కొంతమంది చేసే పనులు చాలా విచిత్రంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటాయి. పైగా వాళ్లు చేసే విచిత్రమైన పనులతో అందర్నీ ఇబ్బందులకు గురి చేసి కటకటాలపాలవుతుంటారు కూడా. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి గ్రహాంతర వాసులును చూసేందుకు అంటూ హాస్యగాడి వలే విచిత్రమైన ముసుగు ధరించి ఎయిర్‌పోర్టుకు వెళ్లి అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తాడు.
(చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!)
అసలు విషయంలోకెళ్లితే... మాథ్యూ హాన్‌కాక్ అనే వ్యక్తి గ్రహాంతరవాసులను చూసేందుకు వెళ్తున్నానంటూ నెవెడాలో లాస్ వేగాస్‌లోని మెక్‌కారన్ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా నియమాలను ఉల్లంఘిస్తాడు. పైగా విమానాశ్రయంలోకి నిబంధనలకు విరుద్ధంగా చొరబడబటమే కాక గ్రహాంతర వాసలు ఉండే ప్రసిద్ధ ప్రాంతం అయిన ఏరియా 51కి వెళ్లేందుకు విమానాన్ని హైజాక్ చేస్తున్నాను అని అక్కడ ఉన్న పోలీసులతో చెబుతాడు. అంతేకాదు అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న భద్రతా విభాగాన్ని నకిలీ బాంబుతో బెదిరిస్తాడు. ఈ మేరకు హాన్‌కాక్ కారుతో సహా ఎయిర్‌పోర్ట్‌లోని విమానాల పార్కింగ్ వద్దకు వచ్చేయడమే కాక తన కారులో షాట్‌గన్, గ్యాసోలిన్ వంటి ఆయుధాలు ఉన్నాయంటూ అక్కడ ఉన్నవారందర్నీ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురిచేస్తాడు.
దీంతో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఉద్యోగులంతా భయంతో పరుగులు పడుతుంటారు. అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. పైగా లాస్‌వేగస్‌లోని రద్దీ వీధుల్లో ఒక లగ్జరీ కారుని నిర్లక్ష్యంగా నడుపుత్నుట్లు టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తిని తానెనంటూ అక్కడ ఉన్న పోలీసులకు చెబుతాడు. అంతేకాదు తనను గ్రహాంతర వాసులు ఎంచుకున్న వ్యక్తిగా సంబోధించండి అంటూ పోలీసులకు విజ్ఞప్తి కూడా చేస్తాడు. దీంతో పోలీసులు హాన్‌కాక్‌ని అదుపులోకి తీసుకోవడమే కాక నకీలి బాంబుతో బెదిరింపులకు పాల్పడినందుకు ఉగ్రవాద చర్యగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment