పౌరహక్కుల స్మృతి కేతనం!
డాక్టర్ రామనాథం గారి హత్యతో వరంగల్‌లో ఆట, మాట, పాట బంద్ అయ్యాయి. వరవరరావు, బాలగోపాల్ వంటి రచయితలు, మేధావులూ వరంగల్ పట్టణం నుంచి హైదరాబాద్‌కు వలస వెళ్లాల్సి వచ్చింది.
రాజ్యాంగం మనకు ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను, వ్యక్తి స్వే చ్ఛను, జీవించే హక్కును గౌరవిం చవలసిన నాగరిక సమాజం మనదని చెప్పుకుంటాం. నిన్నగాక మొన్న కర్ణాటకలో కన్నడ మేధావి కల్బు ర్గిని ధిక్కార స్వరం వినిపిస్తున్నం దుకే సంప్రదాయవాదులు ధార్వాడ్ లో హత్య చేశారన్న వార్త చదివాక నాకు పిల్లల వైద్యుడు డాక్టర్ రామనాథం హత్య గుర్తొచ్చింది. భారత రాజ్యాంగాన్ని నమ్మని వాళ్లు మన చట్టాలను గౌరవిం చని వాళ్లు చేసిన హత్య కాదు రామనాథం గారిది. యాదృ చ్ఛికమే అయినా ఇవాళ డాక్టర్ 30వ వర్ధంతి. ఆయన వరం గల్ పట్టణంలో చిన్న పిల్లలకు, పేదలకు వైద్యం చేస్తూ పౌర హక్కుల ఉద్యమంలో పనిచేస్తూ ఉండేవారు. కర్ణాటకలో కల్బు ర్గిని హత్య చేసిన దుండగులు ఎవరో తెలియనందున సీబీఐని ఈ కేసు తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్టు వార్త లు వచ్చాయి. డాక్టర్ రామనాథం గారిని హత్య చేసిందెవరో 30 ఏళ్లు గడచినా నిరూపణ కాలేదు. 30 ఏళ్ల క్రితం ఇదే రోజు న రామనాథం గారిని ఉదయం వరంగల్‌లో చాలా రద్దీగా ఉం డే జేపీఎన్ రోడ్‌లోని ఆయన వైద్యశాలలోకి కొందరు సాయు ధులు జొరబడి కాల్చి చంపారు. ఇటువంటి హత్యలు బోలెడు జరుగుతుంటాయి, ఇందులో ఆశ్చర్యం ఏముందని ఎవరైనా ప్రశ్నించవచ్చు.
కంటికి కన్ను పంటికి పన్ను అన్న ఆటవిక న్యాయం ఇక్క డ రామనాథం హత్య విషయంలో అమలయింది. అంతే కాదు, ప్రజా ఉద్యమాల విషయంలో అన్ని ప్రాంతాలకూ ఆద ర్శంగా నిలిచిన పోరాట కేంద్రం వరంగల్‌ను రామనాథం హత్యకు ముందు, హత్య తరువాత అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. 1985 సెప్టెంబర్ రెండు సాయంత్రం కాజీపేట రైల్వేస్టేషన్‌లో యాదగిరిరెడ్డి అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ని పీపుల్స్ వార్ తీవ్రవాదులు కాల్చి చంపారు. మరునాడు ఉదయం యాదగిరిరెడ్డి అంతిమయాత్ర వరంగల్ వీధుల్లో సాగుతుం డగా డాక్టర్ క్లినిక్ దగ్గరికి రాగానే ఆ ఊరేగింపులో నుండి కొం దరు సాయుధులు లోపలికి ప్రవేశించి ఆయనను కాల్చి చంపి పారిపోయారు. ఆ ఊరేగింపు అగ్రభాగాన ఆనాటి జిల్లా ఎస్‌పీ అరవింద రావు నడుస్తున్నారు. ఆ ఊరేగింపులో ఇంకా కొందరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉండవచ్చు. ఒక పోలీసు అధికారి శవయాత్రలో నుండి కొందరు వ్యక్తులు పిల్లల డాక్టర్ రామ నాథం మీద దాడి చేసి కాల్చి చంపి 30 ఏళ్లు గడిచినా వాళ్లు ఎవరయిందీ రుజువు కాలేదు.
డాక్టర్ రామనాథం హత్య అంత సులభంగా మరిచిపో వాల్సిన విషయం కాదు. నక్సలైట్లు దేశ భక్తులు అని వారికి లాల్ సలాం చేసిన ఎన్‌టీ రామారావు పాలనలో రామనా థాన్ని, అదే నక్సలైట్లు చేసిన ఒక హత్యకు ప్రతీకారంగా చంపే శారు. రామనాథం హత్యతో వరంగల్‌లో ఆట, మాట, పాట బందయ్యాయి. వరవరరావు, బాలగోపాల్ వంటి రచయి తలు, మేధావులూ వరంగల్ పట్టణం నుంచి హైదరాబాద్‌కు వలస వెళ్లాల్సివచ్చింది. జీవించే హక్కు కోసం ఒక రచయిత తన బెయిల్ రద్దు చేసుకుని జైలుకు వెళ్లిన ఉదంతం భారత దేశంలో ఇంకెక్కడా జరిగి ఉండదు. వరవరరావు ఆ పని చెయ్యాల్సివచ్చింది ఆనాడు.
ఇంతకూ డాక్టర్ రామనాథం చేసిన నేరం ఏమిటంటే పౌరహక్కుల ఉద్యమంలో పని చెయ్యడం, ప్రజలందరి జీవిం చే హక్కు కోసం పోరాడటం, అన్నింటికీ మించి పోలీసు అధి కారి యాదగిరిరెడ్డి శవయాత్ర వెళుతున్న దారిలో ఆ సమ యాన ఆయన ఉండడం. అక్కడితో మొదలై ఇటువంటి ఆట విక న్యాయాలు మరికొన్ని మన రాష్ర్టంలో అమలయ్యాయి. కరీంనగర్‌లో 1986లో మరో పౌరహక్కుల నేత జాపా లక్ష్మా రెడ్డి హత్య జరిగింది. అదే జిల్లా పెద్దపల్లిలో పీపుల్స్‌వార్ నక్స లైట్‌లు డీఎస్‌పీ బుచ్చిరెడ్డిని కాల్చి చంపిన కొద్ది గంటల్లోనే కరీంనగర్ పట్టణ శివార్లలోని అల్గనూర్‌లో మళ్లీ గుర్తు తెలి యని వ్యక్తులే జాపా లక్ష్మారెడ్డిని ఇంట్లోనే చంపి పారిపోయా రు. ఆయన జిల్లా అంతా గౌరవించే వ్యక్తి, గ్రామ సర్పంచ్, పౌరహక్కుల నేత. ఆయన హంతకులు ఇప్పటికీ దొరకలేదు.
కేసు మూసేశారనుకుంటా. రామనాథం హత్య తరువాత వరంగల్ మాదిరిగానే, జాపా లక్ష్మారెడ్డి హత్యానంతరం చాలా కాలం కరీంనగర్‌లో పౌరహక్కుల గురించి నోరెత్తిన వాళ్లు లేరు. 1989లో మళ్లీ కరీంనగర్ జర్నలిస్టులు పూనుకొని కన్నభి రాన్‌ను, బాలగోపాల్‌ను ఆహ్వానించి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పౌరహక్కుల స్థితి మీద సెమినార్ పెట్టే వరకూ అక్కడా ఆటా, మాటా, పాటా బంద్.
పౌర హక్కుల నేతల మీద ఈ ప్రతీకార దాడులు ఆ తర వాత 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా కొనసా గాయి. 1992లో హనుమకొండ పట్టణంలో కాంగ్రెస్ వృద్ధ నేత హయగ్రీవాచారిని అదే పీపుల్స్‌వార్ నక్సలైట్లు పట్టపగలు హత్య చేశారు. ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నాటి ప్రధాని పీవీ నరసింహారావుకి అత్యంత ఆప్తుడు. మళ్లీ ప్రతీ కార హత్య జరిగింది. హయగ్రీవాచారి హత్య జరిగిన కొన్ని గంటల్లోనే నర్రా ప్రభాకర్‌రెడ్డి అనే న్యాయవాదిని కూడా హత్య చేశారు. ప్రభాకర్‌రెడ్డి కూడా పౌర హక్కుల ఉద్యమం లో పనిచేస్త్తుండేవారు. ఆయన హంతకులు కూడా దొరికినట్టు లేరింకా. పోలీసు అధికారులు యాదగిరిరెడ్డి, బుచ్చిరెడ్డి, కాం గ్రెస్ నేత హయగ్రీవాచారిల హత్యలను సభ్య సమాజం సమ ర్థించదు, కానీ ఈ పౌరహక్కుల నేతల హత్యల సంగతి ఏమి టి? రామనాథం హత్య ప్రభావం తెలంగాణ ప్రాంతంలో పౌర హక్కుల ఉద్యమం మీద ఎంత ప్రభావం పడిందంటే నేటికీ వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పౌరహక్కుల ఉద్యమం పూర్తిగా కోలుకున్నట్టు లేదు. ప్రభుత్వాలు వాటిని న్యూయా ర్క్‌లూ, డల్లాస్‌లూ చేసే పనిలో ఉన్నాయి.
(నేడు డాక్టర్ రామనాథం 30వ వర్ధంతి)
datelinehyderabad@gmail.com