
ప్రయోగం అనంతరం నాసా విడుదల చేసిన చిత్రం
కేప్ కానావెరల్, ఫ్లారిడా(అమెరికా) : విశ్వంలోని 20 వేల ఏలియన్ ప్రపంచాలను పరిశోధించేందుకు నాసా నడుంబిగించింది. భవిష్యత్‌లో కొత్త ఆవిష్కరణలకు ఊపరిలూదుతూ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా టీఈఎస్‌ఎస్(టాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్)ను బుధవారం ప్రయోగించింది.
విశ్వంలో ఏలియన్స్ కోసం అన్వేషిస్తున్న కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ స్థానాన్ని టీఈఎస్‌ఎస్ భర్తీ చేయనుంది. కెప్లర్‌తో పోల్చితే రాత్రి సమయాల్లో 400 రెట్లు ఎక్కువ ప్రదేశాన్ని టీఈఎస్‌ఎస్ స్కాన్ చేయగలుగుతుంది. ప్రాథమికంగా వచ్చే రెండేళ్ల కాలంలో భూమికి 300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 2 లక్షలకు పైగా సూర్యుడిలా కాంతిమంతంగా మెరుస్తున్న నక్షత్రాలపై జీవుల జాడ కోసం టీఈఎస్‌ఎస్ అన్వేషణ చేయనుంది.
వీటిలో కనీసం 20 వేలకు పైగా గ్రహాంతరవాసులు నివాసముండే గ్రహాలను టీఈఎస్‌ఎస్ కనుగొంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటిలో 50 గ్రహాలు భూమి సైజుతో సరిసమానంగా, 500 గ్రహాంలో భూమి సైజులో సగం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ గ్రహాలను నాసా గుర్తించిన అనంతరం వాటిపై విస్తృత పరిశోధన సాగించేందుకు 2020లో జేమ్స్ వెబ్ అనే టెలిస్కోప్‌ను ప్రయోగించనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment