనే వాదన డార్లీకి అండగా నిలిచింది. సుమారు 28 ఏళ్లుగా ఈ కేసు కొనసాగుతోంది. నేరం జరిగిన పదిహేనేళ్లకు డారిన్ తన భవిష్యత్తు కోసం డార్లీకి విడాకులిచ్చేశాడు. మూడో కొడుకు డ్రేక్ ఇప్పటికీ తల్లి తరçఫునే పోరాడుతున్నాడు. ఏదిఏమైనా ముద్దులొలికే చిన్నారుల్ని ఆ రాత్రి పొడిచి చంపిందెవరో? నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన -
మీరెప్పుడైనా.. ఈ మృత్యుసరోవరం గురించి విన్నారా!?
సముద్రంలో ఉన్న మృత్యుసరోవరం ఇది. సముద్రంలోకి దిగి చూస్తే, ఇది మామూలుగానే కనిపిస్తుంది గాని, ఇందులో ఈత కొట్టాలని సరదా పడితే మాత్రం, చావును కోరి కొనితెచ్చుకున్నట్లే! వంద అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మడుగులోని అత్యంత లవణీయత కలిగిన నీరు, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ప్రాణాంతక విషవాయువులు దీనిని మృత్యుసరోవరంగా మార్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని తొలిసారిగా 2015లో కనుగొన్నారు. ఇందులో ఈదులాడేందుకు దిగి మరణించిన జంతువుల కళేబరాలను శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం సేకరించి, భద్రపరచారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో వద్ద సముద్రంలోకి దిగి పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలకు సముద్రం లోపలి భాగంలో ఈ మడుగులాంటి ప్రదేశం కనిపించింది. దాదాపు వంద అడుగుల విస్తీర్ణంలో బురదనీటితో నిండిన ఈ మడుగులోకి వెళ్లే పీతలు, మొసళ్లు వంటి జీవులు నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోవడాన్ని వారు గమనించారు.సాధారణంగా సముద్రపు నీటిలో ఉండే ఉప్పదనం కంటే, ఈ మృత్యుసరోవరం నీటి ఉప్పదనం నాలుగురెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి కొద్ది జలచరాలు మాత్రమే ఇందులోని పరిస్థితులను తట్టుకుని మరీ బతకగలవని, మిగిలినవి ఇందులోకి దిగితే నిమిషాల్లోనే మరణిస్తాయని చెబుతున్నారు. దీనిని ‘హాట్ టబ్ ఆఫ్ డిస్పెయిర్’ అని, ‘జకూజీ ఆఫ్ డిస్పెయిర్’ అని అభివర్ణిస్తున్నారు.ఇవి చదవండి: గ్యాప్ ఇవ్వలా... వచ్చింది -
రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'?
‘అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ?’ అంటూ పెద్దగా కలవరిస్తూ మంచం మీద నుంచి ఉలికిపడి లేచి కూర్చుంది జూడీ. అప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి ఒంటిగంటైంది. వేగంగా మంచం దిగి, పక్కనే ఉన్న గదికి వెళ్లి, లైట్ వేసి, రోండా(రోమ్) మంచం వైపు చూసింది. అక్కడ రోండా లేకపోవడంతో కంగారు కంగారుగా పరుగున వెనుకకు వచ్చి, తన మంచం మీద గాఢనిద్రలో ఉన్న భర్తను కుదిపి కుదిపి లేపింది. అతడు నిద్రమత్తులోంచి తేరుకోకముందే, ‘మన.. మన రో..మ్.. కనిపించడం లేదు బాబీ!.. మ..మంచం మీద లేదు.. నాకు చా..చాలా భయంగా ఉంది’ అంటూ తడబడుతూనే ఏడ్చేసింది జూడీ. బాబీకి మైండ్ బ్లాక్ అయ్యింది. ‘ఏం మాట్లాడుతున్నావ్ జూడీ?’ అన్నాడు కంగారుగా.‘మన.. మన రోమ్ చచ్చిపోయింది. ఉన్నట్టుండి లోయలో పడిపోయింది. తనకి ఊ.. ఊపిరి ఆడటం లేదు. నా కళ్లముందే.. నా కళ్లముందే పడిపోయింది’ వణుకుతున్న స్వరంతో చెప్పింది జూడీ. బాబీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. పరుగున లేచి వెళ్లి, లైట్ ఆన్ చేశాడు. గడియారం వైపు చూసి, టేబుల్ మీద వాటర్ బాటిల్ అందుకుని, జూడీకి తాగించాడు. పక్కనే కూర్చుని, ఓదార్పుగా ‘జూడీ! మన రోమ్ ఇంట్లో ఎందుకుంటుంది? క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి నిన్నే వెళ్లింది కదా, రేపు ఉదయాన్నే వస్తానంది కదా?’ అని నిదానంగా గుర్తు చేశాడు. దాంతో జూడీ పూర్తిగా తేరుకుంది.అప్పటిదాకా బిడ్డ కోసం మెలితిరిగిన కన్నపేగు అదంతా పీడకల అని గుర్తించింది. అయినా తల్లి మనసు ఇంకా అల్లాడుతూనే ఉంది. ‘బా..బీ..! నాకు చాలా భయంగా ఉంది. నాకొచ్చింది కలే కాని, నా బిడ్డ(రోండా) ఏదో సమస్యలో ఉందని నా మనసు చెబుతోంది. అసలు తను ప్రాణాలతో ఉందా? ఇప్పుడే తనని చూడాలనుంది’ అంటూ ఏడ్చింది జూడీ. దాంతో బాబీ.. ‘పిచ్చిగా మాట్లాడకు. మన రోమ్‌కి ఏమీ కాదు. ఇప్పుడు టైమ్ చూడు, ఈ సమయంలో ఎక్కడికని వెళ్దాం? రేపు తనొస్తానన్న టైమ్‌కి రాకపోతే కచ్చితంగా మనమే వెళ్దాం సరేనా?’ అని నచ్చజెప్పాడు బాబీ.జూడీ, బాబీలకు చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి రోండాకి పంతొమ్మిదేళ్లు. చదువు పూర్తిచేసుకుని, మూడు నెలల క్రితమే ఉద్యోగం సంపాదించుకుంది. ‘ఆఫీస్‌లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, అటు నుంచి రాత్రికి ఫ్రెండ్ ఇంటికి వెళ్లి, రేపు మధ్యాహ్నానికి వస్తా’ అని చెప్పి వెళ్లింది.ఉదయం 6 దాటేసరికి కాలింగ్ బెల్ మోగింది. జూడీ తలుపు తీసేసరికి ‘రోండా మీ అమ్మాయేనా?’ అడిగారు ఎదురుగా ఉన్న పోలీసులు. ‘అవును ఏమైంది?’ అంది జూడీ కంగారుగా. ‘మీ అమ్మాయి కారుకి యాక్సిడెంట్ అయ్యింది. ఆమె చనిపోయింది’ చెప్పాడు వారిలో ఒక అధికారి. జూడీకి గుండె ఆగినంత పనైపోయింది. ‘నో.. నో..!’ అంటూ అక్కడే ఉన్న వస్తువులన్నీ నేలకేసి కొట్టింది జూడీ. ‘నేను నమ్మను. నా బిడ్డకు ఏమీ కాదు. మీరు అబద్ధం చెబుతున్నారు. ఇది నా కల! నిజం కాదు’ అని అరుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. ఆ అరుపులకు లోపల నుంచి బాబీ పరుగున వచ్చి జూడీని పట్టుకున్నాడు. పోలీసులు మరోసారి అదే మాట చెప్పడంతో ఆ దంపతులు మార్చురీకి పరుగు తీశారు.పోస్ట్‌మార్టమ్‌లో మాత్రం రోండా బాడీలో బుల్లెట్ దొరికింది. కేవలం వెనుక సీట్లో కూర్చున్న వాళ్లే అలా కాల్చగలరని తేలింది. దాంతో యాక్సిడెంట్ కేసు కాస్త హత్య కేసుగా మారిపోయింది. కారు రోడ్డు పక్కకు ఒరిగినట్లు, డ్రైవర్ సీట్ వైపు డోర్ ఓపెన్ చేసి ఉన్నట్లు, కారుకి కాస్త దూరంలో రోండా నేలమీద బోర్లా పడి ఉన్నట్లు ఆ రాత్రే రెండు గంటల సమయానికి గుర్తించారు పెట్రోలింగ్ పోలీసులు.అపరిచితులతో మాట్లాడటానికి కూడా ఇష్టపడని రోండా, తెలియని వారికి లిఫ్ట్ ఇచ్చే చాన్సే లేదని జూడీ, బాబీ నమ్మకంగా చెప్పారు. దాంతో రోండా పరిచయస్థులంతా విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆఫీస్‌లో క్రిస్మస్ వేడుకల నుంచి రోండా ఎక్కడికి వెళ్లింది? ఎవరెవరిని కలసింది? ఇలా ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రి పన్నెండున్నరకు తన స్నేహితురాలిని డ్రాప్ చేసిన రోండా.. పది మైళ్ల దూరంలో ఉన్న తన ఇంటికే ఒంటరిగా కారులో బయలుదేరిందని తేలింది. కారు, మృతదేహం రెండూ ఇంటికి అరమైలు దూరంలోనే దొరికాయి.అయితే ఆ రాత్రి అదే తోవలో వెళ్లిన ఒక సాక్షి ‘రోండా కారు దగ్గర ఒక నీలం కలర్ కారు చూశాను. అందులో ఇద్దరు యువకులు ఉన్నారు’ అని చెప్పాడు. మరో సాక్షి.. కారు ముందు వైపుకు.. రోండా వాలిపోవడం చూశానని, ఆమె పక్కనే ఓ యువకుడు ఉన్నాడని, అయితే అది క్రైమ్ సీన్ అనుకోలేదని, తాగిన మత్తులో ఉన్న ప్రేమజంటగా భావించి, ఆగకుండా వెళ్లిపోయానని చెప్పాడు. అంటే ఆ సమయానికే రోండా చనిపోయిందని, అప్పుడు కిల్లర్ రోండా పక్కనే ఉన్నాడని అధికారులకు అర్థమైంది. వెంటనే ఆ సాక్షుల అంగీకారంతో వారికి హిప్నాసిస్ టెస్ట్ చేసి, కిల్లర్స్‌లో ఒకడు ముదురు గోధుమరంగు జుట్టుతో, 5.10 అడుగుల ఎత్తు ఉంటాడని నిర్ధారించుకున్నారు. ఇక రోండా చిన్ననాటి స్నేహితుడు మైక్‌ని కూడా గట్టిగానే నిలదీశారు.నిజానికి రోండా చదువుల్లోనే కాదు, ఆటల్లోనూ ఫస్టే! ప్రతిదానిలోనూ దూసుకునిపోయే రోండా, తన మరణానికి నెల్లాళ్ల ముందు నుంచి చాలా వింతగా ప్రవర్తించిందట! ప్రతిదానికి భయపడటం, పగటిపూట కూడా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం, రాత్రి సమయాల్లో మెలకువగా ఉండటం, అర్ధరాత్రి వేళ స్నానం చేయడం లాంటివి చేసేదట! సాధారణంగా ౖలñ ంగిక వేధింపులకు గురైనవారి ప్రవర్తన అలానే ఉంటుందని కొందరు సైకాలజిస్ట్‌లు.. అధికారులకు చెప్పారు.ఆ క్రిస్మస్ వేడుకలకు కూడా స్నేహితురాలు పట్టుబట్టడంతో రోండా బలవంతంగా వెళ్లిందని పేరెంట్స్ గుర్తు చేసుకున్నారు. ‘పెళ్లి అయిన వారిని ప్రేమించడం, వారితో రిలేష¯Œ షిప్లో ఉండటం తప్పా?’ అని రోండా తన తల్లిని పదేపదే అడిగేదట! స్నేహితులకు సలహా ఇవ్వడానికి అలా అడిగిందేమో అనుకుందట జూడీ. కానీ రోండా మరణం తర్వాత జూడీకి ‘రోండా జీవితంలో ఎవరైనా వివాహితుడు ఉన్నాడా? అతడే కిల్లరా?’ అనే అనుమానం మొదలైంది. ఇప్పటికీ జూడీ, బాబీ దంపతులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.1981 డిసెంబర్ 22, నార్త్ కరోలినాలోని మౌంటైన్ రోడ్లో ఆమె ఇంటికి అర మైలు దూరంలోనే హత్యకు గురైంది. నేటికీ హంతకులు ఎవరో తేలక ఈ కేసు మిస్టరీగానే మిగిలింది. అయితే సరిగ్గా రోండా ప్రాణం పోయే సమయానికే.. నిద్రలో ఉన్న తల్లి జూడీకి ఎలా తెలిసింది? అనేది కూడా మిస్టరీనే! – సంహిత నిమ్మనఇవి చదవండి: ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్! -
అసలు.. ఆ ప్యామిలీకి ఏమైంది? ఎక్కడికి వెళ్లినట్లు?
అదంతా పెద్దపెద్ద కొండలుండే ప్రాంతం. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రదేశం. ఒకవైపు అడవి, మరోవైపు రహదారి. సుమారు వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షంతో విసిగిపోయిన ఓ గిరిజన బృందం ఆ రోజు వర్షం ఆగడంతో వేటకు బయలుదేరింది. వారంతా నడిచి వెళ్తూ ఉండగా ఓ చిన్న కుక్కపిల్ల మూలుగులు వారి చెవిన పడ్డాయి. ‘ఎక్కడ? ఎటువైపు?’ అన్నట్లు చెవులు రిక్కిస్తూ అటుగా నడిచారు.వారు అడవిలోంచి రోడ్డు మీదకు వెళ్లేసరికి, రోడ్డు పక్కన ఓ ట్రక్ కార్ ఆగి ఉంది. అందులోంచే కుక్కపిల్ల మూలుగుతోంది. దగ్గరకు వెళ్లి, కారు అద్దంలోంచి చూస్తే, అది బక్కచిక్కిపోయి, నీరసంగా ఆయాసపడుతోంది. ఆ కారులో హ్యాండ్ బ్యాగ్, పర్స్, సెల్ ఫోన్స్ కూడా కనిపించాయి. చుట్టుపక్కల ఎవరూలేరు. పైగా డోర్స్ని లాక్ చేయలేదు. కుక్కపిల్ల పరిస్థితి చూస్తే, తిండి లేక చాలా రోజులైనట్లుంది. మరి కారు ఓనర్ ఎక్కడ? విలువైన వాటిని వదిలిపెట్టి లాక్ చేయకుండా, ఇలాంటి ప్రాంతంలో ఎక్కడికి వెళ్లినట్లు? ఇవే ప్రశ్నలు వారిని కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.ఆ కారు నంబరు చూడగానే పోలీసులకు ‘జామిసన్ ఫ్యామిలీ మిస్సింగ్ కేసు’ గుర్తొచ్చింది. బాబీ జామిసన్, షెరిలిన్ అనే దంపతులు తమ ఆరేళ్ల కూతురు మాడిసన్ తో కలసి సరిగ్గా అప్పటికి ఎనిమిది రోజుల క్రితం అదే కారులో ఇంటి నుంచి బయలుదేరారు. వారి ఇంటి ముందున్న సీసీ కెమెరాలో అది రికార్డ్ అయ్యింది. అయితే వారు తమ ప్రయాణం గురించి సొంతవారికి కూడా చెప్పలేదు. రెండు మూడు రోజులుగా ఫోన్ ్సకి స్పందించడంలేదంటూ షెరిలిన్ తల్లి కోకోటన్ అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏ క్లూ లేక ఆగిన ఆ కేసుకు ఈ కారే కీలకంగా మారింది. కారు దొరికిన పరిసరాల్లో తప్పిపోయిన ఆ ముగ్గురి కోసం వెతకడం ప్రారంభించారు. అప్పుడే ఆ కారు సీట్ కింద 32 వేల డాలర్లతో ఓ బ్యాగ్ దొరికింది. ‘అంత డబ్బు వారికి ఎక్కడిది?’ అనే ప్రశ్నకు కోకోటన్ కూడా సమాధానం ఇవ్వలేకపోయింది.మొదటి సంతానం కొడుకుతో కలసి దిగిన ఫొటోషెరిలిన్ ఫోన్ లోని చివరి ఫొటో విచారణ సమయంలో పలు అనుమానాలకు దారితీసింది. మాడిసన్ భయపడుతూ, ఏడుపు తన్నుకొస్తున్నట్లుగా చేతులు కట్టుకుని నిలబడిన ఫొటో అది. అసలు ఆ ఫొటోలో మాడిసన్ ఎందుకు అలా ఉంది? ఆ ఫొటో ఎవరు తీశారు? అప్పటికే జామిసన్ దంపతులకు ఏదైనా జరిగిందా? వేరే ఎవరైనా ఆ ఫొటో తీసుంటారా? అనే ప్రశ్నలు ఉత్కంఠను రేపాయి.కారులో దొరికిన మరో ఫోన్ లో జీపీఎస్ లొకేషన్ ఇంకా ఆన్ లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు ఆగిన చోటుకు దగ్గర్లో ఓ కొండపైకి వారు చేరుకోవాల్సిన లొకేషన్ ని చూపిస్తోంది. మరి కారు ఎందుకు అక్కడ ఆగింది? వాళ్లెందుకు అక్కడ దిగారు? అనుకుంటూ అధికారులు కారు దొరికిన పరిసరాల్లో మొత్తం వెతికించారు. అయితే అప్పటికే పడిన వర్షాల కారణంగా సాక్ష్యాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.సరిగ్గా మూడేళ్ల తర్వాత జామిసన్ కారు దొరికిన ప్రదేశానికి రెండు మైళ్ల దూరంలో అడవి వైపు అసలు దారే లేని చోట కొందరు పర్వతారోహకులకు వారి ముగ్గురి అస్థిపంజరాలు కనిపించాయి. అయితే అప్పటికే కోకోటన్ .. బాబీ ఉపయోగించే పర్సనల్ గన్ తో పాటు ఒక సూట్‌కేస్ కనిపించడం లేదని, అది వారి ఇంట్లోనూ, కారులోనూ దొరకలేదంటే...æ ఆరోజు అడవిలో ఎవరైనా దొంగలు దాడి చేసి తీసుకెళ్లారేమోనని పోలీసులతో చర్చించింది. జామిసన్ దంపతులకు మాడిసన్ కంటే ముందు ఒక కొడుకు కూడా ఉన్నాడు. తన కోకోటన్ దగ్గర పెరిగేవాడు.మరోవైపు అదే కారులో దొరికిన ఒక డైరీలో షెరిలిన్ – బాబీ ప్రవర్తన గురించి రాసుకుంది. బాబీ ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తున్నాడని, అప్పుడే ప్రేమ, అప్పుడే ద్వేషంతో విచిత్రంగా ప్రవర్తిస్తాడని స్వయంగా షెరిలిన్ రాయడంతో బాబీనే అడవిలోకి తీసుకెళ్లి భార్య, కూతుర్ని చంపేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడేమోనన్న కథనాలు మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఇక వైద్యపరీక్షల్లోనూ అది హత్యా లేక ఆత్మహత్యా అనేది తేలలేదు.కారులో అంత డబ్బు దొరికిందంటే, ఆ దంపతులు డ్రగ్స్ మాఫియాతో మారకద్రవ్యాల డీల్స్ చేసేవారేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. అంటే మాఫియానే తమ డీల్‌లో తేడా రావడంతో వారిని కడతేర్చిందా అనే ప్రశ్న పురుడుపోసుకుంది. మరోవైపు జామిసన్ దంపతులు ఆ కొండ ప్రాంతాల్లో 40 ఎకరాల స్థలం కొనడానికి అడ్వాన్స్ ఇచ్చారని, త్వరలోనే అక్కడికి షిప్ట్ అవ్వాలనేది వారి కోరికని, ఆ లొకేషన్ కోసమే ఆ రోజు వాళ్లు అక్కడికి వెళ్లారని కొందరు సన్నిహితులు చెప్పారు. అదలా ఉండగా వారు మిస్ అవ్వడానికి కొన్ని నెలల ముందు బాబీ తమ పొరుగువారితో ‘మా ఇంట్లో చాలా దయ్యాలున్నాయి. అవి మమ్మల్ని బాగా ఇబ్బందిపెడుతున్నాయి.. మా ప్రాణాలకే ప్రమాదంలా ఉంది’ అని చెప్పాడట. ఇదే విషయం కోకోటన్ ని అడిగితే, ‘గతంలో ఒకసారి వారి ఇంటికి వెళ్లినప్పుడు నేను కూడా ఆ దయ్యాల ఉనికి గుర్తించాను, చాలా భయపడ్డాను’ అని గుర్తు చేసుకుంది. దాంతో ఈ క్రైమ్ స్టోరీ ఉన్నపళంగా హారర్ రంగు పులుముకుంది. ఏది ఏమైనా, ఆ ముగ్గురూ ఎలా చనిపోయారు? చివరి ఫొటోలో పాప ఎందుకలా ఉంది? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు.2009 అక్టోబర్ 8న అమెరికా, ఓక్లహోమాలోని యుఫాలాలో నివసించే జామిసన్ కుటుంబం కైమిచ్ పర్వతాల వైపు వెళ్లారు. మూడేళ్ల తర్వాత ఆ సమీపంలోనే అస్థిపంజరాలై దొరకడంతో ఈ ఉదంతం స్థానికంగా సంచలనం రేపింది. నేటికీ మిస్టరీగానే మిగిలింది. – సంహిత నిమ్మనఇవి చదవండి: Armand Duplantis: ఎవరికీ అందనంత ఎత్తుకు.. -
జెనెట్ టేట్.. రెండు పల్లెటూర్ల మధ్యలో పెద్ద హైవే రోడ్డు.. ఒక్కసారిగా..?
రెండు పల్లెటూర్ల మధ్యలో పెద్ద హైవే రోడ్డు. ఇటువారు అటు వెళ్లాలన్నా, అటువారు ఇటు రావాలన్నా ఆ హైవే దాటాల్సిందే. ఉన్నట్టుండి ఆ రెండు ఊళ్లనూ పెద్దసంఖ్యలో పోలీసులు చుట్టుముట్టారు. పైనుంచి హెలికాప్టర్‌తో గాలింపూ మొదలైంది. చుట్టుపక్కల గుంతలు, చెరువులు అన్నీ జల్లెడపడ్తున్నారు. పొదలు, పొలాలు అన్నింటినీ వెతుకుతున్నారు. జనాలు కూడా ఆ వెతుకులాటలో భాగమయ్యారు. డిటెక్టివ్ అధికారులు ఒకవైపు, డాగ్ స్క్వాడ్ మరోవైపు పరుగులు తీస్తున్నారు.ఇద్దరు అమ్మాయిలు మాత్రం జరిగేదంతా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. అధికారులంతా ఒకరి తర్వాత ఒకరు ఆ ఇద్దరినీ రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఇంతలో ఒక కానిస్టేబుల్ పరుగున వచ్చి, ‘క్రైమ్ సీన్ రీ క్రియేషన్ కి అంతా రెడీ సార్’ అన్నాడు. అప్పటికే పోలీసులంతా ఏది ఎక్కడ ఎలా జరిగింది అనేది ఆ అమ్మాయిల నోట చాలాసార్లు విన్నారు. దాంతో ఆ అధికారుల్లో ఒకడు ఆ అమ్మాయిల వైపు చూసి, ‘పదండి! అసలేం జరిగిందో వివరంగా చూపించాలి. తేడా రాకూడదు. అబద్ధం చెప్పకూడదు, సరేనా?’ అంటూ కాస్త గంభీరంగా గద్దించాడు. ‘సరే సార్’ అంటూ భయపడుతూనే ఆ ఇద్దరూ పోలీస్ జీప్ ఎక్కారు.జీప్ వేగంగా కంకర రోడ్డు వైపు పరుగుతీసింది. హైవే నుంచి ఊరుని కలిపే దారి అది. కారు వెళ్తుంటే స్కూటర్ పక్కనే ఆగేంత చిన్న తోవ అది. చుట్టూ గుబురు మొక్కలు, పొదలు. దారి పొడవునా మలుపులే! ఏ మలుపు తిరిగినా అవతల దారి ఇవతలకు కనిపించదు. ఓవైపు పొలాలు, మరోవైపు పిల్లకాలువలు, వాటిపై చిన్న చిన్న వంతెనలు. ఒంటరిగా వెళ్లాలంటే కాస్త భయపడేలానే ఉంటుందా ప్రదేశం. ఇద్దరిలో ఒక అమ్మాయి, ‘ఇక్కడే సార్! ఈ వంతెనే!’ అంటూ జీప్ ఆపించింది. ‘సరిగ్గా చెబుతున్నావా?’ అన్నాడు అందులో ఓ అధికారి. ‘యస్ సర్ ఇదే ఇదే!’ అంది మరో అమ్మాయి. దాంతో జీప్‌లో ఉన్నవారంతా వంతెన మీదే దిగారు.‘ఇక్కడే సర్! నిన్న మధ్యాహ్నం 3 అయ్యేసరికి జెనెట్ తన సైకిల్ మీద వెళ్తూ వెళ్తూ మమ్మల్ని కలిసింది’ అంది ఒక అమ్మాయి. ‘మరి మీకు ఆ సైకిల్ ఎక్కడ కనిపించింది?’ అడిగాడు ఒక అధికారి. ‘అదిగో ఆ మలుపు దాటాక కనిపించింది సర్.! తను మా దగ్గరకు వచ్చేసరికే తన దగ్గర చాలా న్యూస్ పేపర్స్ ఉన్నాయి. దారిలో మేము కనిపించామని ఆగింది. వెళ్తూ వెళ్తూ చదువుకోమని మాకూ ఓ న్యూస్ పేపర్ ఇచ్చింది సర్’ అంది మరో అమ్మాయి. అధికారులతో పాటు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఆ మలుపువైపే నడిచారు. జెనెట్ సహా ముగ్గురి వయసూ 13 ఏళ్లే. అంతా ఒకే స్కూల్లో స్నేహితులు. జెనెట్ చూడటానికి టామ్ బాయ్‌లా కనిపించేది. స్కూల్ అయిపోగానే న్యూస్ పేపర్స్ వేస్తూ పార్ట్‌టైమ్ చేసుకునేది. హైవే దాటి ఆ ఊరు నుంచి ఈ ఊరికి.. ఈ ఊరు నుంచి ఆ ఊరికి సైకిల్ మీద తిరగడం ఆమెకు కొత్తేం కాదు.‘జెనెట్ మాతో మాట్లాడాక మా ముందే సైకిల్ ఎక్కి వెళ్లడం కొంత దూరం వరకూ మాకూ కనిపించింది. మేము తనిచ్చిన పేపర్ చదువుకుంటూ, మాట్లాడుకుంటూ జెనెట్ వెళ్లిన దారిలోనే నడుచుకుంటూ.. మా ఇళ్లకు బయలుదేరాం. సరిగ్గా ఐదారు నిమిషాలకు ఇదిగో ఈ మలుపు దాటి కాస్త దూరం నడిచేసరికి జెనెట్ సైకిల్ కిందపడున్నట్లు కనిపించింది. సైకిల్ బుట్టలోని న్యూస్ పేపర్స్ అన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. సైకిల్ వెనుక టైర్ గిర్రున తిరుగుతూనే ఉంది. పేపర్స్ గాలికి రెపరెపలాడుతూ ఉన్నాయి. మాకు భయం వేసింది. పరుగున దగ్గరకు వెళ్లాం. ఇదిగో ఇక్కడే. సైకిల్ పడి ఉంది. ‘జెనెట్! జెనెట్!’ అని పెద్దగా అరిచాం. చుట్టూ చూశాం. అదిగో ఆ పొదల వెనుక కూడా వెతికాం.ఎక్కడా తన అలికిడి లేదు. దాంతో సైకిల్ని పైకి లేపి, నడిపించుకుంటూ వాళ్ల ఇంటికి వెళ్లాం. అక్కడ జెనెట్ వాళ్ల డాడ్‌కి విషయం చెప్పాం’ అంటూ ఆ అమ్మాయిలు ప్రతి సీన్ ని క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించారు. ఓ అధికారి ‘సరిగ్గా జెనెట్ సైకిల్ దొరికిన చోట నిలబడి, సైకిల్ ఏ పొజిషన్ లో పడింది? అప్పుడు మీకు జెనెట్ అరుపులు వినించలేదా?’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు. దాంతో ఆ ఇద్దరు అమ్మాయిలు సైకిల్ పడి ఉన్న పొజిషన్ ని న్యూస్ పేపర్స్ పడి ఉండటాన్ని ఆ అధికారులకు వివరించారు. రోజులు గడిచినా జెనెట్ ఆచూకీ దొరకలేదు.అప్పుడే ఒక రైతు షాకిచ్చాడు. ‘సైకిల్‌తో పాటు ఆ ఇద్దరు అమ్మాయిలు నడిచి వెళ్లడం నేను చూశాను. అయితే వాళ్లిద్దరూ ఏ అరుపులు అరవలేదు. ఎలాంటి ఆందోళనలోనూ కనిపించలేదు’ అని సాక్ష్యమిచ్చాడు. మరోవైపు ఓ కానిస్టేబుల్ భార్య ఆరోజు మధ్యాహ్నం మూడు దాటాక అటుగా వెళ్తూవెళ్తూ, ఆ ఇద్దరు అమ్మాయిలతో పాటు ఒక టామ్బాయ్లాంటి అమ్మాయి (జెనెట్) ఒక ముప్పయ్యేళ్ల వ్యక్తితో అదే వంతెన మీద నిలబడి మాట్లాడుకోవడం చూశానని సాక్ష్యమిచ్చింది. దాంతో ‘ఆ అబ్బాయి ఎవరు?’ అనే కోణంలో కూడా దర్యాప్తు సాగింది. కానీ పనికొచ్చే ఎలాంటి సమాచారం దొరకలేదు.అయితే జెనెట్ సైకిల్ దొరికిన ప్రాంతంలో సుమారు 70 న్యూస్ పేపర్స్ దొరికాయి. నిజానికి జెనెట్ తిరిగే జోన్ లో అన్ని పేపర్స్ అవసరం లేదు. సైకిల్ బుట్టలో కూడా అన్ని పేపర్స్ పట్టడం కష్టమే! కిడ్నాపర్స్ కావాలనే న్యూస్ పేపర్స్ అక్కడ వదిలి, కేసుని డైవర్ట్ చేయాలనుకున్నారా? అనేది కూడా తేలలేదు. పైగా జెనెట్ మిస్ అయిన రోజు మరో పేపర్ బాయ్ లీవ్‌లో ఉండటంతో, అతడు అందివ్వాల్సిన న్యూస్ పేపర్స్ కూడా జెనెటే తీసుకుందట! ఆ విషయం తెలియగానే జెనెట్ కిడ్నాప్‌ని ముందే ప్లాన్ చేశారా? అని కూడా విచారించారు. కానీ క్లారిటీ రాలేదు. పాపం జెనెట్ తండ్రి జాన్ సుమారు 40 ఏళ్ల పాటు పోరాడి ఆ దిగులుతోనే మరణించాడు.జెనెట్ స్నేహితులకు అంతా తెలిసే నాటకం ఆడారా? లేక లీవ్‌లో ఉన్న పేపర్ బాయ్‌కి జెనెట్ కిడ్నాప్‌కి ఏదైనా సంబంధం ఉందా? ఇలా వేటికీ సమాధానం లేదు. 1978లో బ్రిటన్ , ఐల్స్బరీలో జరిగిన యదార్థ సంఘటన ఇది. ఆ ఏడాది ఆగస్ట్ 19న సైకిల్ మీద వెళ్తున్న పదమూడేళ్ల జెనెట్ టేట్– ఎక్సెటర్ సమీపంలో కిడ్నాప్ అయ్యింది. 46 ఏళ్లు గడిచినా కేసు తేలలేదు. ఎన్నో నేరాలు చేసి దొరికిన రాబర్ట్ బ్లాక్ అనే సీరియల్ కిల్లర్, తానే జెనెట్పై అత్యాచారం చేసి హత్య చేశానని చెప్పాడట. అయితే విచారణ పూర్తి కాకుండానే జైల్లో అతడు మరణించాడు. కొందరు మాత్రం.. ‘రాబర్ట్ ఒప్పుకోవడమనేది.. పోలీసుల కట్టుకథ’ అంటారు. దాంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
మిస్టరీ.. ఎపెస్ బందిపోట్లు!
అది 1987 అక్టోబర్ 30. అమెరికా, అలబామా రాష్ట్రంలో ఎపెస్ అనే పట్టణంలో ఉన్న చిన్న పోస్ట్ ఆఫీస్. మనియార్డర్లు, ఉత్తరాలు, స్టాంపులు తీసుకెళ్లేవారంతా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, వెళ్తున్నారు. ఆ బిజీలోనే ఉంది పోస్ట్‌మాస్టర్ డ్యూటీ చేస్తున్న ఒపాల్ జాన్సన్ అనే మహిళ. అది తన జీవితంలో అత్యంత భయంకరమైన రోజని ఆమెకు తెలియదు.ఉదయం 11 దాటింది. ఆఫీసులో ఎవరూ లేరు. ‘ఏదైనా తిందాం’ అనుకుంటూ బాక్స్ అందుకోబోయింది. ఇంతలో ఒక నల్లజాతీయుడు, ఒక తెల్లజాతీయుడు కలసి అక్కడికి వచ్చారు. ‘ఏం కావాలి?’ అన్నట్లుగా చూసింది వాళ్లవైపు ఒపాల్. వాళ్లు స్టాంపులు అడగడంతో ముందున్న డ్రా ఓపెన్ చేసి, వాళ్లు అడిగిన స్టాంప్స్ కోసం వెతకడం ప్రారంభించింది. ఇంతలో ఒకడు తుపాకీ బయటికి తీసి, ఆమెకు గురిపెట్టి ‘కదిలితే కాల్చేస్తా!’ అన్నాడు. ఊహించని పరిణామానికి ఆమె నిర్ఘాంతపోయింది.చేతులు పైకెత్తి, అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో మరొకడు కౌంటర్ ముందుకు వెళ్లి, డబ్బులు వెతకడం మొదలుపెట్టాడు. అయితే నల్లజాతీయుడు పోస్టాఫీసు కార్యకలాపాలపై పూర్తి అనుభవం ఉన్నవాడిలా ఏది ఎక్కడుంటుంది? ఎందులో ఎంత ఉంటుంది? అంతా తనతో వచ్చిన తెల్లజాతీయుడికి వివరిస్తున్నాడు. అతడు వాటన్నింటినీ తీసి బ్యాగ్‌లో వేసుకుంటున్నాడు. దోపిడీ జరుగుతోందని ఆమెకు అర్థమైంది. అరిస్తే ప్రాణాలకే ప్రమాదమని, తప్పించుకోవడానికి ఏదో అవకాశం దొరక్కపోతుందా అని దేవుడ్ని ప్రార్థించడం మొదలుపెట్టింది.పోస్టాఫీసులో దొరికిన నగదు, విలువైన స్టాంపులు ఇలా అన్నీ దోచేశారు. ఆ వెంటనే ‘ఈమెను ఏం చేద్దాం?’ అని చర్చించుకున్నారు. ‘ఈమె ఇక్కడే ఉంటే మనం వెళ్లేలోపు పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడ తుపాకీ తీస్తే అలర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈమెను కూడా మనతో పాటు తీసుకుని వెళ్దాం’ అన్నాడు నల్లజాతీయుడు తన తోటి దొంగతో.కాసేపటికి ఆ ఇద్దరూ ఒపాల్‌ని తుపాకీతోనే తోసుకుంటూ ఆమె కారు దాకా తీసుకెళ్లారు. ఆమెను బలవంతంగా కారు ఎక్కించారు. ఒకడు ఆమె పక్క సీట్లో కూర్చుని, ఆమెకు తుపాకీ గురిపెట్టే ఉంచాడు. ఇంతలో మరొకరు తమ కారుని ఒపాల్ కారుకి లింక్ చేసి, పరుగున వచ్చి ఒపాల్ కారులో వెనుక సీట్లో కూర్చున్నాడు. వెంటనే ‘హూ.. పోనీ’ అంటూ అరిచాడు నల్లజాతీయుడు. ఇక తనకు చావు తప్పదనుకున్న ఒపాల్ వణికిపోతూనే వారు ఎటు అంటే అటు కారుని ముందుకు పోనిచ్చింది.అయితే వారిద్దరూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల గురించి చాలా బాగా తెలిసినట్లుగా చర్చించుకున్నారు. ‘అక్కడికి వెళ్తే తప్పించుకోవడం ఈజీ! అటు నుంచి అటు పారిపోవచ్చు సులభం!’ అంటూ చాలా ప్రదేశాల పేర్లు ఎంచుకున్నారు. చివరగా, ఆ రెండు కార్లు పట్టణానికి 3 మైళ్ల దూరంలో ఉన్న గాగన్ ్స సరస్సు సమీపంలోని రిమోట్ క్లియరింగ్ దగ్గర ఆగాయి. ఒపాల్‌ని మళ్లీ తుపాకీతో బెదిరించి, ఆమె కారులోనే డిక్కీలోకి ఎక్కించారు. ఆ సమయంలో తుపాకీ తెల్లజాతీయుడి చేతిలో ఉంది.అయితే నల్లజాతీయుడు ఆవేశంగా ‘ఆమెను చంపెయ్.. చంపెయ్.. వదిలిపెట్టొద్దు.. వదిలితే మనకే సమస్య’ అని తెల్లజాతీయుడి మీద పెద్దపెద్దగా అరిచాడు. అయితే తెల్లజాతీయుడు అందుకు అంగీకరించలేదు. ‘ఆమె వల్ల మనకేం సమస్య రాదు. చంపితేనే పోలీసులు మరింత వేగంగా మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు’ అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కాసేపటికి ఇద్దరి చర్చలో తెల్లజాతీయుడి వాదనే గెలిచింది. ఒపాల్ ఊపిరి పీల్చుకుంది. అప్పటి దాకా వారి చర్చంతా వింటున్న ఒపాల్, తన మీదకు ఎప్పుడెప్పుడు బుల్లెట్లు దోసుకోస్తాయోనని చాలా భయపడింది. చివరికి తనని ప్రాణాలతోనే వదులుతున్నారని అర్థం చేసుకుంది. అయితే ఆమె చేతికున్న ఉంగరాలు, మెడలో గొలుసు, క్రెడిట్ కార్డులు అన్నీ లాగేసుకుని, ఆమెను ఆమె కారు డిక్కీలోనే లాక్ చేసి, వారు తమ కారులో పారిపోయారు.కొంత సమయానికి చుట్టూ నిశ్శబ్దాన్ని నిర్ధారించుకున్న ఒపాల్, లోపలే ఉన్న ఇనుప టైర్ సాయంతో డిక్కీని పగలగొట్టి బయటపడింది. అయితే డిక్కీ ఓపెన్ కావడానికి సుమారు గంటపైనే పట్టింది. మొత్తానికి ప్రాణాలు దక్కడంతో పోలిస్ స్టేషన్ కి తన కారులోనే వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె చెప్పిన ఆనవాళ్లతో ఆ ఇద్దరు ఆగంతకుల రూపురేఖలను ఊహాచిత్రాలుగా గీయించారు పోలీసులు. వెంటనే విచారణ మొదలుపెట్టారు.అయితే దోపిడీ జరిగిన మరునాడే, దోపిడీకి పాల్పడిన నల్లజాతీయుడు ఒహాయోలో మరో నల్లజాతీయురాలితో కలసి తిరిగినట్లు కొందరు సాక్షులు చెప్పారు. మరోవైపు ఆ మహిళ చాలాచోట్ల ఒపాల్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించిందని తేలింది. కానీ ఒపాల్‌ని వణికించిన ఆ ఇద్దరు దొంగలు పోలీసులకు ఎప్పుడూ దొరకలేదు. 1995లో ఈ కథనాన్ని అన్సాల్వ్డ్ ఎపిసోడ్స్‌లో ప్లే చేశారు.2010లో ఒపాల్ అనారోగ్య సమస్యలతో మరణించింది. అయితే తెల్లజాతీయుడు కంటే నల్లజాతీయుడు సుమారు పదేళ్లు పెద్దవాడనేది ఒపాల్ అంచనా. ఒపాల్ చెప్పినదాని ప్రకారం నల్లజాతీయుడి ప్లాన్ తో ఆ దోపిడీ మొత్తం జరిగింది. అతడికి పోస్టాఫీసులో పనిచేసిన అనుభవం కచ్చితంగా ఉండే ఉంటుంది. ఈ ఘటన జరిగి సుమారు 36 ఏళ్లు దాటింది. ఆ ఇద్దరు ఎక్కడున్నారో, ఏమయ్యారో పోలీసులు ఇప్పటికీ కనిపెట్టేలేకపోయారు. దాంతో ఈ స్టోరీ ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
ఇంతకీ.. ఎవరీ 'జో అలెన్ వీగెల్'!?
నమ్మకాన్ని పెనవేసుకుని పుట్టే మోసానికి.. కేవలం బలి తీసుకోవడమే తెలుసు. దానికి చట్టమంటే మహా అలుసు. చేసింది ఎంతటి ఘోరమైనా.. పరపతి నీడలో.. పలుకుబడి ముసుగులో.. శిక్షాస్మృతిని సైతం వెక్కిరిస్తుంది. అసలు ఈ నేరచరిత నేటిది కాదు. నేటితో ఆగేదీ కాదు. అలా అని, ఏదొక ప్రాంతానికే పరిమితమూ కాదు. ఎందుకంటే.. అది మానవసమూహంలో మంచితనం ముసుగుతో తిరుగుతుంది. ఎదుటివారి అవసరాన్ని, అమాయకత్వాన్ని, ఆశల్నీ, ఆలోచనలనీ.. అన్నింటినీ అంచనా వేసి, పొందాల్సిన లాభాన్ని పొందాకే.. అదను చూసి.. దెబ్బకొడుతుంది. ప్రపంచ చరిత్రలో అలా దెబ్బతిన్న బాధితుల గాథలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ‘జో అలెన్ వీగెల్’ ఉదంతం ఒకటి.1970, జూలై 2. పద్దెనిమిదేళ్ల ‘జో అలెన్ వీగెల్’ ఆశలన్నీ కుప్పకూలిన రోజది. తన మృత్యువుకు ప్రణాళిక ముందే సిద్ధమైందని, తనతో ఉన్నవారే యమకింకరులని ఆమెకు తెలియని రోజది. తెలిసే సమయానికి.. ఆమె లేనేలేదు. అమెరికాకు చెందిన ‘జో అలెన్ వీగెల్’.. చదువుకునే రోజుల్లో స్థానికుడైన మైక్ క్లైన్ అనే స్నేహితుడ్ని ప్రేమించింది. ఇద్దరిదీ సుమారు ఒకే వయసు. అతడు చాలా ఆస్తిపరుడు, అందగాడు. మెడిసిన్ చదువుతున్నాడు.‘త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం’ అని అతడ్ని తన కన్నవారికి పరిచయం చేసింది జో. మొదటి నుంచి శ్రామికులైన జో తల్లిదండ్రులు.. ఆ జంటను చూసి.. అతడి బ్యాగ్రౌండ్ చూసి ఎంతగానో మురిసిపోయారు. జో.. మైక్‌తో కలసి వెళ్లిందంటే వారికో ధైర్యం. ఏ సమస్య వచ్చినా మైక్ చూసుకుంటాడులే అనే ఓ నమ్మకం. జూలై 2 రాత్రి కూడా జో.. అతడితోనే వెళ్లింది కానీ తిరిగిరాలేదు.మరునాడు జో కోసం ఆమె తండ్రి జోసెఫ్ వీగెల్.. మైక్‌ని కలసి ఆరా తీశాడు. ‘మాకు వివాహం అయ్యింది. తను నా భార్య.. తన గురించి మీకంత శ్రద్ధ అవసరం లేదు’ అంటూ తిక్కగా సమాధానం చెప్పాడు మైక్. అతడ్ని ఆ తీరులో ఎప్పుడూ చూడలేదు జోసెఫ్. ‘గొడవపడ్డారా? నిన్న రాత్రి మీరిద్దరూ బయలుదేరే ముందు కూడా గొడవపడటం నేను విన్నాను. అసలేం జరిగింది? జో నిజంగా ఎక్కడికి వెళ్లిందో చెప్పు?’ అంటూ నిదానంగా, సముదాయింపుగా అడిగాడు జోసెఫ్.ఆ వాదనలో ‘తెలియదు’ అని ఒకసారి.. ‘బంధువుల ఇంటికి వెళ్లింది’ అని మరోసారి చెప్పాడు మైక్. వెంటనే జోసెఫ్.. మైక్ చెప్పిన బంధువుల ఇంటికి వెళ్లి మరీ జో గురించి వాకబు చేశాడు. ఇక్కడికి రాలేదని బంధువులు తెలపడంతో.. నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. ‘మా అమ్మాయి కనిపించడం లేదు.. కాబోయే అల్లుడు మైక్‌పై అనుమానం ఉంది, కంప్లైంట్ తీసుకోండి’ అని కోరాడు జోసెఫ్. టీనేజ్ పిల్లలు ఇంట్లో చెప్పకుండా ట్రిప్‌లకు వెళ్లడం, కొన్నిరోజులకు మళ్లీ తిరిగి రావడం కామన్ కాబట్టి.. సరైన ఆధారం లేకుండా కేసు నమోదు చేసుకోలేమని.. పోలీసులు తేల్చేశారు. దాంతో జో పేరెంట్స్‌కి జో కోసం ఎదురుచూడటం తప్ప మరో దారి లేకుండా పోయింది.సరిగ్గా మూడురోజులకి.. కొన్ని మైళ్లదూరంలో ఉన్న విన్నెబాగో సరస్సులో జో.. కేవలం లో–దుస్తులతో శవమై తేలింది. బాడీని జో పేరెంట్స్ గుర్తుపట్టడంతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు మొదలుపెట్టారు. జో కాళ్లకు.. బరువైన కాంక్రీట్ బండ, బరువైన వాటర్ టిన్ను కట్టి ఉన్నట్లు గుర్తించారు పోలీస్ అధికారులు. శవం పైకి తేలకుండా ఉండటానికే అలా చేసి ఉంటారని ప్రా«థమిక నిర్ధారణకు వచ్చారు. బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించారు. ఆ రిపోర్ట్‌లో జో గొంతు నులమడం వల్లే చనిపోయిందని.. ఆమె 4వ నెల గర్భవతి అని తేలింది.పైగా ఆ సరస్సు ఒడ్డునే మైక్ నివాసం కావడంతో జో కేసు మొత్తం మైక్ చుట్టూనే తిరిగింది. అయితే జో బాడీ దొరికిన రోజే.. మైక్ యూరప్ చెక్కేశాడు. జో బాడీకి కట్టిన ఆ కాంక్రీట్ బండ.. మైక్ స్నేహితుడి ఇంటి ముందు ఉన్న మరిన్ని బండలతో సరిపోలింది. పైగా ఆ బండకు కట్టిన తాడు.. మైక్ ఇంట్లోని స్పీడ్ బోట్లో ఉండే బెల్ట్ అని తేలింది. ఇక మైక్ వాడే కారులో.. ఒక టవల్ దాని నిండా జో తల వెంట్రుకలు ఉన్నాయి. అవి జో మరణానికి ముందు.. తల నుంచి బలవంతంగా లాగినట్లు నేర పరిశోధనలో తేలింది. అంటే జోను చంపే సమయంలో తీవ్రమైన పెనుగులాట జరిగిందని అధికారులు నిర్ధారించుకున్నారు.ఈలోపు ఆర్థికంగా ఉన్నతస్థానంలో ఉన్న మైక్ తండ్రి డొనాల్డ్ క్లైన్.. కొడుకుని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే మీడియా కన్ను.. విన్నెబాగో సరస్సు ఒడ్డున ఉన్న మైక్ ఖరీదైన ఇంటి మీద పడింది. పోలీసులతో పాటు రిపోర్టర్స్ కూడా ఆ ఇంటిని శోధించి.. మైక్ ఇంటి అందాన్ని.. ఆ ఇంట్లో ఉన్న కార్లు, స్వీడ్ బోట్స్ లెక్కల్ని వాటి ధరల్నీ చెబుతూనే.. ‘జోకి అన్యాయం చేసిన మైక్ ఎక్కడ?’ అనే ఎన్నో కథనాలను ప్రచురించారు. జో గర్భిణి అని తెలుసుకున్నవారంతా మైక్ కుటుంబంపై దుమ్మెత్తిపోశారు.ఇక సరిగ్గా వారానికి యూరప్ నుంచి తిరిగి వచ్చిన మైక్‌ని అరెస్ట్ చేసి విచారణకు పంపించారు. అయితే అతడు నోరు విప్పలేదు. ఏం జరిగిందో చెప్పలేదు. జోను చంపింది తానేనని ఒప్పుకోలేదు. అదంతా అతడి లాయర్ సలహానే అని మీడియా గగ్గోలుపెట్టింది. కేసు నడుస్తుండగానే బెయిల్‌పై బయటికి వచ్చిన మైక్.. వాయిదాల ప్రకారం కోర్టుకు వచ్చిపోతుండేవాడు. జో హత్యపై తీవ్రమైన అభియోగాలు ఎదురవడంతో.. జూలై 24న గ్రాండ్ జ్యూరీలో మైక్.. బెయిల్ రద్దు చేస్తూ.. తిరిగి మైక్‌ని అదుపులోకి తీసుకోమని ఆదేశాలొచ్చాయి. అయితే ఆ రోజు నుంచి మైక్ ఎవరికీ కనిపించలేదు. నేటికీ దొరకలేదు.మైక్ మారుపేరుతో తన ఎడ్యుకేషన్ మొత్తం పూర్తి చేసి.. పశువైద్యుడిగా జీవితాన్ని రీస్టార్ట్ చేశాడని.. ఇప్పటికీ అతడు.. లాటిన్ అమెరికాలో రహస్యంగా, సురక్షితంగా జీవిస్తున్నాడని చాలామంది చెబుతుంటారు. అతడి ఆచూకీ ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ.. తన తండ్రి డొనాల్డ్‌కి కచ్చితంగా తెలుసు అని అధికారులు సైతం నమ్మారు. 1988లో డొనాల్డ్ మృతి చెందాడు. అంతకుముందే జో పేరెంట్స్ కూడా ఈ కేసుపై పోరాడి పోరాడి.. అనారోగ్యసమస్యలతో చనిపోయారు. ఈరోజుకి మైక్ బతికి ఉంటే అతడికి డెబ్బై రెండేళ్లు దాటి ఉంటాయని అంచనా. అతడికి సంబంధించిన పలు ఊహాచిత్రాలు.. నేటికీ ఎఫ్‌బీఐ రికార్డ్స్‌లో ‘మోస్ట్ వాంటెడ్’ నోట్‌తో కనిపిస్తుంటాయి.ఏది ఏమైనా.. జో మృతిలో మైక్ హస్తం ఉందనే స్పష్టత అతడి మిస్సింగ్‌తో తేలిపోతుంది. కానీ ఆమెను మైక్ ఎందుకు చంపాడు? ఎవరెవరు ఈ కుట్రలో పాల్గొన్నారు? జో తల్లి కాబోతుందన్న నిజం తెలిసి కూడా చంపేశాడా? అసలు మైక్ ఏమైపోయాడు? ఎటుపోయాడు? ఎక్కడున్నాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు మాత్రం నేటికీ మిస్టరీనే మిగిలిపోయాయి. – సంహిత నిమ్మన -
`ఆ ఇంట్లో బసచేసిన వారికి రాత్రి వేళ' ఆమె..
అదో చిన్న హిల్ స్టేషన్ . పశ్చిమ బెంగాల్, కాలింపోంగ్లోని దర్పిన్ దారా పర్వతం మీద పదహారు ఎకరాల ఎస్టేట్. 1930లో ఇద్దరు బ్రిటిష్ ధనవంతులు.. తమ పిల్లలకు వివాహం చేసి.. బంధుత్వం కలుపుకున్నారట. ఆ సందర్భంగానే అక్కడ ఇల్లు కట్టించి దాన్ని.. ఆ నూతన దంపతులకు బహుమతిగా ఇచ్చారట. అయితే ఆ దంపతులకు వారసులు లేకపోవడంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ ఆస్తిని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.1962లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనారోగ్యం పాలైన తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వ విశ్రాంతి గృహంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అయితే, నెహ్రూ ఆకస్మిక మరణం కారణంగా ఆ ప్రయత్నం ఆగిపోయింది. 1975లో ‘పశ్చిమ బెంగాల్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ’ ఆ ఇంటి నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఇదంతా చరిత్ర. ప్రస్తుతం ఈ ఇల్లు.. ఒక హోటల్‌గా.. పర్యాటకులకు వింత అనుభూతుల్ని పంచుతోంది.ఆ ఇంటి యజమాని పేరు ‘జూట్ బేరన్ జార్జ్ మోర్గాన్’ అని.. అతడు తన భార్య లేడీ మోర్గాన్‌ను ఎంతగానో ప్రేమించేవాడని.. ఆమె మరణం తర్వాత.. ఆమె ఆత్మ అదే ఇంట్లో ఉండిపోయిందని చెబుతుంటారు. మిసెస్ మోర్గాన్ ఆత్మ ఇప్పటికీ అక్కడే తిరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఆ ఇంట్లో బసచేసిన వారికి రాత్రి వేళ.. ఆమె హైహీల్స్ వేసుకుని మెట్లు దిగుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుందట. పైగా ఆ పరిసరాల్లో ఏవో గుసగుసలు వణికిస్తాయట.బయట నుంచి చూడటానికి ఆ ఇల్లు.. పచ్చటి తీగలు అల్లుకుని.. ప్రకృతి అందాల్లో కలగలిసిపోయినట్టు ఉంటుంది. అటుగా వెళ్లిన పర్యాటకులకు హడలెత్తించే కథలను కలబోసి చెబుతుంది. టూరిస్ట్ ప్లేస్‌గా మారినప్పటి నుంచి ఈ భవనం చుట్టూ అనేక చెట్లు, మరిన్ని కట్టడాలు పుట్టుకొచ్చాయి. చిన్నచిన్న కాటేజ్‌లను నిర్మించారు.బాలీవుడ్ నటులు సైతం ఇక్కడ బసచేశారట. థ్రిల్ కోరుకునేవారు, సాహసికులు.. ఇక్కడి అందాలతో పాటు లేడీ మోర్గాన్ అడుగుల సవ్వడిని వినడానికి ఈ హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటున్నారట. మరి నిజంగానే అక్కడ అంతుచిక్కని శక్తి ఉందా? ఉన్నపళంగా వినిపిస్తున్న గుబులురేపే ఆ అలికిడి.. లేడీ మోర్గాన్ ఉనికికి నిదర్శనమా? అనేది నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన -
కుర్సియాంగ్ ప్రకృతిలో.. ఏదో తెలియని వికృతి దాగుందట..
ప్రకృతి, వికృతి.. ఇవి ఏనాటికీ ఒకటి కాలేవు. ఎక్కడా ఒకటిగా కానరావు. కానీ కుర్సియాంగ్ ప్రకృతిలో ఏదో తెలియని వికృతి దాగుందట. చిత్రవిచిత్రమైన రూపాల్లో వణికిస్తోందట. ఏంటా మిస్టరీ.?పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్.. పర్యాటకానికి పెట్టింది పేరు. అందులో ‘డౌ హీల్’ మాత్రం.. అతీంద్రియశక్తులపై ఆసక్తి చూపేవాళ్లకు ఇస్తుంది మాంచి జోరు. డార్జిలింగ్ నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్సియాంగ్కి సరిగ్గా 10 నిమిషాలే డౌ పర్వతాలు. దీన్ని చాలామంది ‘మోస్ట్ హాంటెడ్ హిల్ స్టేష¯Œ ’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎన్నో హారర్ స్టోరీస్ వినిపిస్తారు.ఒక పక్క తేయాకు తోటలు.. మరో పక్క ఆర్కిడ్ పూల తోటలు.. చుట్టూ కొండలు, పెద్దపెద్ద చెట్లతో దట్టమైన అడవిని తలపిస్తుందీ ప్రాంతం. అయితే సాయంత్రం ఐదు దాటితే.. డౌ హిల్ రోడ్ నుంచి ఫారెస్ట్ ఆఫీస్ మధ్య ఎవ్వరూ తిరగరు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏవో శక్తులు తిరుగుతూ ఉంటాయని అక్కడివారి నమ్మకం. పైగా ఆ రోడ్ని.. ‘డెత్ రోడ్’ అనీ పిలుస్తుంటారు. అక్కడ ఒక ఆడ దయ్యాన్ని చూశామని కొందరు.. ఏవో అరుపులు, ఆర్తనాదాలు విన్నామని ఇంకొందరు.. గగుర్పాటును కలిగించే వింత రూపాలను చూశామని మరికొందరు.. చెబుతుంటారు.విక్టోరియా బాయ్స్ హై స్కూల్ఇక ఆ సమీపంలోనే ఉన్న ‘విక్టోరియా బాయ్స్ హై స్కూల్’కి కూడా ఈ గాలి సోకిందని వారందరి నమ్మకం. ‘ఒక తల లేని బాలుడు ఆ స్కూల్ నుంచి అడవిలోకి నడిచి వెళ్లడం కళ్లారా చూశాం’ అని.. అడవిలో కట్టెలు కొట్టుకునే బృందం సాక్ష్యం చెప్పింది. అడవికి వనమూలికల కోసం వచ్చే మరో బృందమైతే.. చింతనిప్పుల్లాంటి ఎర్రటి కళ్లు తమని వెంబడించాయని, తరిమేశాయని కొత్తకథను వినిపించింది. అతీంద్రియ శక్తులపై ఆసక్తి ఉన్నవారు ఇక్కడికి వెళితే తప్పకుండా వారు ఆశించినవి ఎదురవుతాయని కొందరి పర్యాటకులు నమ్మకంగా చెబుతుంటారు.‘విక్టోరియా బాయ్స్ హై స్కూల్’ శీతకాలపు సెలవుల్లో.. సాయంత్రం అయితే చాలు.. మూసి ఉన్న స్కూల్ నుంచి పెద్ద పెద్ద గుసగుసలు, అడుగుల చప్పుళ్లు ప్రతిధ్వనిస్తుంటాయట. సూర్యాస్తమయం కాగానే.. పెద్ద హోరుగాలి చుట్టుముడుతుందని.. భవనం కారిడార్లలో అబ్బాయిల నవ్వులు, పరుగెత్తడం స్పష్టంగా వినిపిస్తాయని స్థానికులు పెద్దపెద్ద కళ్లు చేసుకుని వివరిస్తుంటారు. అయితే ఇక్కడ చదువుకునే విద్యార్థులు కానీ.. చదువు చెప్పే ఉపాధ్యాయులు కానీ ఏనాడూ దయ్యాల కథలు చెప్పలేదు. ఎటువంటి అనుమానస్పద స్థితి గురించి నిర్ధారించలేదు. అయితే స్థానికులే కాకుండా ఇక్కడికి వెళ్లిన పర్యాటకులకూ వింత అనుభవాలు ఎదురవ్వడంతో ఈ కొండమలుపుల్లో, చెట్టు చేమల్లో ఏదో శక్తి ఉందనే ప్రచారం మాత్రం విస్తృతంగా సాగుతోంది. దాంతో ఈ ప్రాంతం మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
ఆ పేరు వినబడితే చాలు.. వెన్నులోంచి వణుకొస్తుందట!!
గోవా అనగానే గుర్తొచ్చేది అందమైన సముద్ర తీరాలు.. అంతులేని సరదాలే! అయితే వాటితోపాటు హారర్ దృశ్యాలూ అక్కడ కామనే! వాటిల్లో ‘సాలిగావ్ మర్రిచెట్టు’ ఒకటి. సాలిగావ్ పేరు వినబడితే చాలు గోవన్లకు వెన్నులోంచి వణుకొస్తుందట. పనాజీ నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న సాలిగావ్.. హడలెత్తించే దయ్యం కథలకు ప్రసిద్ధి.‘మే డి డ్యూస్’ క్యాథలిక్ చర్చ్‌కి సమీపంలోని ఓ పెద్ద మర్రిచెట్టు వెనుక.. సుమారు 72 ఏళ్లనాటి బెదరగొట్టే హారర్ స్టోరీ ఉంది. అందుకే రాత్రి పూట ఆ చెట్టు వైపు చూడాలన్నా ఆ ఊరివారు భయపడుతుంటారు. దడపుట్టించే ఈ కథ 1952లో వినపడటం మొదలైంది.ఆ ఏడాది చివరిలో సాలిగావ్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిలెర్నేలో క్రిస్టియన్ సెమినరీ (క్రైస్తవ మతబోధనలు జరిగే విద్యాలయం) నిర్మాణం మొదలైంది. దానికి ఇనాషియో లారెంకో పెరీరా అనే పోర్చుగీస్ ఫాదర్.. మేనేజర్‌గా నియమితుడయ్యాడు. అతను సాలిగావ్లో నివాసం ఉంటూ.. సెమినరీ పనులను పర్యవేక్షిస్తూ ఉండేవాడు.ఒక ఆదివారం ఉదయాన్నే సెమినరీకి వెళ్లి తిరిగి రాలేదు. మరునాడు కూడా అతని జాడ లేకపోవడంతో.. అతని కోసం స్థానికులు, చర్చ్ ఫాదర్స్ ఊరంతా వెతకడం మొదలుపెట్టారు. ఆ గాలింపులో పెరీరా సాలిగావ్‌లోని మర్రిచెట్టు పక్కనే బురదలో అపస్మారకస్థితిలో కనిపించాడు. అతనిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ రాత్రే అతను సృహలోకి వచ్చినా 4 రోజుల పాటు మౌనంగానే ఉండిపోయాడు. ఐదోరోజు ఉదయాన్నే అతను ఆడ గొంతుతో కొంకణీ భాషలో మాట్లాడటం మొదలుపెట్టాడు.పెరీరాకు దయ్యం పట్టిందని గుర్తించిన క్రైస్తవ గురువులు.. ఆ మర్రిచెట్టుకు.. జీసస్ శిలువను రక్షణగా కట్టారు. వైద్యం అందిస్తున్నా పెరీరా ఆరోగ్యస్థితి మెరుగుపడలేదు. మరింత క్షీణించసాగింది. మధ్యమధ్యలో అతను ‘క్రిస్టలీనా’ అని అరవసాగాడు. దాంతో పెరీరాకు పట్టిన దయ్యం పేరు ‘క్రిస్టలీనా’ అని అక్కడివారు నిశ్చయించుకున్నారు.ఆధునిక వైద్యం కోసం అతనిని స్వదేశమైన పోర్చుగల్‌కు పంపించేశారు. ఇక పెరీరా తిరిగి రాలేదు. సరిగ్గా ఐదేళ్లకు అంటే 1957లో ఆ మర్రిచెట్టుకు కట్టిన శిలువ సగభాగం మాయమైపోయింది. దాంతో క్రిస్టలీనా దయ్యం తిరిగి ఆ మర్రిచెట్టును చేరుకుందని ఆ ఊరి వారు నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ దయ్యం అక్కడే ఉందని విశ్వసిస్తారు. దాంతో అటు హిందువులు.. ఇటు క్రైస్తవులు కూడా క్రిస్టలీనాను శాంతపరచే పూజలు చేస్తూ.. రాత్రిపూట ఆ మర్రిచెట్టు దరిదాపుల్లోకి పోకుండా జాగ్రత్తపడుతున్నారు.ఆ చెట్టు గోవా మొత్తానికీ ఆత్మలు గుమిగూడే ప్రదేశమని.. అక్కడ దయ్యాలు, అతీంద్రియశక్తులు కొలువుంటాయని స్థానికుల గట్టి నమ్మకం. అందుకే అటువైపు ఎవ్వరూ పోయే సాహసం చెయ్యరు. మరి ఆ మర్రిచెట్టులో క్రిస్టలీనా ఆత్మ ఉందా? అసలు ఆమె ఎవరు? ఎందుకు పెరీరాను పీడించింది? అసలు పెరీరా ఏమయ్యాడు? ఇలాంటి సందేహాలకు నేటికీ సమాధానం లేదు. అందుకే ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
డెవిల్స్ పూల్! ఆ నీళ్లల్లో అడుగుపెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదట!!
క్వీన్స్లండ్, ఆస్ట్రేలియన్ బుష్‌లో ‘బబిందా బౌల్డర్స్ పూల్’ అనే విస్తారమైన ఈత కొలను.. సహజ అందాలకు కొలువు. కానీ ఆ నీళ్లల్లో అడుగుపెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదట. 1959 నుంచి ఇప్పటి వరకు ఆ కొలనులో పడి సుమారు 21 మందికి పైగా చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొన్ని మృతదేహాలు ఇంకా దొరకను కూడా లేదు. ఆ కొలను రాళ్ల మధ్య ఉంటుంది. అక్కడ నీరు ఉన్నట్టుండి పెరుగుతుంది, అకస్మాత్తుగా తగ్గుతుంది.కాలాన్ని బట్టి.. సమయాన్ని బట్టి మారుతుంది. పైగా ఆ రాతికొండలకు లోతైన గోతులు, గుంతలు ఉంటాయి. వాటిల్లో నీళ్లు నిండి.. కొన్ని చోట్ల ఆ గుంతలు కనిపించను కూడా కనిపించవు. ఆ క్రమంలోనే అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఆ గోతుల్లో ఇరుక్కుని.. బయటికి రాలేక చనిపోతున్నారు. ఆ కొలనులో నీరు నిండుగా ఉన్నా.. నేల మట్టానికి చేరుకున్నా.. కళ్లు చెదిరే అందం అక్కడి ప్రకృతి సొంతం. అందుకే ఆ అందాలను చూడటానికి, ఈత కొట్టడానికి జనాలు ఎగబడుతుంటారు. కొన్ని డేంజర్ జోన్స్‌ని సూచిస్తూ హెచ్చరికలు, గమనికలు ఉన్న బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. అయినా ప్రమాదాలు ఆగడంలేదు.అక్కడికి వచ్చే వారిలో ఒకరిని ఆ కొలను దగ్గరుండే దయ్యం ఎన్నుకుంటుందని.. వారిని చావుకు ఆహ్వానిస్తుందని.. బాధితులంతా అలా చనిపోయినవారేనని కొందరు స్థానికుల నమ్మకం. ఆ తరహాలోనే.. సమీపంలో నివసించే ఆదివాసులు.. హడలెత్తించే విషాద గాథనూ వినిపిస్తుంటారు. కొన్నేళ్ల క్రితం యిండింజి తెగకు చెందిన ఊలానా అనే అందమైన యువతి.. వరూనూ అనే ఆ జాతి పెద్దను వివాహం చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించిందట.అయితే వివాహమైన కొన్నాళ్లకి ఊలానా జీవితంలోకి మరొక తెగకు చెందిన డైగా అనే యువకుడు రావడంతో.. అది వారి మధ్య ప్రేమకు దారితీసింది. కొంతకాలం గుట్టుగా సాగిన ఆ బంధం.. ఉన్నట్టుండి బంధువుల మధ్య పంచాయతీకి రావడంతో అవమానాన్ని తట్టుకోలేక ఊలానా.. బబిందా బౌల్డర్స్ పూల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుందట. అయితే ఆమె ఆ కొలనులోకి దూకే క్రమంలోనే ‘డైగా డైగా’ అని అరిచిందట. ఆ అరుపులకు డైగా కూడా అదే కొలనులో దూకి చనిపోయాడు.అయితే డైగా దూకడం, చనిపోవడం అంతా.. ఊలానా చనిపోతూనే కళ్లరా చూసిందట. తాను చనిపోతున్న సమయంలోనే.. తన ప్రియుడి చావుని చూస్తూ.. భీకరంగా ఏడ్చిందట. ఆ కన్నీరే ఆ కొలను నీటిమట్టాన్ని పెంచిందని.. కొలనులో ప్రమాదకరమైన గుంతలను ఏర్పరచిందని వారంతా చెబుతారు. అందుకే ఆ ప్రాంతాన్ని వారు హాంటెడ్ ప్రదేశంగా నమ్మి.. అటువైపు పోవద్దని హెచ్చరిస్తుంటారు.మొదట బాధితుడు లేదా బాధితురాలి శరీరంలోకి డైగా ఆత్మ చేరుతుందని.. నీటిలో ఉన్న ఊలానా ఆత్మ.. ప్రేమగా ‘డెగా డైగా’ అని పిలవగానే.. బాధితులు తమపై తాము నియంత్రణ కోల్పోయి.. నీటిలో ఇరుక్కునేలా డైగా ఆత్మ చేస్తుందని.. అలా ఆత్మల ప్రేమకు అమాయకులు బలవుతున్నారనేది స్థానికుల మాట.మరోవైపు 1940లో జాన్ డొమినిక్ అనే ఎనిమిదేళ్ల బాలుడు ఆ నీటిలో మునిగి చనిపోయాడు. అతడి కుటుంబం అక్కడే అతడి పేరున స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ ఫలకాన్ని తన్నిన ఓ యువకుడు.. ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడని, డొమినిక్ ఆత్మే అతడ్ని మాయం చేసిందనే మరో హారర్ స్టోరీ వినిపిస్తూ ఉంటుంది.ఒకానొక సాయంత్ర వేళ ఒక జంట ఆ కొలను అందాలు చూడటానికి వెళ్తే.. ఉన్నట్టుండి నీళ్లు అనకొండలా పైకి లేచి.. రాళ్ల మీదున్న వారిని కొలనులోకి లాక్కెళ్లడం ఓ వ్యక్తి కళ్లారా చూశాడట. అప్పటి నుంచి ఆ కొలనుపై పుకార్లు మరింతగా పెరిగిపోయాయి. ఏదిఏమైనా ఆ ప్రదేశంలో ఏ శక్తి ఉంది? ఎందుకు అంతమంది చనిపోతున్నారు? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన -
ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!?
ఇథియోపియా, అడిస్ అబాబాకు దక్షిణంగా ఉన్న సోడో ప్రాంతంలోని తియా పురావస్తు ప్రదేశం.. ప్రపంచాన్నే ఆకట్టుకుంటుంది. ఇక్కడ పదుల సంఖ్యలో మెగాలిథిక్ స్తంభాలు.. 12 లేదా 14వ శతాబ్దాల నాటి ఎన్నో కథలను.. ఊహించి చెబుతుంటాయి. అందుకే అవన్నీ మార్మిక సంకేతాలతో మానవ చరిత్రకు వారసత్వ సంపదగా చరిత్రలో నిలిచాయి.సంక్లిష్టమైన సామాజిక–మతపరమైన పద్ధతుల్లో కొన్ని రకాల చిహ్నాలు.. ఆ శిలాఫలకాలపై చెక్కి ఉన్నాయి. కత్తులు, బొమ్మలు ఇలా ఎన్నో భావనలతో చెక్కిన ఆ స్తంభాలు.. యునెస్కో గుర్తింపును కూడా పొందాయి. అందుకే ఇవన్నీ.. శాస్త్రవేత్తలను, పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. పురాతన ఇథియోపియన్ సంస్కృతికి చెందిన ఆచారాలకు, నమ్మకాలకు ఇవి నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఈ అమూల్యమైన ప్రదేశాన్ని సంరక్షించడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. ఈ శిలాఫలకాలు, వాటిపైనున్న మార్మిక చిహ్నాలు పురాతన రాతియుగం నాటి పరిస్థితుల్ని సూచిస్తాయి. కానీ ఆ సూచనలు నేటి తరాలకు ఏ మాత్రం అర్థం కాకుండా ఉన్నాయి.ఇక్కడ మొత్తంగా 36 మెగాలిథిక్ స్తంబాలు ఉన్నాయి. వాటి మీదున్న కత్తుల బొమ్మలు ఏదైనా దైవ శక్తిని లేదా సైనిక శక్తిని సూచిస్తూ ఉండవచ్చని నిపుణుల అంచనా. కానీ దానిపై స్పష్టత లేదు. ఇక ఇతర బొమ్మల విషయానికి వస్తే ఆనాటి జ్యోతిష వివరాలను, ఆనాటి నాగరికత వివరాలను తెలుపుతున్నట్లుగా అనిపిస్తున్నాయని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. 1930ల వరకు ఈ పురావస్తు ప్రదేశం వెలుగులోకి రాలేదు. ఇథియోపియా ప్రాంతీయ సర్వేల సమయంలో ఫ్రెంచ్ పరిశోధకులు వీటి ప్రాముఖ్యతను గుర్తించి, వీటి వివరాలను ప్రపంచానికి వెల్లడించారు.ఆ రాతిస్తంభాలన్నీ పురాతన యుగంలో.. అంటే 12 లేదా 14 శతాబ్దంలోని చనిపోయిన పూర్వీకుల జ్ఞాపకార్థం కావచ్చని కొందరు లేదంటే అప్పటి సమూహానికి నాయకుడిగా ఉన్న నాయకుడి గౌరవార్థం కావచ్చని మరికొందరు అంచనా వేశారు. ఆ లెక్కన చూస్తే.. ఇది పురాతన శ్మశానవాటిక కావచ్చని కూడా కొందరి అభిప్రాయం. అయితే ఈ స్తంభాలు వెనుకున్న అసలు కథ ఏమిటి? అన్నది మాత్రం నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన -
'అపార్ట్మెంట్ 66బి’ గురించి.. కనీసం మాట్లాడాలన్నా ధైర్యం చాలదు!
దేవుడు విడిచిపెట్టిన ప్రదేశాలలో మాత్రమే దయ్యాలు కనిపిస్తాయనేది నానుడి. అలాగే, ‘నిర్మానుషమైన ప్రదేశాల్లో చీకటి వేళల్లో మాత్రమే దయ్యాలు కనిపిస్తాయనుకుంటే పొరబాటే’ అంటారు చాలామంది. అందుకే కాబోలు.. మహారాష్ట్ర రాజధాని ముంబై పరిసర ప్రాంతాలు ఎంత రద్దీగా ఉన్నా.. ఎంత జన సందోహంతో నిండి ఉన్నా.. అక్కడ వెంటాడే భయానక కథలు కోకొల్లలుగా వినిపిస్తుంటాయి. అలాంటి కథల్లో బృందావన్ సొసైటీ హారర్ స్టోరీ ఒకటి.ముంబై, థానే ప్రాంతంలో ‘బృందావన్ సొసైటీ’ హడలెత్తించే కథలకు బాగా ఫేమస్. అందులో పదుల సంఖ్యలో బిల్డింగ్స్, వందల సంఖ్యలో అపార్ట్మెంట్స్ ఉంటాయి. అయితే అక్కడ నివసించే వారితో పాటు.. కాపలాకి వచ్చే వాచ్‌మన్, ఇంటి పని, వంట పని చేయడానికి వచ్చే పనివాళ్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇలా ప్రతి ఒక్కరూ ‘అపార్ట్మెంట్ 66బి’ గురించి కనీసం మాట్లాడాలన్నా భయపడతారు. అటు వైపు తేరిపార చూడాలన్నా వణికిపోతారు. అందులో దయ్యం ఉందని అక్కడివారి నమ్మకం. అందుకే ఆ దరిదాపుల్లోకి కూడా చాలామంది అడుగుపెట్టరు.ఆ అపార్ట్మెంట్లో ఉన్న దయ్యం తనకు ఎవరి వల్లనైనా ఇబ్బంది కలిగితే, వారిని లాగిపెట్టి కొడుతుందట! ఆ దయ్యం కొట్టిన చెంపదెబ్బకు గూబ గుయ్యిమంటుందట! అంతేకాదు, ఆ భవనం కారిడార్లలో ఏవేవో వింతస్వరాలు ప్రతిధ్వనిస్తుంటాయట! బెడ్ రూముల్లో ఏవో గుసగుసలు చెవిన పడతుంటాయట!ఆ చుట్టుపక్కల నివసించేవారిలో కొందరు మాత్రం ఆ 66బిలో కచ్చితంగా ఏదో ప్రేతాత్మ ఉందని, అటుగా వెళ్లినా, ఆ వైపు పరిశీలనగా చూసినా ఎవరో వేగంగా తమవైపు వస్తున్నట్లుగా అనిపిస్తుంటుందని చెబుతారు.అయితే అపార్టమెంట్ 66బి చరిత్రను తవ్వితే ఒక విషాదగాథ వినిపిస్తుంది. చాలా ఏళ్ల కిందట ఆ ఇంట్లో ఒంటరిగా ఉండే ఓ పెద్దాయన జీవితం మీద విరక్తితో, మానసిక ఒత్తిడితో బాల్కనీలోంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి బలవన్మరణం పోలీసు రికార్డుల్లో కూడా నమోదైంది. అయితే అప్పటి నుంచి అతని ఆత్మ ఆ పరిసరాల్లోనే తిరుగాడుతుందని, తనకు చిరాకు తెప్పించేవారిని కొట్టి భయభ్రాంతులను చేస్తుందని స్థానికుల్లో చాలామంది నమ్ముతారు.స్థానికుల నమ్మకానికి తగినట్లుగానే ఆ 66బి ఫ్లా్లట్ ఇప్పటికీ ఖాళీగా ఉంది. కొంతమంది నివాసితులు భవనంలో దయ్యం ఉండే అవకాశమే లేదని కొట్టిపారేస్తుంటే, మరికొందరు మాత్రం స్వయంగా తాము దయ్యం నీడను చూశామని, దాని గొంతును విన్నామని, దయ్యం చేతిలో దెబ్బలు కూడా తిన్నామని చెబుతుంటారు. ఇంకొందరైతే ఆ అపార్ట్మెంట్లో ఆ చుట్టు ప్రక్కల కేవలం ఒక్క దయ్యమే లేదని, చాలా దయ్యాలు ఉన్నాయని హడలెత్తిస్తారు. ఆ మాట విన్న కొందరు మాత్రం.. ‘ఇక్కడ చాలా దయ్యాలేమీ లేవు.. కొట్టే దయ్యం ఒక్కటే ఉంది. దానితో జాగ్రత్తగా ఉంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని చెబుతారు.ఏది ఏమైనా, ఆ సొసైటీకి వెళ్లిన కొత్తవారు ఈ వింత అనుభవాన్ని చవిచూడక మానరట! ఎందుకంటే కొత్తవారిని అక్కడి దెయ్యం ఈజీగా గుర్తుపడతుందట! తన దెబ్బను రుచి చూపిస్తుందట! పాతవారైనా సరే ఆ దయ్యానికి ఇబ్బంది కలిగిస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చి పోతుందట. మరి నిజంగానే అక్కడ ఆ పెద్దాయన ఆత్మ ఉందా? అసలు అది ఆ అపార్ట్మెంట్ యజమాని ఆత్మేనా? అసలు అక్కడుండేవారిని, అక్కడికి కొత్తగా వచ్చేవారిని కొడుతున్న అదృశ్య శక్తి ఏమిటి? ఆ ఆత్మతో పాటు మరికొన్ని అతీంద్రియశక్తులు అక్కడ గుమిగూడాయా? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మనఇవి చదవండి: దేవుళ్ల పండగ అంటే తెలుసు..! మరి దెయ్యాల పండగ? -
పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? వింటే షాకే!
1995, ఏప్రిల్ 6.. ఉదయం ఆరు దాటింది. అమెరికా, ఇండియానా రాష్ట్రం జెఫర్సన్ విల్లోని క్లార్క్ మెమోరియల్ హాస్పిటల్‌కి.. ఒక్కొక్కరుగా పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ‘టామీ బుర్ష్ డిప్యాటిక్’ అనే నిండు గర్భిణి కూడా తన కుటుంబంతో కలసి కాన్పు కోసం వచ్చింది. ఆ ఆసుపత్రి డాక్టర్స్ డ్యూ డేట్ ఏప్రిల్ 6 అని చెప్పడంతో.. అన్నీ సిద్ధం చేసుకుని వచ్చింది టామీ కుటుంబం. నెల తప్పినప్పటి నుంచీ తనకు వైద్యం చేస్తున్న డాక్టర్ డయానా ఒకోన్ పర్యవేక్షణలోనే ఉంది టామీ. అయితే ఆమె భర్త జేమ్స్ టాడ్ కారల్ మాత్రం చాలా కంగారుపడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఎందుకంటే.. టామీకి అది మూడో కాన్పు. అప్పటికీ రెండేళ్ల క్రితం.. రెండో కాన్పులో బిడ్డ.. పుట్టిన కాసేపటికే చనిపోయాడు. దాంతో.. ‘పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో? ఏమవుతుందో’ అనే భయం అతడ్ని వెంటాడసాగింది. ఆ భయం అతడినే కాదు.. టామీతో సహా వెంట వచ్చిన బంధువులందరినీ పట్టుకుంది.జాయిన్ అయిన రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకూ ప్రసవ వేదన అనుభవించింది టామీ. అప్పటివరకూ తల్లీబిడ్డల హాట్ బీట్స్‌ని గమనిస్తూనే ఉన్నారు డాక్టర్లు. కాన్పు సమయంలో కూడా.. ‘ఏం భయం లేదు లోపల బేబీ ఆరోగ్యంగా ఉంది’ అనే చెప్పారు. సాయంత్రం నాలుగు నలభై రెండు నిమిషాలకు టామీకి బాబు పుట్టాడు. పుట్టబోయే బిడ్డకు ‘లోగాన్ కారల్’ అని పేరుపెట్టాలని ముందే నిర్ణయించుకున్నారు ఆ దంపతులు. కానీ పుట్టిన బిడ్డ లోగాన్‌లో ఎలాంటి చలనం లేదు. దాంతో డాక్టర్ ఓకాన్.. బాబు(లోగాన్ )కు సీపీఆర్ చేయడం మొదలుపెట్టారు. అయినా ఫలితం లేకపోయేసరికి బాబును అత్యవసర గదికి తరలించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బిడ్డ గుండె కొట్టుకోలేదు. మెదడులో ఎలాంటి కదలిక లేదు. దాంతో సాయంత్రం 5:15 గంటలకు లోగాన్ కారల్ మరణించినట్లు ప్రకటించారు. పుట్టిన అరగంటలోనే బిడ్డ చనిపోవడం.. ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. టాడ్, టామీలు ఆ వార్త వినగానే కుప్పకూలిపోయారు. ఆసుపత్రి సిబ్బంది.. బాబు లోగాన్ ను చివరి చూపు కోసం ఆ కుటుంబీకులకు అందించారు. అనంతరం బాబుతో కలిపి ఫొటోలు తీస్తుండగా.. టామీ సోదరికి ఆ బాబు వెచ్చని ఊపిరి తగిలినట్లు అనిపించింది. ఉలిక్కిపడిన ఆమె.. వెంటనే వైద్యులతో చెప్పింది. కానీ వైద్యులు ఆమె మాటను కొట్టి పారేశారు. మరణించాడని చెప్పిన నలభై నిమిషాల తర్వాత బాబు వేడెక్కడం గమనించిన టామీ సవతి తల్లి.. ఆ విషయాన్ని మరోసారి ఓ నర్సు దృష్టికి తీసుకెళ్లింది.ఆ నర్సు.. లోగాన్ (బాబు)ను పరిశీలించి.. నాడి చూసింది. బాబు హార్ట్ బీట్నూ గమనించింది. ఆ చిన్న గుండె లయ ఆమెకు స్పష్టంగా వినిపించింది. వెంటనే డాక్టర్ ఓకాన్ను పిలిచి విషయం చెప్పింది. ఆమె బాబుని చెక్ చేసి.. షాక్ అయ్యింది. బాబు ప్రాణాలతో ఉండటంతో ఆ శుభవార్తను అందరికీ చెప్పింది. అయితే బాబు చనిపోయాడని అప్పటికే ఆరుగురు డాక్టర్స్, ఎనిమిది మంది నర్సులు నమ్మి.. నిర్ధారించిన తర్వాత.. కొన్ని గంటల్లో బాబు తిరిగి బతకడం మిరాకిల్‌గా.. అంతుపట్టని మిస్టరీగా మారిపోయింది.ఆ రోజు మొదలు లోగాన్ ‘మిరాకిల్ బేబీ’గా వార్తల్లోకి ఎక్కాడు. ‘అన్సాల్వ్డ్ మిస్టరీస్’, ‘ఇట్స్ ఎ మిరాకిల్’ వంటి ఎన్నో స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో.. లోగాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అయితే బాబు పుట్టుక నుంచీ మానసిక సమస్యలతో బాధపడుతూ.. వీల్ చైర్‌కే పరిమితం అయ్యాడు. అయినా తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్నే గడిపిన లోగాన్.. తన 24వ ఏట.. 2020లో తీవ్ర అనోరోగ్యానికి గురై మరణించాడు. అయితే ఆ రోజు చనిపోయాడనుకున్న లోగాన్ తిరిగి ఎలా బతికాడు? అంతమంది డాక్టర్స్ నిర్ధారించిన తర్వాత కూడా బాబులో పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? అనేది నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన -
మిస్టరీ.. 'ఆ వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే.. ఎందుకలా జరుగుతుంది'?
తూర్పు సీయరా నెవడా, కాలిఫోర్నియాలో ‘బాడీ’ అనే ఘోస్ట్ టౌన్ ని ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది సందర్శిస్తుంటారు. 7,395 అడుగుల (2,254 మీటర్లు) ఎత్తైన కొండపై ఉన్న ఈ చారిత్రక నగరం.. ఎన్నో మిస్టీరియస్ కథనాలతో నేటికీ ప్రపంచాన్ని వణికిస్తోంది. అక్కడి అందాలను కళ్లతో ఆస్వాదించాలే తప్ప కంటికి ఇంపైన వస్తువును ‘బాగుంది కదా’ అని తీసుకుని బ్యాగ్‌లో వేసుకున్నామో బొందితో కైలాసం ఖాయం. ఆ క్షణం నుంచే.. అక్కడున్న అతీంద్రయశక్తుల వేట మొదలవుతుందట.1859లో.. గి బోడే అనే వ్యక్తి.. తన స్నేహితులతో కలసి.. సీయరా పర్వతాలకు తూర్పువైపు వెళ్లినప్పుడు.. మొదటిసారి ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడట. అక్కడ బంగారు గని ఉందని గుర్తించిన ఆ స్నేహితులంతా.. ఎవరికీ తెలియకుండా ఆ స్థలాన్ని కొంతకాలం రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే తిరిగి తమతమ స్వస్థలాలకు బయలుదేరారు.అయితే బోడే తన స్వస్థలమైన మోనోవిల్కు వెళ్తుంటే.. దారిలో మంచు తుఫానులో చిక్కి మరణించాడు. దాంతో అతడి స్నేహితులంతా ఆ బంగారు గనులున్న ప్రాంతానికి బోడే అని పేరు పెట్టారు. అయితే బోర్డ్ మీద పేరు రాసే వ్యక్తి.. బోడేకి బదులుగా బాడీ అని రాయడంతో అదే పేరు స్థిరపడిపోయింది. కాలక్రమేణా ఆ గని గురించి తెలుసుకున్నవారి సంఖ్య పెరగడంతో.. 1876 నాటికి.. అక్కడ భారీ స్థాయిలో బంగారం తవ్వకాలు మొదలయ్యాయి. మైనింగ్ కంపెనీలు, హైడ్రో–ఎలక్ట్రికల్ కేంద్రాలతో ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందసాగింది.తదనుగుణంగా అక్కడ స్థిరపడేవారి సంఖ్య కూడా పెరగసాగింది. సుమారు 10 వేల మంది నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇతరప్రాంతాల నుంచీ రాకపోకలు పెరగడంతో రైల్వే మార్గం కూడా ఏర్పడింది. 1880 నాటికి, బాడీలో ఎన్నో వ్యాపారాలు వెలశాయి. అక్కడి ‘చైనా టౌన్’ అనే ఓ పెద్ద భవనంలో మొత్తం చైనీయులే ఉండేవారట. తమ దేశానికి చెందిన వస్తువుల్ని అక్కడి స్థానికులకు అమ్మేవారట. అయితే బాడీ టౌన్ మొత్తంలో క్రైమ్‌రేట్ విపరీతంగా ఉండేదట. హత్యలు, జూదం, వ్యభిచారం, దోపిడీలు, తుపాకీ కాల్పులు ఇలా వీధికో అఘాయిత్యం నమోదయ్యేదట.1882 ప్రాంతంలో బతుకు తెరువు కోసం ఓ కుటుంబం బాడీకి వెళ్లాల్సి వచ్చిందట, దాంతో ఆ ఇంటి చిన్నారి ‘‘వీడ్కోలు దేవా.. మేము బాడీకి వెళ్తున్నాం’’ అని ఏడుస్తూ గట్టిగా ప్రార్థించిందట. దాన్ని బట్టి అర్థంచేసుకోవచ్చు బాడీలో ఎలాంటి భయానక వాతావరణం ఉండేదో? అక్కడికి వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామన్న నమ్మకం ఎవరికీ ఉండేదికాదట.అన్యాయాలు, అహింసలతో కొందరు చనిపోతే.. తీవ్రమైన మంచు కారణంగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరేమో మైనింగ్ ప్రమాదాల్లో అసువులుబాశారు. ఇదిలా ఉంటే.. 1892లో ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించి తీవ్రమైన ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టమూ వాటిల్లింది. గనులు ఖాళీ కావడంతో.. 1917 నాటికి రైల్వే మార్గాన్ని కూడా నిలిపివేశారు. 1932లో మరొక భారీ పెద్ద అగ్నిప్రమాదం జరిగేసరికి.. పట్టణమంతా ఖాళీ అయ్యింది. అలా ప్రకృతితో మమేకమైన బాడీ.. ఇప్పుడు మాత్రం ఎన్నో వ్యథలను వినిపిస్తోంది.బాడీ పట్టణాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవంటారు పర్యాటకులు. కొండ కోనల్లో, విశాలమైన గడ్డి మైదానాల్లో .. చెల్లాచెదురుగా పడున్న వాహనాలు.. నాటి కట్టడాలు, గుర్రపు బండ్లు వంటివన్నీ చిత్రకారుడు గీసిన పెయింటింగ్‌లా ఆకట్టుకుంటాయి. ఇక్కడ మొత్తం 168 భవనాలు నేటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తాయి. సమీపంలోని శ్మశానవాటికలో 150 మంది ఖననాలు కనిపిస్తాయి. అయితే.. బాడీ టౌన్ లో పగటి పూట కూడా విచిత్రమైన అలికిడులు భయపెడతాయట.ఆ పురాతన ఇళ్లల్లో నిద్ర చేయడానికి సాహసించిన ఎందరో పర్యాటకులు అక్కడి అతీంద్రియశక్తులేవో తమకు ఊపిరి ఆడకుండా చేశాయని, కనిపించని రూపాలేవో వణికించాయని తమకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. మరోవైపు ‘ఒ కెయిన్ హౌస్’ అనే ఇంట్లో ఒక చైనా మహిళ.. దయ్యంగా తిరుగుతుందని స్థానికుల నమ్మకం. అలాగే శ్మశానవాటికలో ‘ఎవెలిన్’ అనే మూడేళ్ల పాప ముసిముసి నవ్వులు వినిపిస్తాయనీ చెబుతుంటారు. ఎవెలిన్ మరణ వివరాలు 1897 రికార్డ్స్‌లో ఉన్నాయి.ఇక్కడికి వచ్చిన ఎందరో పర్యాటకులు ఇక్కడ దొరికిన సీసాలను, చిన్న చిన్న బొమ్మలను తమ వెంట తీసుకెళ్లి ప్రమాదాలను కొనితెచ్చున్నారట. తీసుకెళ్లిన ప్రతి వస్తువు ఒక లేఖతో పాటు బాడీకి తిరిగి రావడమే ట్విస్ట్. ‘‘ఈ వస్తువును దొంగిలించినందుకు లేదా తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి’ అని రాసిన ఎన్నో అజ్ఞాత లేఖల్లో.. బాడీలోని వస్తువుల్ని వెంట తీసుకుని వెళ్లడం వల్ల వాళ్లు ఎదుర్కొన్న సమస్యలను రాశారా బాధితులు.కారు ప్రమాదాలు జరగడం, ఉద్యోగాలు కోల్పోవడం, తీవ్ర అనారోగ్యానికి గురికావడం ఇలా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడి.. తిరిగి ఆ వస్తువుల్ని బాడీకి పంపించేశారట. అందుకే తెలిసినవారు ఎవ్వరూ ఇక్కడి వస్తువుల్ని బ్యాగ్‌లో వేసుకోరు. ఏది ఏమైనా ఇక్కడ ఉన్న అతీంద్రియశక్తులు ఏంటీ? ఇక్కడి వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే ఎందుకు వారిని వెంటాడుతున్నాయి? అనేది నేటికీ మిస్టరీయే! – సంహిత నిమ్మనఇవి చదవండి: Short Story: ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో.. -
మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..
అది 1968, ఇంగ్లండ్‌లోని గ్లోస్టర్షర్లోని వాటన్–అండర్–ఎడ్జ్‌లో ఉన్న ఈ ప్రసిద్ధ చారిత్రక కట్టడాన్ని ‘జాన్ హంఫ్రీస్’ అనే వ్యాపారవేత్త కొనుగోలు చేశాడు. అప్పటి దాకా ఆ భవనం 11వ శతాబ్దానికి చెందినదని, అందులో కొన్నేళ్ల పాటు బార్ అండ్ హోటల్ ఉండేదని మాత్రమే అతడికి తెలుసు. వ్యాపార దృక్పథంతోనే కొన్న జాన్.. ఆ భవనానికి చిన్న చిన్న మరమ్మతులు చేయించి.. బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ హోటల్‌గా మార్చాడు. దానిలోనే ఒక పక్క కుటుంబంతో కలసి కాపురం పెట్టాడు. రోజులు గడిచే కొద్ది ఆ ఇంట్లో జరిగే అంతుచిక్కని పరిణామాలు వారిని వణికించడం మొదలుపెట్టాయి.ఒక రాత్రి జాన్ నిద్రపోయిన సమయంలో ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు, ఇల్లంతా తిప్పి విసిరికొట్టినట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూస్తే ఒంటిపై గాయాలున్నాయి. తాను మాత్రం మంచం మీదే ఉన్నాడు. రోజు రోజుకీ ఇలాంటి హింసాత్మక అనుభవాలు మరింత ఎక్కువయ్యాయి. కేవలం జాన్‌కు మాత్రమే కాదు.. అతడి కూతురు ఎనిమిదేళ్ల కరోలిన్ హంఫ్రీస్తో పాటు జాన్ భార్య, మిగిలిన వారసులు, ఆ హోటల్లో డబ్బు చెల్లించి బస చేసేవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ ఇలాంటి వింత అనుభవాలు హడలెత్తిస్తూ వచ్చాయి.దాంతో జాన్.. అప్పటికే సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆ ‘ఏన్షియంట్ రేమ్ ఇన్ హౌస్’ గురించి అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ అన్వేషణలో అతడ్ని భార్య, బంధువులు, కొడుకులు ఇలా అంతా వదిలిపోయినా.. కూతురు కరోలిన్ మాత్రం వదిలిపెట్టలేదు. గగుర్పాటు కలిగించే ఎన్నో అంశాలను వెలికి తీసే తండ్రి ప్రయత్నానికి.. చేయూతను ఇచ్చింది కరోలిన్. దాంతో జాన్.. అనుమానం కలిగిన ప్రతి గదిలోనూ తవ్వకాలు జరిపాడు. ప్రతి మూలలోనూ, గోడలోనూ.. ఆ అతీంద్రియ కదలికలను జల్లెడ పట్టాడు.అతడికి ఆ ఇంట్లో చాలా భయపెట్టే బొమ్మలు, ఎముకలు, పుర్రెలు, సమాధులు, పక్షులు, జంతువుల కళేబరాలు దొరికాయి. చాలా ఎముకలను పరిశీలిస్తే.. అవన్నీ చిన్న పిల్లల ఎముకలని తేలింది. పైగా వాటి చుట్టూ నరబలి ఆనవాళ్లు భయపెట్టాయి. చిత్ర విచిత్రమైన మొనదేరిన కత్తులు దొరికాయి. అవన్నీ 1145 నాటివని పురావస్తు నివేదికలు తేల్చాయి. దాంతో జాన్.. మీడియా సాయం కోరాడు. నాటి నుంచి ఈ హౌస్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది.ఇతడి ఆసక్తికరమైన అన్వేషణలలో ఒక గోడ లోపల.. అప్పటికి 500 సంవత్సరాల నాటి పిల్లి కళేబరం బయటపడింది. ఆ గోడ గల గది ఓ మంత్రగత్తెదని, ఆ పిల్లి ఆ మంత్రగత్తె వెనుక తిరిగే నల్లపిల్లి అని ప్రచారంలో ఉన్న కథను తెలుసుకున్నాడు జాన్. ‘మంత్రగత్తె తనను వ్యతిరేకించే జనాల నుంచి తప్పించుకోవడానికి ఆ హోటల్లో దాక్కుందని, తర్వాత అక్కడే ఆమె మరణించిందని ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడ ఉన్నవారిని.. అక్కడ ఉండటానికి వచ్చినవారిని.. కనిపించని శక్తులు పరుగులు పెట్టించడమే ఇక్కడ మిస్టరీ.ఈ ఇంటికి సమీపంలో ఓ పెద్ద చర్చ్ కూడా ఉంది. అయితే ఆ చర్చికి, ఈ ఇంటికి రహస్య సొరంగ మార్గం ఉండటంతో.. ఆ చరిత్రను కూడా తవ్వే ప్రయత్నం చేశాడు జాన్. అయితే ఆ చర్చిలో పని చేసే బానిసలు, కాథలిక్ సన్యాసులు ఆ సొరంగ మార్గం ద్వారానే రాకపోకలు జరిపేవారని తేలింది. ఆ ఇంట్లోని మానవ అవశేషాలకు.. చర్చ్ అధికారులకు సంబంధం ఉందా అనేది మాత్రం తేలలేదు. అయితే ఈ ఇంటి నిర్మాణానికంటే ముందు అదొక శ్మశానవాటికని.. అందుకే అక్కడ అంత పెద్ద ఎత్తున మానవ ఎముకలు దొరికాయని ఓ అంచనాకు వచ్చారు కొందరు.ఆ ఇంట్లో పలు అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని.. ఇదంతా వాటి ఫలితమేనని నమ్మడం మొదలుపెట్టారు మరికొందరు. ఏది ఏమైనా ఆ ప్రదేశంలో ఎందరో నిపుణులు, పర్యాటకులు పలు ప్రయోగాలు చేసి.. స్వయంగా బాధితులు అయ్యారు తప్ప.. బలమైన కారణాన్ని మాత్రం కనుగొనలేకపోయారు. దాంతో నేటికీ ఈ భవనం.. ప్రపంచంలోనే అత్యంత హంటెడ్ నిర్మాణాల్లో ఒక్కటిగా మిగిలిపోయింది. అయితే ఇక్కడ హడలెత్తిస్తున్న అతీంద్రియ శక్తి ఏంటీ? నిజంగానే అక్కడ ఆత్మలు ఉన్నాయా? అక్కడ దొరికిన ఎముకలు.. వాటి వెనుకున్న విషాధ గాథలు ఏవీ తేలకపోవడంతో ఈ ఇంటి చరిత్ర మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
వందల సంఖ్యల్లో రాతి బంతులు..అవి ఏంటన్నది నేటికి అంతుచిక్కని మిస్టరీ!
స్పష్టత లేని ప్రతి ఆధారం.. సమాధానం లేని ప్రశ్నే అవుతుంది. అలాంటి అంతుబట్టిన ఆనవాళ్లు.. అంతుచిక్కని ఆకారాలు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అందులో ‘బోలాస్ డి పిడ్రా’ హిస్టరీ ఒకటి. బోలాస్ డి పిడ్రా అంటే ‘అక్షరాలా రాతి బంతులు’ అని అర్థం. కోస్టారికా అనేక రహస్యాలకు అసలైన స్థావరం. ఈ దేశం.. సముద్రతీరాలకు, విశాలమైన వర్షారణ్యాలకు, జలపాతాలకు, అగ్నిపర్వతాలకు ఉనికిపట్టే కాదు, ఎన్నో మిస్టరీల సొత్తు. ‘యునైటెడ్ ఫ్రూట్’ అనే ఓ కంపెనీ.. 1930లో కోస్టారికా అటవీ ప్రాంతాన్ని కొంతభాగం శుభ్రపరచి.. అరటి తోటలు వేయాలని నిర్ణయించింది. ఆ సమయంలో కొందరు కూలీలకు ఆ కాంట్రాక్ట్‌ని అప్పగించింది. అయితే కూలీలు చెట్లను కొట్టి.. చెత్తను శుభ్రపరుస్తున్న క్రమంలో పెద్ద పెద్ద గుండ్రాళ్లను కనుగొన్నారు. నున్నగా గోళాకారంలో ఉన్న ఆ రాళ్లు ఒక్కొక్కటీ ఒక్కో పరిమాణంలో బయటపడ్డాయి. అవేంటో అర్థంకాని కొందరు కూలీలు.. ఆ పరిసరాలను మొత్తం వెతకడం మొదలుపెట్టారు. అప్పుడే కొన్ని వందల సంఖ్యలో ఈ గోళాలు బయటపడ్డాయి. అయితే వాటిని స్థానికులు దేవుడు రాళ్లుగా భావించి పూజించడం మొదలుపెడితే.. కొందరుమాత్రం ఆ గోళాల్లో విలువైన బంగారం ఉంటుందనే పుకార్లను నమ్మి పగలగొట్టే పనిలో పడ్డారు. అయితే పగలగొట్టిన ఏ రాయిలోనూ ఒక్క విలువైన వస్తువూ దొరకలేదు. కానీ దొరికిన ప్రతి గోళం టన్నుల బరువుతో వింతగా తోచింది. కొన్నాళ్లకు ఆ నోటా ఈ నోటా సమాచారం అందటంతో ఈ రాళ్లపై దృష్టిసారించారు పురావస్తు శాఖవారు. కొన్ని.. సెంటీ మీటర్ల పరిమాణంలో ఉంటే.. ఇంకొన్ని అడుగుల ఎత్తులో ఉన్నాయి. పెద్దపెద్ద గోళాలు.. సుమారు 6 అడుగుల కంటే ఎక్కువ వ్యాసార్ధంతో.. 15 టన్నుల బరువుతో కదిలించడానికి కష్టంగా ఉంటే.. కొన్ని అందులో సగం పరిమాణంతో ఆకట్టుకున్నాయి. అయితే ఇవి తయారు చేసిన రాళ్లలా ఉన్నాయని కొందరు సైంటిస్టులు ఊహించారు. అవి మానవ నిర్మితమా? కాదా? వాటి వెనుక ఉన్న కథేంటీ? అసలు ఎందుకు వాటిని ఒకే చోట ఉంచారు? వాటిని రూపొందించడంలో ఉన్న ఉద్దేశం ఏంటీ? వంటి సందేహాలన్నీ ప్రశ్నార్థకంగానే మిగిలాయి. అయితే కొందరు పరిశోధకులు మాత్రం.. వాటిని క్రీస్తుపూర్వం 800 నుంచి 1500 మధ్య తయారుచేసి ఉంటారని నమ్మారు. ఈ రాళ్ల ఉనికి చుట్టూ అనేక అనేక కథలు వినిపించసాగాయి. ఇవి ఎత్తైన చోటు నుంచి దొర్లుకుంటూ వచ్చాయని కొందరు, వాటిని ప్రకృతే సృష్టించిందని మరికొందరు భావించారు. రాతి గోళాలు ‘తారా ఫిరంగి బంతులు’ అని స్థానిక పురాణం చెప్పుకొచ్చింది. గాడ్ ఆఫ్ థండర్.. గాలీ, తుఫానులను తరిమి కొట్టాడానికి బ్లోపైప్ సాయంతో ఈ బంతులను వినియోగించాడని చెప్పగా.. సౌరకుటుంబాన్ని ఊహాత్మకంగా ఈ గోళాలతో రూపొందించి ఉండొచ్చని, ఖగోళ పరిశీలనలు చేయడానికి లేదా దిక్సూచిగా ఉపయోగించుకోవడానికి వీటిని రూపొందించి ఉంటారని చాలామంది నమ్మారు. ఈ రాళ్ల విషయంలో ఊహలు, నమ్మకాలు తప్ప సరైన సాక్ష్యాధారాలు లేవు. నిజానికి కూలీలు వీటిని కనుగొన్నప్పుడు.. ఉన్నచోట నుంచి తొలగించి మరోచోటకు మళ్లించినప్పుడు.. వాటి అసలు స్థానాలపై పరిశోధకులకు స్పష్టత లేకపోవడం కూడా ఈ మిస్టరీని ఛేదించలేకపోవడానికి ఒక కారణం. ఈ గోళాలను జాతీయ చిహ్నాలుగా.. కోస్టారికా సంస్కృతిలో భాగంగా పరిగణించారు. అందుకే ఇవి ప్రభుత్వ కార్యాలయాల్లో అలంకరణలుగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ మిస్టరీ గోళాలు.. చాలా వరకు అమెరికన్ మ్యూజియమ్స్‌లో దర్శనమిస్తుంటే.. కొన్ని వాగుల్లో, తీరాల్లో పర్యాటకులను అలరిస్తున్నాయి. సంహిత నిమ్మన (చదవండి: అద్భుతమైన డెవిల్స్ బ్రిడ్జ్! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!) -
చరిత్రలో పెద్ద మిస్టరీగా మిగిలిన మృత్యులోయ..!
ఆధారాలు అస్పష్టమైనప్పుడు అనుమానాలు అల్లే కథలు అన్నీ ఇన్నీ కావు. అర్ధాంతరంగా ముగిసిన అసహజ మరణాలన్నీ ఆ కోవలోకే వస్తాయి. అందులో ఒకటే ‘డయాత్లోవ్ పాస్ ఇన్సిడెంట్!’ రష్యా హిస్టరీలోనే టాప్ మోస్ట్ మిస్టరీ ఇది. 62 ఏళ్ల కిందట భీకరమైన మంచుకొండల మధ్య తొమ్మిది మంది యువ బృందం మరణాలు.. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను తలపించే కథనాలుగా మారాయి. అనారోగ్య సమస్యతో మార్గం మధ్య నుంచే ఆ బృందాన్ని వీడి.. వెనుదిరిగిన పదో వ్యక్తి యూరీ యుడిన్ చొరవతో ఇన్వెస్టిగేషన్ మొదలైంది. రెండు నెలల పాటు శ్రమించిన రెస్క్యూ టీమ్.. అతి క్రూరంగా చనిపోయిన తొమ్మిది మంది శవాలను ఒక్కొక్కటిగా బయటికి తియ్యడంతో కథ క్రైమ్ జానర్లోకి అడుగుపెట్టింది. అది 1959 జనవరి 23, సోవియట్ యూనియన్‌లోని స్వెర్డ్లోవ్స్క్ ప్రాంతంలోని యెకాటెరిన్ బర్గ్‌లోని యూరల్ పాలిటెక్నికల్ ఇన్స్టిట్యూట్కి చెందిన 23 ఏళ్ల రేడియో ఇంజనీరింగ్ విద్యార్థి ఇగోర్ డయాత్లోవ్ ఆధ్వర్యంలో పది మంది స్నేహితుల బృందం స్నో ట్రెకింగ్‌కి యూరల్ పర్వతాలవైపు కదిలిన రోజది. వీరంతా కెమెరాలు, డైరీలు వెంటతీసుకుని వెళ్లడంతో.. వారి మరణానంతరం అవే ఆధారలయ్యాయి. ఈ బృందంలో ఇగోర్ డయాత్లోవ్, యూరీ యుడిన్లతో పాటు క్రివోనిషెంకో, అలెగ్జాండర్ కొలెవతోవ్, రస్టెమ్ స్లాబోడిన్, సెమియాన్ జోలొతారియోవ్, డోరోషెంకో, నికోలాయ్ థిబక్స్ బ్రిగ్నోల్లె అనే మరో ఆరుగురు యువకులు.. లియుడ్మిలా డుబినినా, జినైడా కోల్మోగోరోవా అనే ఇద్దరు యువతులు ఉన్నారు. వీరంతా స్నో ట్రెకింగ్ అనుభవజ్ఞులే. వీరి లక్ష్యం పది కిలో మీటర్ల ఎత్తైన మంచు పర్వతానికి చేరుకోవడమే. అయితే అలా జరగలేదు. జనవరి 28న యూరీ యుడిన్ అనారోగ్య సమస్యలతో వెనుదిరిగాడు. మరుసటి రోజు మిగిలిన తొమ్మిది మంది బృందం ఖోలాత్ చాహ్ల – ఒటార్టెన్ పర్వతాల దిశలో బయలుదేరారు. ఇగోర్ డయాత్లోవ్ (బృందానికి లీడర్) అయితే ఫిబ్రవరి 12 కల్లా తిరిగి రావల్సిన బృందం.. ఫిబ్రవరి 19 అయినా రాలేదు. దాంతో యూరీ యుడిన్కి భయం మొదలైంది. కంప్లైంట్ ఇవ్వడంతో.. ఆరు రోజుల శోధన తరువాత, హోలాట్– చాహ్ల్ పర్వత వాలుపై వారి గుడారాన్ని కనుగొన్నారు. అయితే అది ముందుభాగమంతా మంచుతో కప్పి, వెనుక భాగమంతా తప్పించుకోవడానికే అన్నట్లు కత్తితో చీల్చినట్లు ఉంది. అక్కడ నుంచి బయటికి తొమ్మిది జతల పాద ముద్రలు కనిపించాయి. 5 వందల మీటర్ల దూరంలో పైన్ చెట్టు కింద.. అగ్ని అవశేషాలు, దాని పక్కనే 2 మృతదేహాలున్నాయి. అవి క్రివోనిషెంకో, డోరోషెంకోలవి. వారు కేవలం లోదుస్తులతో ఉన్నారు. కొద్ది దూరంలో మరో మూడు శవాలు కనిపించాయి. అవి డయాత్లోవ్, కోల్మోగోరోవా, స్లాబోడిన్లవి. చెల్లాచెదురైన వారి వస్తువుల్లో దొరికిన డయాత్లోవ్ డైరీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పడటంతో ఈ ఘటనకి అతడి పేరే వచ్చింది. మిగిలిన శవాలు దొరకడానికి రెండు నెలల కంటే ఎక్కవ సమయమే పట్టింది. ఈ సంఘటన చరిత్రలో పెద్ద మిస్టరీగా మారడానికి కారణం చివరిగా మే 4న దొరికిన ఆ నాలుగు శవాలే. తలలు పగిలి, ఎముకలు విరిగి, పెద్ద యాక్సిడెంట్ జరిగినట్లుగా ఉంది వాటి వాలకం. కొందరికి నాలుక, కళ్లు మిస్ అయ్యాయి. కొందరికి ఒంటిమీద బట్టలు సరిగా లేవు. ఎవరో దాడి చేయకపోతే బట్టలు, షూస్ లేకుండా అంత మంచులో శిబిరం నుంచి బయటకి పరుగు తీయాల్సిన అవసరమేంటనే అనుమానాలు మొదలయ్యాయి. దాంతో 70కి పైగా ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. యూరీ యుడిన్ నాడు – తర్వాత డయాత్లోవ్ డైరీలో విషయాలు... లోకల్ ట్రైబల్స్ చాలా భయంకరంగా ఉన్నారు. హైకింగ్‌కి వెళ్లొద్దని మాకు వార్నింగ్ ఇచ్చారు. రాత్రి మేమంతా ఎంజాయ్ చేస్తుంటే మాకు కాస్త దూరంలో ఏదో వింత ఆకారం కనిపించింది. కళ్లు ఎర్రగా ఉన్నాయి. మరో చిన్న జంతువుని నోటకరచి వేగంగా పారిపోయింది. బహుశా మంచు చిరుత అయ్యుండొచ్చు. ఎందుకో కాస్త భయంగా అనిపిస్తోంది. ఎవరో మమ్మల్ని గమనిస్తున్నట్లు, ఫాలో చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఏవో సడన్‌గా కదులుతున్న శబ్దాలు.. వినిపి స్తున్నాయి. ఈ రోజు డిన్నర్ తర్వాత నక్షత్రాలను చూస్తుంటే ఆకాశంలో ఏవేవో లైట్స్ కలర్ ఫుల్‌గా కనిపించాయి. విమానం ఎగురుతున్నట్లు పెద్ద శబ్దం.. గాలిలో ఆ కాంతి కనిపించింది. వాటిలో ముఖ్యంగా.. డయాత్లోవ్ తన డైరీలో రాసినట్లు గొడవ పడిన ట్రైబల్సే చంపేసుంటారని, రష్యన్స్ బలంగా నమ్మే స్నోమన్(యతి) చంపేశాడని, ఆ బృందాన్ని వ్యతిరేక శక్తి అని భావించిన ప్రభుత్వమే ఎన్ కౌంటర్ చేసిందని, రాకెట్ ప్రయోగం ఫెయిల్ (డయాత్లోవ్ డైరీలో రాసుకున్నట్లు ఆ రోజు నైట్ కనిపించిన లైట్స్ రష్యా ప్రయోగించిన రాకెట్ వెలుగులని తేలింది) అయ్యుంటుందని.. ఇలా ఎన్నో వినిపించాయి. కానీ ఇది వాతావరణ మార్పుల కారణంగా సంభవించిన మరణాలుగా తేల్చి అప్పట్లో కేసు క్లోజ్ చేసింది రష్యన్ గవర్నమెంట్. వీరందరి జ్ఞాపకార్థంగా ఒక స్థూపాన్ని కూడా నిర్మించింది. 60 ఏళ్ల దాటినా ఈ కేసుకు సంబంధించి విమర్శలు ఆగకపోవడంతో.. 2019లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసి.. కేసును రీ ఓపెన్ చేసి.. ప్రతిదానికి ఒక రీజన్ చూపిస్తూ.. మరోసారి అదే విషయాన్ని నిర్ధారించింది. అయితే ఆ తీర్పుని మృతుల కుటుంబాలు మాత్రం అంగీకరించలేదు. ఆ బృందంలో సజీవంగా మిగిలిన యూరీ యుడిన్.. 2013 వరకూ జీవించే ఉన్నాడు. 75 ఏళ్ల వయసులో మరణించిన యుడిన్.. చనిపోయే వరకూ అపరాధభావంతోనే బతికాడు. ‘నేను వాళ్లని మధ్యలోనే వదిలేసి రాకుండా ఉండాల్సింది.. నేను వాళ్లతో ఉండుంటే వాళ్లు బతికుండేవారేమో’అని కుమిలిపోయాడు. పైగా తన గర్ల్‌ఫ్రెండ్ లియుడ్మిలా డుబినినా ఈ దుర్ఘటనలో చనిపోవడంతో ఆమె జ్ఞాపకాల్లోనే బతికాడు పెళ్లి చేసుకోకుండా. ప్రతీ ఏడాది ఫిబ్రవరి 2న తన స్నేహితుల స్మారక స్థూపానికి కన్నీటితో నివాళి అర్పించేవాడట. మొత్తం ఈ సంఘటనతో పాటు యూరీ విషాదాంత ప్రేమ కథ మీదా రష్యాలో చాలా సినిమాలు వచ్చాయి. లియుడ్మిలా డుబినినా - సంహిత నిమ్మన -
తల్లీ, కుమార్తెల ఘరానా మోసం.. పిల్లల్ని సాకుతామని తీసుకెళ్లి..
సాక్షి, మైసూరు (కర్ణాటక): మైసూరుతో పాటు జిల్లాలో చిన్నపిల్లలను పోషిస్తామని తీసుకెళ్లి విక్రయిస్తున్న వ్యవహారంలో తల్లీ కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నంజనగూడుకు చెందిన శ్రీమతి అలియాస్ సరస్వతి, ఆమె కుమార్తె లక్ష్మి. నెలరోజుల కిందట జ్యోతి అనే పేద మహిళకు మైసూరులో మగబిడ్డ పుట్టగా, ఆమె వెంట ఉన్న శ్రీమతి బిడ్డను తాను సాకుతానని ఇంటికి తెచ్చుకుంది. కొన్నిరోజుల తరువాత ఆ బిడ్డను ఇతరులకు డబ్బులకు అమ్ముకుంది. నా బిడ్డ నాకు కావాలని జ్యోతి వచ్చి అడగడంతో వేరేవారికి ఇచ్చేశానని శ్రీమతి చెప్పింది. నా బిడ్డను ఇప్పించాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది, శ్రీమతి, ఆమె కుమార్తె కలిసి జిల్లాలో పలువురి బిడ్డలను ఇలా అమ్ముకున్నారని తెలిసి పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కో శిశువును రూ.3 – 5 లక్షల వరకు అమ్మేసినట్లు వారు ఒప్పుకున్నారు. -
నాలుగు కాళ్లు... ఆమె శరీరం ఓ మిస్టరీ..
‘మైర్ట్లే కార్బిన్ ’.. ఈ పేరు ప్రపంచానికే ఓ వింత. ఆమె జీవితంలోని కొన్ని పేజీలు చరిత్రకు కూడా చిక్కని మిస్టరీ. వైద్య శాస్త్రానికి ఓ మిరాకిల్. డాక్టర్ల భాషలో చెప్పాలంటే ఆమె ఒకరు కాదు ఇద్దరు. ఒకటిగా కనిపించే కవలలు. ఆ కథే ఇది.. జన్యు లోపాల కారణంగా.. అసాధారణ రూపంతో వింతగా జన్మించిన శిశువు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 1868లో లింకన్ కౌంటీలో నాలుగు కాళ్లతో జన్మించిన కార్బిన్ మాత్రం 60 ఏళ్లు జీవించింది. పిండం సరిగా వృద్ధిచెందకపోవడం వల్ల కారణంగా కవలలుగా పుట్టాల్సిన శిశువులు ఒకరుగా పుట్టారని, ఇది అరుదైన డిపైగస్ అని అప్పట్లో డాక్టర్లు నిర్ధారించారు. రెండు జతల కాళ్లతో పాటు.. రెండు జననేంద్రియాలు, రెండు గర్భాశయాలతో ఉన్న ఈమె ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చి సంచలనంగా నిలిచింది. మైర్ట్లే కార్బిన్ నడుము పైభాగం వరకు సాధారణంగానే ఉంటుంది. ఆమె శరీరం లోపల మాత్రం అవయవాలు వేర్వేరుగా ఉండేవి. ఉండటానికి నాలుగు కాళ్లు ఉన్నా ఒక కాలు మాత్రమే పని చేసేది. మిగిలినవి బలహీనంగా ఉండేవి. ఒక్కో కాలికి మూడేసి వేళ్లు మాత్రమే ఉండేవి. అయితే ఆమె రూపమే ఆమెకు వరమైంది. చనిపోతుందనుకున్న బిడ్డ ఆరోగ్యంగా పెరగడంతో పత్రికలు ఆమెని సెలబ్రిటీని చేశాయి. దాంతో ఒక సర్కస్ కంపెనీ ఆమెను తమ టీమ్‌లో చేర్చుకుంది. చిన్న వయసులోనే సెలబ్రిటీ అయిన కార్బిన్ ఆ రోజుల్లోనే వారానికి సుమారు 450 డాలర్లు (రూ.31,905) సంపాదించేది. సహజంగానే అందగత్తె అయిన కార్బిన్ 19 ఏళ్ల నిండేసరికి క్లింటన్ బిక్నెల్ అనే డాక్టర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె సర్కస్‌లో పనిచేయడం మానేసింది. ఓ రోజు ఉన్నట్టుండి ఎడమ వైపు కడుపులో నొప్పి రావడంతో.. ఆమెని పరీక్షించిన వైద్యులు గర్భవతి అని తేల్చారు. ఆమెకు రెండు గర్భాశయాలు ఉన్నాయనే విషయాన్ని కూడా అప్పుడే కనిపెట్టారు. మొత్తానికీ కార్బిన్‌కు నలుగురు ఆడపిల్లలు, ఒక మగ బిడ్డ జన్మించారు. కార్బిన్ 60వ పుట్టిన రోజుకు రెండువారాల ముందు.. అంటే 1928లో ఆమె కుడికాలికి స్ట్రెప్టోకోక్సల్ ఇన్ఫెక్షన్ సోకింది. అప్పట్లో దానికి చికిత్స లేదు. దాంతో ఆ వ్యాధి సోకిన వారం రోజులకే కార్బిన్ మరణించింది. ఆమె భౌతిక కాయాన్ని పరిశోధనల నిమిత్తం తమకు అప్పగిస్తే భారీగా నగదు ఇస్తామని పలు వైద్యబృందాలు కోరినా ఆమె కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. పైగా ఆమె సమాధిని కాంక్రీట్‌తో నిర్మించి అది గట్టిపడేవరకు సమాధికి కాపలా ఉన్నారట. ఆ కాలంలో వైద్య పరికరాలు పెద్దగా అందుబాటులో లేకపోవడంతో పరిశోధకులు కార్బిన్ శరీరం పనితీరును పూర్తిగా అంచనా వేయలేకపోయారు. అప్పట్లో ఆమెకు పుట్టిన ఐదుగురు పిల్లలు కూడా ఒకే కడుపున పుట్టినవారు కాదని, ఆమెకున్న రెండు వేర్వేరు గర్భశయాల్లో పుట్టారనే వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉండేవి. అయితే ఆ విషయాన్ని కూడా కార్బిన్, ఆమె వైద్యులు రహస్యంగానే ఉంచారు. దాంతో నాలుగు కాళ్ల సుందరిగా పేరుతెచ్చుకున్న కార్బిన్ జన్మ రహస్యం అంతుచిక్కని మిస్టరీగానే ముగిసింది. ∙సంహిత నిమ్మన -
వందలాది నాటుకోళ్ల మృతి మిస్టరీని ఛేదించిన పశువైద్యాధికారులు
సాక్షి, బషీరాబాద్: వందలాది నాటుకోళ్ల మృతి మిస్టరీని పశువైద్యాధికారులు ఛేదించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో విచారణ జరిపి ఊపిరాడకనే అవి చనిపోయాయని వెల్లడించారు. ‘వింతవ్యాధితో నాటుకోళ్ల మృత్యువాత’శీర్షికన ఈ నెల 16న ప్రచురితమైన ‘సాక్షి’కథనానికి రాష్ట్ర పశు సంవర్థకశాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి స్పందించారు. వెంటనే విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా వెటర్నరీ అధికారిని ఆదేశించారు. జిల్లా వెటర్నరీ అధికారి ఆదేశాల మేరకు సోమవారం బషీరాబాద్ మండల పశువైద్యాధికారి హతిరామ్ తన సిబ్బందితో కలసి మండంలోని క్యాద్గీరా, గంగ్వార్ గ్రామాల్లో విచారణ జరిపారు. నాటుకోళ్లు మురుగుకాలువల్లోంచి ఆహారం తీసుకుంటున్నట్లు గమనించారు. అనారోగ్యానికి గురైన ఓ నాటు కోడిని పోస్టుమార్టం చేయగా దాని గిజార్డ్ పూర్తిగా ఇసుక రేణువులతో నిండి ఉన్నట్లు గుర్తించారు. పేగుల్లో మొత్తం పరాన్నజీవులు ఉన్నాయని, తద్వారా తిన్న ఆహారం జీర్ణం కాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాయని హతిరామ్ తెలిపారు. కోళ్ల పెంపకందారులు వాటికి గింజలు వేయకపోవడం, నీళ్లు సరిగ్గా పట్టకపోవడం, ఎండలకు తట్టుకోలేకపోవడం వంటి కారణాలతో చనిపోయాయని వివరించారు. కోళ్లకు ఎలాంటి వ్యాధి సోకలేదని, రైతులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
మిస్టరీ వీడని రేణుక అదృశ్యం
సాక్షి,మోర్తాడ్: ఏర్గట్ల శివారులోని కాకతీయ కాలువలో పడి గల్లంతైన వివాహిత యువతి రేణుక ఆచూకీ రెండు నెలలైనా ఇంకా దొరకలేదు. దీంతో రేణుక అదృశ్యం కేసు మిస్టరీ వీడకుండా ఉంది. అక్టోబర్ మొదటి వారంలో ఇబ్రహీంపట్నంలోని తన తల్లిగారి ఇంటి నుంచి బాల్కొండలోని తన అత్తగారింటికి భర్త మారుతితో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మార్గమధ్యలో రేణుక కాకతీయ కాలువలోకి దూకిందని మారుతి పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేశాడు. అయితే కాకతీయ కాలువలో గజ ఈతగాళ్లతో పలు చోట్ల వెతికించినా అప్పట్లో రేణుక ఆచూకీ లభించలేదు. రేణుకకు సంబంధించి ఎలాంటి దుస్తులు, నగలు దొరకకపోవడంతో ఆమె ఏమి అయి ఉంటుందో పోలీసులకు అంతు చిక్కడం లేదు. రేణుకకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆమె సజీవంగా ఉందా లేదా అని ఒక నిర్దారణకు రాలేక పోతున్నామని పోలీసులు చెబుతున్నారు. రేణుక అదృశ్యం మిస్టరీగానే పోలీసులు పరిగణిస్తున్నారు. అయితే తమ కూతురు కాలువలోకి దూకి ఉండదని ఆమె భర్త మారుతి తోసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తూ రేణుక తల్లి పోలీసుల ఎదుట ఆరోపించింది. అయితే రేణుక అదృశ్యం అయిన నుంచి కాకతీయ కాలువ నిండుగా ప్రవహిస్తుండటంతో ఎలాంటి ఆధారం దొరకడానికి అవకాశం లభించలేదు. రేణుక భర్త మాత్రం ఆమె తనతో గొడవ పడి కాలువలోకి దూకిందని చెబుతున్నాడు. రేణుకకు సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికితే తప్ప ఎలాంటి వివరాలు తాము వెల్లడించలేమని ఏర్గట్ల ఎస్ఐ హరిప్రసాద్ ‘సాక్షి’కి వివరించారు. ఏది ఏమైనా వివాహిత యువతి కాకతీయ కాలువలో గల్లంతై రెండు నెలలు గడచినా ఇంత వరకు ఆచూకీ లభించకపోవడంతో అదృశ్యం కేసు మిస్టరీగానే ఉండిపోయిందని చెప్పవచ్చు. -
జయ తండ్రిని ఆయన భార్యే చంపేసింది!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జీవించి ఉన్నపుడే కాదు మరణించిన తరువాత కూడా ఆమె జీవితం అనేక మలుపులు తిరుగుతోంది. జయ తండ్రి జయరామన్ ఆయన భార్య సంధ్య చేతిలోనే హత్యకు గురయ్యాడనే సంచలన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. జయ తండ్రిది హత్యే! వివాదాస్పదంగా మారిన జయ జీవితంపై బెంగళూరులో నివసిస్తున్న ఆమె అత్త లలిత ఇటీవల తమిళ చానల్ సన్న్యూస్తో మాట్లాడారు. జయకు ఒక ఆడశిశువు జన్మించిన మాట వాస్తవమేనని, తన పెద్దమ్మే ఆమెకు పురుడుపోసిందని చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని జయలలిత తమతో ప్రమాణం చేయించుకున్నారన్నారు. అయితే, సదరు అమృతనే ఆమె కుమార్తె అని చెప్పడానికి తన వద్ద ఆధారమేదీ లేదన్నారు. జయ తండ్రి జయరామన్ మద్యానికి బానిస కావటంతో దూరంగా ఉంచారని, అతనికి తల్లి సంధ్యే విషమిచ్చి చంపినట్లు లలిత ఆరోపించారు. జయ ఈగోను భరించలేక, జయరామన్ హత్య వంటి సంఘటనలతో తామంతా దూరంగా వెళ్లిపోయామన్నారు. జయలలిత తండ్రి జయరామన్, సంధ్య దంపతులకు జయలలిత, జయకుమార్ సంతానం. స్వతహాగా సినీ నటి అయిన సంధ్య జయలలితను సైతం వెండితెర వైపునకు ప్రోత్సహించింది. ఆమె ఉన్నతిలో తల్లి సంధ్య ముఖ్య పాత్ర పోషించింది. జయలలిత ఆకస్మిక మరణంతో ఒక్కసారిగా అనేక వివాదాలు తెరపైకి వచ్చాయి. వీటిలో అన్నిటికంటే ముఖ్యమైంది గోప్యంగా సాగిన ఆమె వ్యక్తిగత జీవితం. అజ్ఞాతంలో అమృత: శోభన్‌బాబుతో జయ సహజీవనం చేశారని వారికి కుమార్తె కూడా ఉందనే ప్రచారం జయ మరణం తరువాత జోరందుకుంది. ఇద్దరు యువతులు, ఒక యువకుడు తాము జయ సంతానం అంటూ చెప్పుకోవడం ప్రారంభించారు. కోర్టు కొరడా ఝుళిపించడంతో ఇద్దరు వెనక్కి తగ్గగా బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి మాత్రం..సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. డీఎన్ఏ పరీక్షలకు సైతం సిద్ధం అని, జయ భౌతిక కాయాన్ని సమాధి నుంచి బయటకు తీసి పరీక్షలు జరపండంటూ సవాల్ చేశారు. అయితే, ముందుగా రాష్ట్రస్థాయిలో పరిష్కరించు కోవాలంటూ సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమైన తరుణంలో తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నట్లు అమృత తెలిపారు. ఈ నేపథ్యంలోనే అమృత అజ్ఞాతంలోకి వెళ్లారని, త్వరలో కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేస్తారని సమాచారం. -
అడ్డుకున్నందుకే హత్య
రహిమాన్ హత్య కేసులో నిందితులు అరెస్టు రెండు వారాల్లో కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజి ద్వారా నిందితుల గుర్తింపు కర్నూలు: ఇంటి ముందు తోపుడుబండి నిలుపుకునే విషయంలో అడ్డు చెప్పడం, ఈ కారణంగా చోటుచేసుకున్న చిన్న గొడవ హత్యకు దారితీసింది. పాతబస్తీలోని మాసూంబాషా దర్గా దగ్గర జుబేదాబేగం ఇంటి ముందు సయ్యద్ సిరాజుద్దీన్ రిక్షా బండి నిలుపుకునే విషయంలో చోటుచేసుకున్న గొడవ ఆమె కుమారుడు షేక్‌పుర్ఖాన్ రహిమాన్ హత్యకు కారణమైంది. రహిమాన్ పాతబస్తీలో ఈజీఎస్ మెన్స్‌వేర్ రెడిమేడ్ దుకాణం నడుపుతున్నాడు. నిందితులు సయ్యద్ సిరాజుద్దీన్, అతని సోదరుడు సయ్యద్ రియాజుద్దీన్ సమీపంలోనే ఎస్ఆర్ సప్లయర్స్, ఎన్ఎస్ఆర్ సప్లయర్స్ నడుపుతున్నారు. తోపుడు బండి నిలుపుకునే విషయంలో ఆరునెలులగా వీరి మధ్య వివాదం కొనసాగుతోంది. గత నెల 29 సాయంత్రం 7 గంటల సమయంలో పుర్ఖాన్‌రహిమాన్ ఇంట్లో ఉండగా నిందితులు సిరాజుద్దీన్, రియాజుద్దీన్ బయటికి పిలిచి దాడి చేశారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తల్లి జుబేదాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రెండు వారాల్లో మిస్టరీని ఛేదించారు. ఫిర్యాది ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించారు. రాధాకష్ణ టాకీసు దగ్గర అదుపులోకి తీసుకొని కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఇందుకు సంబంధించి వివరాలను వన్‌టౌన్ స్టేషన్లో డీఎస్పీ వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. -
విచారణలో వివక్ష?
శ్రీసాయి మృతిపై దర్యాప్తు వేగవంతం ఇప్పటికే 11 మంది అరెస్ట్ జాస్మిన్ మృతిపై వీడని మిస్టరీ బయటకు రాని పోస్టుమార్టం రిపోర్టు ముందుకు సాగని విచారణ రేపల్లె: నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామపంచాయతీ పరిధిలోని మహ్మదీయపాలెంలో ఈనెల 17వ తేదీన జరిగిన షేక్ జాస్మిన్, వేముల శ్రీసాయి మృతి సంఘటనలు జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించాయి. మహ్మదీయపాలెంలో జాస్మిన్ మృతి చెందిన సమయంలో ఆ ఇంట్లో ఉన్న అదే పంచాయతీ పరిధిలోని గరువు గ్రామానికి చెందిన వేముల శ్రీసాయి, జొన్న పవన్‌కుమార్‌లను స్థానికులు పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టిన అనంతరం పోలీసులు శ్రీసాయిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. జాస్మిన్, శ్రీసాయి మృతి సంఘటలను హత్య కేసులుగా పోలీసులు వేరువేరుగా నమోదు చేశారు. శ్రీసాయిని చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టమవుతోందని, దీనిపై వివరణ ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ డీజీపీ నోటీసులు జారీ చేయడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడి రెండు కేసులను త్వరితగతిన ఛేదించాలనే నిర్ణయానికి వచ్చారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఈక్రమంలో శ్రీసాయి హత్య కేసులో అనుమానితులుగా శ్రీసాయి తల్లిదండ్రులు ఇచ్చిన 12 మంది జాబితాతో పాటు సంఘటనను చిత్రీకరించిన వీడియోలను పరిశీలిస్తూ నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే శ్రీసాయి కేసులో 11 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జాస్మిన్ కేసు విచారణలో జాప్యం..? శ్రీసాయి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు చూపుతున్న చొరవ జాస్మిన్ హత్య కేసులో విచారణను వేగవంత చేశారు. జాస్మిన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో అప్పటివరకు జాస్మిన్‌తో మాట్లాడడం, కొద్ది సమయానికే జాస్మిన్ మృతి చెందడం, జాస్మిన్ మృతదేహం వద్ద శ్రీసాయి, పవన్‌కుమార్ ఉండడంపై పోలీసులు విచారిస్తున్నారు. జాస్మిన్ మృతి సంఘటన ప్రదేశంలో శ్రీసాయి, తాను మాత్రమే ఉన్నామని జరిగిన అంశాలను చెబుతున్న మరో నిందితుడు పవన్‌కుమార్ చెబుతున్న మాటలను, శ్రీసాయి తల్లి చెబుతున్నట్లు శ్రీసాయి, పవన్‌లతో ఉన్న వారి స్నేహితుడు సంఘటనా స్థలం నుంచి పారిపోయి వచ్చి విషయాన్ని తనకు ఫోన్లో చెప్పాడని చెబుతున్న విషయాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలానికి శ్రీసాయితో పాటు ఎంతమంది వెళ్లారన్న అంశంపై విచారణను వేగవంతం చేశారు. అయితే జాస్మిన్ పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను గోప్యంగా ఉంచుతూ పూర్తిస్థాయిలో పోస్టుమార్టం రిపోర్టు రావాలంటూ నాన్చుడు ధోరణి అవలంబిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా ఒత్తిడుల కారణంగానే కావాలని జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. మృతుల కుటుంబాలను పరామర్శించడంలోనూ... కారణాలు ఏమైనా జాస్మిన్, శ్రీసాయిల మృతి ఆ ఇద్దరి తల్లులకు కడుపుకోత కలిగించింది. ఆయా కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. ఈ తరుణంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అడవులదీవి పంచాయతీ పరిధిలోని గరువు గ్రామంలో మృతుడు శ్రీసాయి నివాసానికి వెళ్లి మృతుని తల్లితండ్రులను పరామర్శించారు. అదే గ్రామ పంచాయతీలోని మహ్మదీయపాలెంలోని జాస్మిన్ తల్లిని పరామర్శించకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన ఎమ్మెల్యే పక్షపాత ధోరణి అవలంబించడం ఏమిటంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే పూర్తిస్థాయి విచారణ.. జాస్మిన్ హత్య కేసుపై క్షుణ్ణంగా విచారణ చేసేందుకు తొలుత పోస్టుమార్టం నివేదిక అందాల్సి ఉంది. నివేదిక అందిన అనంతరం జాస్మిన్ హత్య కేసును అన్ని కోణాల్లో విచారించి చర్యలు చేపడతాం. జాస్మిన్, శ్రీసాయి హత్యకేసులో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నారు. -బాపట్ల డీఎస్పీ పి.మహేష్ -
గ్రహాంతరవాసుల వస్తువేనా?
మిస్టరీ కంటిన్యూస్.. అంతుచిక్కని రహస్యమొకటి స్పెయిన్వాసులను కలవరపరుస్తోంది. అకస్మాత్తుగా పంటపొలాల్లో పెద్దపెద్ద గొయ్యిలు ఏర్పడడం.., వింతైన గోళాకారపు వస్తువులు ఆకాశంలో నుంచి అమాతంగా వచ్చిపడుతుండడంతో ఆ దేశంలోని కలస్పార్రా ప్రాంత ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పంటపొలాల్లో గొయ్యిలు ఎందుకు ఏర్పడుతున్నాయి? అంతరిక్షం నుంచి అమాంతంగా వచ్చిపడుతున్న ఆ వస్తువులేంటి? అవి తమ ప్రాంతంలోనే ఎందుకు పడుతున్నాయి? జవాబు చెప్పమంటూ స్థానిక అధికారులను, శాస్త్రవేత్తలను నిలదీస్తున్నారు. ఐదు రోజుల్లో ఇది రెండోసారి.. ఈ నెల 3వ తేదీన నల్లని రంగులో, గోళాకారంలో ఉన్న వస్తువు ఇక్కడి పంటపొలాల్లో పడింది. అది పడిన చోట పెద్ద గొయ్యి కూడా ఏర్పడింది. దీనిని గమనించిన స్థానిక రైతు విషయాన్ని పోలీసు అధికారికి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చేదాక ఆ వస్తువును జాగ్రత్తగా కాపాడారు. ఆ గోళం ఎక్కడి నుంచి పడింది? ఇంతకీ ఆ వస్తువు ఏ లోహంతో తయారు చేసింది? దానిపై ఉన్న దారపు పోగులవంటి పదార్థమేంటి? తదితర విషయాలపై పరిశోధన చేసేందుకు తీసుకెళ్లారు. మళ్లీ అలాంటిదే... శాస్త్రవేత్తలు తమ పరిశోధనను ఒవైపు కొన సాగిస్తుండగానే తాజాగా మంగళవారం మరోసారి అలాంటి ఘటనే పునరావృ తమైంది. 80 డయామీరట్ల వ్యాసా ర్దంతో దాదాపు 20 కేజీల బరువున్న గోళాకారపు వస్తువొకటి మర్సియా ప్రాంతంలో పడింది. కేవలం 9,700 మంది జనాభా ఉండే గూడెంలాంటి ప్రాంతంలో పడిన ఈ వస్తువు కూడా ఆకాశం నుంచే పడినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. మరి మండిపోలేదెందుకు? ఈ వస్తువు గురించి తలోరకంగా చెప్పుకుంటున్నారు. స్వర్గం నుంచి పడిన వస్తువంటూ కొందరు, గ్రహాంతరవాసులు విసిరిన వస్తువంటూ మరికొందరు చెబుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఇంకా స్పష్టమైన వివరాలేవీ వెల్లడించలేకపోతున్నారు. గ్రహశకలమని చెప్పలేమని.., అలాగని మానవులు పంపిన ఉపగ్రహాల తాలూకు వస్తువు కూడా అయి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తల అభిప్రాయంతో ఏకీభవిద్దామన కున్నా.. అంతపై నుంచి భూమిపైకి దూసుకొస్తున్నప్పుడు తప్పనిసరిగా మండిపోవాలి. మండుతున్న వస్తువు నేలపై పడినప్పుడు ఆ ప్రాంతంలోని పంటకు తప్పనిసరిగా నిప్పంటుకోవాలి. కానీ అలాంటిదేమీ జరగలేదని మరికొందరు చెబుతున్నారు. ‘ప్రజల ఆందోళనకు కారణమవుతున్న ఆ వస్తువు లేమిటో చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అవి ఎక్కడి నుంచి పడుతున్నాయి? ప్రత్యేకించి ఒకే ప్రాంతంలో పడడానికి కారణమేంటో వెల్లడించాలి. మరిన్ని పడే అవకాశముందా? లేదా? అనే విషయం కూడా చెప్పాలి. జనాభా తక్కువగా ఉన్న ప్రాంతంలో పడుతున్నాయి కాబట్టి సరిపోయింది లేదంటే ప్రాణనష్టం తప్పదు కదా! దీన్ని స్పెయిన్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి.’ - కాలస్పర్రా మేయర్ జోస్ వెలెజ్ -
పౌరహక్కుల స్మృతి కేతనం!
డాక్టర్ రామనాథం గారి హత్యతో వరంగల్‌లో ఆట, మాట, పాట బంద్ అయ్యాయి. వరవరరావు, బాలగోపాల్ వంటి రచయితలు, మేధావులూ వరంగల్ పట్టణం నుంచి హైదరాబాద్‌కు వలస వెళ్లాల్సి వచ్చింది. రాజ్యాంగం మనకు ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను, వ్యక్తి స్వే చ్ఛను, జీవించే హక్కును గౌరవిం చవలసిన నాగరిక సమాజం మనదని చెప్పుకుంటాం. నిన్నగాక మొన్న కర్ణాటకలో కన్నడ మేధావి కల్బు ర్గిని ధిక్కార స్వరం వినిపిస్తున్నం దుకే సంప్రదాయవాదులు ధార్వాడ్ లో హత్య చేశారన్న వార్త చదివాక నాకు పిల్లల వైద్యుడు డాక్టర్ రామనాథం హత్య గుర్తొచ్చింది. భారత రాజ్యాంగాన్ని నమ్మని వాళ్లు మన చట్టాలను గౌరవిం చని వాళ్లు చేసిన హత్య కాదు రామనాథం గారిది. యాదృ చ్ఛికమే అయినా ఇవాళ డాక్టర్ 30వ వర్ధంతి. ఆయన వరం గల్ పట్టణంలో చిన్న పిల్లలకు, పేదలకు వైద్యం చేస్తూ పౌర హక్కుల ఉద్యమంలో పనిచేస్తూ ఉండేవారు. కర్ణాటకలో కల్బు ర్గిని హత్య చేసిన దుండగులు ఎవరో తెలియనందున సీబీఐని ఈ కేసు తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్టు వార్త లు వచ్చాయి. డాక్టర్ రామనాథం గారిని హత్య చేసిందెవరో 30 ఏళ్లు గడచినా నిరూపణ కాలేదు. 30 ఏళ్ల క్రితం ఇదే రోజు న రామనాథం గారిని ఉదయం వరంగల్‌లో చాలా రద్దీగా ఉం డే జేపీఎన్ రోడ్‌లోని ఆయన వైద్యశాలలోకి కొందరు సాయు ధులు జొరబడి కాల్చి చంపారు. ఇటువంటి హత్యలు బోలెడు జరుగుతుంటాయి, ఇందులో ఆశ్చర్యం ఏముందని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కంటికి కన్ను పంటికి పన్ను అన్న ఆటవిక న్యాయం ఇక్క డ రామనాథం హత్య విషయంలో అమలయింది. అంతే కాదు, ప్రజా ఉద్యమాల విషయంలో అన్ని ప్రాంతాలకూ ఆద ర్శంగా నిలిచిన పోరాట కేంద్రం వరంగల్‌ను రామనాథం హత్యకు ముందు, హత్య తరువాత అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. 1985 సెప్టెంబర్ రెండు సాయంత్రం కాజీపేట రైల్వేస్టేషన్లో యాదగిరిరెడ్డి అనే పోలీస్ ఇన్స్పెక్టర్ని పీపుల్స్ వార్ తీవ్రవాదులు కాల్చి చంపారు. మరునాడు ఉదయం యాదగిరిరెడ్డి అంతిమయాత్ర వరంగల్ వీధుల్లో సాగుతుం డగా డాక్టర్ క్లినిక్ దగ్గరికి రాగానే ఆ ఊరేగింపులో నుండి కొం దరు సాయుధులు లోపలికి ప్రవేశించి ఆయనను కాల్చి చంపి పారిపోయారు. ఆ ఊరేగింపు అగ్రభాగాన ఆనాటి జిల్లా ఎస్పీ అరవింద రావు నడుస్తున్నారు. ఆ ఊరేగింపులో ఇంకా కొందరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉండవచ్చు. ఒక పోలీసు అధికారి శవయాత్రలో నుండి కొందరు వ్యక్తులు పిల్లల డాక్టర్ రామ నాథం మీద దాడి చేసి కాల్చి చంపి 30 ఏళ్లు గడిచినా వాళ్లు ఎవరయిందీ రుజువు కాలేదు. డాక్టర్ రామనాథం హత్య అంత సులభంగా మరిచిపో వాల్సిన విషయం కాదు. నక్సలైట్లు దేశ భక్తులు అని వారికి లాల్ సలాం చేసిన ఎన్టీ రామారావు పాలనలో రామనా థాన్ని, అదే నక్సలైట్లు చేసిన ఒక హత్యకు ప్రతీకారంగా చంపే శారు. రామనాథం హత్యతో వరంగల్‌లో ఆట, మాట, పాట బందయ్యాయి. వరవరరావు, బాలగోపాల్ వంటి రచయి తలు, మేధావులూ వరంగల్ పట్టణం నుంచి హైదరాబాద్‌కు వలస వెళ్లాల్సివచ్చింది. జీవించే హక్కు కోసం ఒక రచయిత తన బెయిల్ రద్దు చేసుకుని జైలుకు వెళ్లిన ఉదంతం భారత దేశంలో ఇంకెక్కడా జరిగి ఉండదు. వరవరరావు ఆ పని చెయ్యాల్సివచ్చింది ఆనాడు. ఇంతకూ డాక్టర్ రామనాథం చేసిన నేరం ఏమిటంటే పౌరహక్కుల ఉద్యమంలో పని చెయ్యడం, ప్రజలందరి జీవిం చే హక్కు కోసం పోరాడటం, అన్నింటికీ మించి పోలీసు అధి కారి యాదగిరిరెడ్డి శవయాత్ర వెళుతున్న దారిలో ఆ సమ యాన ఆయన ఉండడం. అక్కడితో మొదలై ఇటువంటి ఆట విక న్యాయాలు మరికొన్ని మన రాష్ర్టంలో అమలయ్యాయి. కరీంనగర్లో 1986లో మరో పౌరహక్కుల నేత జాపా లక్ష్మా రెడ్డి హత్య జరిగింది. అదే జిల్లా పెద్దపల్లిలో పీపుల్స్‌వార్ నక్స లైట్లు డీఎస్పీ బుచ్చిరెడ్డిని కాల్చి చంపిన కొద్ది గంటల్లోనే కరీంనగర్ పట్టణ శివార్లలోని అల్గనూర్‌లో మళ్లీ గుర్తు తెలి యని వ్యక్తులే జాపా లక్ష్మారెడ్డిని ఇంట్లోనే చంపి పారిపోయా రు. ఆయన జిల్లా అంతా గౌరవించే వ్యక్తి, గ్రామ సర్పంచ్, పౌరహక్కుల నేత. ఆయన హంతకులు ఇప్పటికీ దొరకలేదు. కేసు మూసేశారనుకుంటా. రామనాథం హత్య తరువాత వరంగల్ మాదిరిగానే, జాపా లక్ష్మారెడ్డి హత్యానంతరం చాలా కాలం కరీంనగర్లో పౌరహక్కుల గురించి నోరెత్తిన వాళ్లు లేరు. 1989లో మళ్లీ కరీంనగర్ జర్నలిస్టులు పూనుకొని కన్నభి రాన్ను, బాలగోపాల్‌ను ఆహ్వానించి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పౌరహక్కుల స్థితి మీద సెమినార్ పెట్టే వరకూ అక్కడా ఆటా, మాటా, పాటా బంద్. పౌర హక్కుల నేతల మీద ఈ ప్రతీకార దాడులు ఆ తర వాత 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా కొనసా గాయి. 1992లో హనుమకొండ పట్టణంలో కాంగ్రెస్ వృద్ధ నేత హయగ్రీవాచారిని అదే పీపుల్స్‌వార్ నక్సలైట్లు పట్టపగలు హత్య చేశారు. ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నాటి ప్రధాని పీవీ నరసింహారావుకి అత్యంత ఆప్తుడు. మళ్లీ ప్రతీ కార హత్య జరిగింది. హయగ్రీవాచారి హత్య జరిగిన కొన్ని గంటల్లోనే నర్రా ప్రభాకర్‌రెడ్డి అనే న్యాయవాదిని కూడా హత్య చేశారు. ప్రభాకర్‌రెడ్డి కూడా పౌర హక్కుల ఉద్యమం లో పనిచేస్త్తుండేవారు. ఆయన హంతకులు కూడా దొరికినట్టు లేరింకా. పోలీసు అధికారులు యాదగిరిరెడ్డి, బుచ్చిరెడ్డి, కాం గ్రెస్ నేత హయగ్రీవాచారిల హత్యలను సభ్య సమాజం సమ ర్థించదు, కానీ ఈ పౌరహక్కుల నేతల హత్యల సంగతి ఏమి టి? రామనాథం హత్య ప్రభావం తెలంగాణ ప్రాంతంలో పౌర హక్కుల ఉద్యమం మీద ఎంత ప్రభావం పడిందంటే నేటికీ వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పౌరహక్కుల ఉద్యమం పూర్తిగా కోలుకున్నట్టు లేదు. ప్రభుత్వాలు వాటిని న్యూయా ర్క్లూ, డల్లాస్లూ చేసే పనిలో ఉన్నాయి. (నేడు డాక్టర్ రామనాథం 30వ వర్ధంతి) datelinehyderabad@gmail.com