
పాత పోస్టాఫీసు (విశాఖ దక్షిణ): పది రోజులుగా వాట్సాప్, సామాజిక మాధ్య మాల్లో గ్రహాంతరవాసులని, వింత జంతువులని హల్‌చల్ చేసిన వింత పక్షుల మిస్టరీ వీడింది. విశాఖలోని పాతనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఒడిశా స్టీవ్ డోర్స్ కంపెనీ మూడో అంతస్తు బాత్‌రూంలో ఉన్న ఆ పక్షులను అటవీ శాఖ సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. బాత్‌రూం సీలింగ్‌ను తొలిగించి అక్కడ ఉన్న పక్షులను స్వాధీనం చేసుకున్నారు.
మనిషి ఆకారంలో వింతగా నిలబడిన ఈ పక్షులు గ్రహాంతర జీవులు కావని, ఇవి గుడ్లగూబ జాతికి చెందినవని అటవీశాఖ సిబ్బంది నిర్ధారించారు. ఈ గుడ్లగూబ పిల్లలు ఒక్కొక్కటి అడుగున్నర ఎత్తు ఉన్నాయి. తల్లి పక్షి లేని సమయంలో వీటిని స్వాధీనం చేసుకుని జూ అటవీశాఖ సిబ్బంది తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment