బృహస్పతిపైకి నాసా ల్యాండర్!
వాషింగ్టన్ : గ్రహాంతర వాసుల ఉనికిని కను గొనేందుకుగాను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’మరో ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగంలో భాగంగా బృహస్పతి గ్రహంపైకి రోబోటిక్ ల్యాండర్‌ను పంపేందుకు సిద్ధమవుతోంది. ఈ గ్రహంపై మంచుతో కప్పబడి ఉండే యూరోపా అనే ఉప్పునీటి సరస్సులో గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించిన ఆనవాళ్ల గురించి పరిశోధన చేయాలని భావిస్తోంది.
యూరోపా సరస్సులోని నీరు భూమ్మీది సముద్రాల్లోని నీరుకు రెండింతలు ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ యూరోపా ప్రాంతంపై అధ్యయన సాధ్యాసాధ్యాలపై ఒక అంచనాకు వచ్చేందుకు గతేడాది ప్రాథమిక పరిశోధన ప్రారంభించిన నాసాలోని ప్లానెటరీ సైన్స్ డివిజన్ .. ఫిబ్రవరి 7న తమ నివేదికను నాసాకు సమర్పించింది