planet Jupiter
-
గురుడిపై భారీ తుపాను!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘జూనో’అంతరిక్ష నౌక గురుగ్రహంపై భారీ తుపాను ‘గ్రేట్ రెడ్ స్పాట్’ఫొటోలను పంపింది. ఈ గ్రేట్ రెడ్ స్పాట్‌ను సౌర కుటుంబంలోనే అతిపెద్దదిగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు. జూలై 10న నౌకలోని జూనోక్యామ్ అనే పరికరం ఈ అతిపెద్ద తుపాను ఫొటోలను తీసింది. వందల ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలు ఈ తుపానును పరిశీలిస్తున్నారని శాన్ ఆంటోనియోలోని సౌత్‌వెస్ట్ ఇన్స్టిట్యూట్కు చెందిన స్కాట్ బోల్టన్ పేర్కొన్నారు. ‘ఈ తుఫానుకు సంబంధించి చాలా మెరుగైన ఫొటోలు మా వద్ద ఉన్నాయి. వీటిని విశ్లేషించడానికి మాకు కొంత సమయం పడుతుంది’అని ఆయన వివరించారు. ఈ గ్రేట్ రెడ్ స్పాట్ దాదాపు 16,350 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అంటే భూమి వెడల్పుతో పోల్చుకుంటే దాదాపు 1.3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ తుపానును 1830వ సంవత్సరం నుంచి గమనిస్తూ ఉన్నారు. 350 ఏళ్ల నుంచి ఇది ఉండొచ్చని అంచనా. -
గురుడే మన పెద్దన్న!
వాషింగ్టన్: మన సౌరవ్యవస్థలోని గ్రహాలన్నింటిలోకెల్ల గురుగ్రహం అత్యంత పురాతనమైనదిగా ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడు ఏర్పడిన 40 లక్షల సంవత్సరాలకు గురుగ్రహం ఆవిర్భవించిందని అమెరికాలోని లారెన్స్ లివర్మోర్ నేషనల్ లేబొరేటరీ పరిశోధకులు తేల్చారు. గురుగ్రహం ఉపరితలంపై ఉన్న ఉల్క శకలాల్లోని ఐసోటోప్ సిగ్నేచర్ నమూనాలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చినట్లు లేబొరేటరీకి చెందిన క్రూజెర్ తెలిపారు. ఇప్పటి వరకు సౌరవ్యవస్థలో ఏర్పడిన పరిణామ క్రమాలను అర్థం చేసుకునేందుకు ఈ తాజా అధ్యయనం తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఏర్పాటైన 10 లక్షల ఏళ్లలోపే భూమికి 20 రెట్లు అధికంగా గురుగ్రహం ద్రవ్యరాశి పెరిగిపోయిందని చెప్పారు. 30 నుంచి 40 లక్షల ఏళ్ల తర్వాత 50 రెట్లు అధికంగా ద్రవ్యరాశి పెరిగిందని చెప్పారు. -
బృహస్పతిపైకి నాసా ల్యాండర్!
వాషింగ్టన్ : గ్రహాంతర వాసుల ఉనికిని కను గొనేందుకుగాను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’మరో ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగంలో భాగంగా బృహస్పతి గ్రహంపైకి రోబోటిక్ ల్యాండర్‌ను పంపేందుకు సిద్ధమవుతోంది. ఈ గ్రహంపై మంచుతో కప్పబడి ఉండే యూరోపా అనే ఉప్పునీటి సరస్సులో గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించిన ఆనవాళ్ల గురించి పరిశోధన చేయాలని భావిస్తోంది. యూరోపా సరస్సులోని నీరు భూమ్మీది సముద్రాల్లోని నీరుకు రెండింతలు ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ యూరోపా ప్రాంతంపై అధ్యయన సాధ్యాసాధ్యాలపై ఒక అంచనాకు వచ్చేందుకు గతేడాది ప్రాథమిక పరిశోధన ప్రారంభించిన నాసాలోని ప్లానెటరీ సైన్స్ డివిజన్ .. ఫిబ్రవరి 7న తమ నివేదికను నాసాకు సమర్పించింది