- భూమికి దగ్గరగా గ్రహాంతర వాసులు
- తరచుగా వచ్చి పోతున్నారా?
-
ఏలియన్స్ గురించి నిగ్గు తేల్చిన భారతీయ కుర్రాడు
బెంగళూరు : గ్రహాంతర వాసులు ఉన్నారా? వాళ్లు తరచూ భూమికి వచ్చిపోతున్నారా? మనల్ని నిరంతరం గమనిస్తున్నారా? అనే ప్రశ్నలు మనలో చాలా మందిని వేధిస్తున్నాయి. మనల్నే కాదు.. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలకు సైతం ఇవే అనుమానాలున్నాయి. వీటికి సంబంధించి విలువైన పరిశోధన జరిపి గ్రహాంతర జీవులు గురించిన సమాచారాన్నిభారతీయ యువ శాస్త్రవేత డాక్టర్ విశాల్ అందించారు .
భూమికి 3 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంత వద్ద గ్రహాంతర వాసులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్రహాంతర వాసులును కనుగొనేందుకు చాలా ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రహాంతర వాసుల స్పేస్‌క్రాఫ్ట్ పంపిన 15 రేడియో సిగ్నల్స్‌ను డాక్టర విశాల్ గుర్తించారు.
ఎలా గుర్తించారు?
భూమికి సుదూరంగా ఉండే ఎఫ్‌ఆర్‌బీ (ఫాస్ట్ రేడియో బరస్ట్) సంకేతాలను ఆస్ట్రేలియాలోని పెర్క్స్ టెలిస్కోప్ నుంచి తొలిసారి గుర్తించారు. తరువాత ప్రపంచంలోని పలు టెలిస్కోప్‌లు ఈ సంకేతాలను గుర్తించాయి.
ఎంత దూరంలో?
భూమికి 3 మిలియన్ కాంతి సంతవత్సరాల దూరంలో ఈ గ్రహాంతర వాసులు లేదా ఎఫ్‌ఆర్‌బీ ఉంది. ఈ ఎఫ్‌ఆర్‌బీని తొలిసారిగా 2012 నవంబర్2న గుర్తించారు. అప్పట్లో కొన్ని రేడియో సంకేతాలు పంపింది. తరువాత మళ్లీ ఇన్నేళ్ళకు 15 రేడియో సిగ్నల్స్‌ను పంపింది. వాటిని మన శాస్త్రవేత్తలు వినడం.. గుర్తించడం జరిగింది.
సంకేతాల విశ్లేషణ
గ్రహాంతర వాసుల నుంచి వచ్చిన సంకేతాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు విశ్లేషించే పనిలో పడ్డారు.
ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, మరికొందరు సైంటిస్టులు గ్రహంతర వాసులు ఉన్నారని.. వాళ్లు మనకంటే టెక్నాలజీలో చాలా అడ్వాన్స్‌డ్‌ని చెబుతున్నారు. ఏలియన్స్ గురించి హాకింగ్స్‌తో సహా చాలామంది పరిశోధనలు జరుపుతున్నారు.