సముద్రతీరంలో ఏలియన్ల సైన్యం!
పసిఫిక్ సముద్రతీరంలో ఏలియన్ సైన్యానికి చెందిన బేస్ ఇప్పుడు సోషల్‌మీడియలో అలజడి సృష్టిస్తోంది.
పసిఫిక్ సముద్రతీరంలో ఏలియన్ సైన్యానికి చెందిన బేస్ ఇప్పుడు సోషల్‌మీడియలో అలజడి సృష్టిస్తోంది. కాలిఫోర్నియాకు చేరువలోని పసిఫిక్ తీరంలో ఇందుకు సంబంధించిన చిత్రాలను సెక్యూర్ టీం10 అనే వెబ్ సంస్ధ ప్రచురించింది. ఏలియన్ బేస్ విస్తీర్ణయం దాదాపు 2 మైళ్లకు పైగా ఉందని ఆ చిత్రాలను పరిశీలించిన నిపుణలు ఒకరు తెలిపారు.
ఏలియన్లు అటువైపుగా ప్రయాణించి ఉండొచ్చని లేదా భవిష్యత్తులో భూమిపై దాడి చేసేందుకు వ్యూహ రచన కోసం వచ్చి ఉండొచ్చని చెప్పారు. పసిఫిక్ మహాసముద్రంలో తలదాచుకుంటూ ఈ వ్యూహాన్ని అవి కొనసాగిస్తూ ఉండొచ్చని అన్నారు. కాగా, కొన్నేళ్లు ప్రపంచవ్యాప్తంగా విశ్వంలో వేరే జీవిని గురించిన పరిశోధనలు జరగుతూ వస్తున్నాయి.
ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ విశ్వాంతరాళంలో మరో జీవి కచ్చితంగా ఉందని వారు మనకంటే ఎన్నో రెట్లు సాంకేతికంగా ముందున్నారని చెప్పిన విషయం తెలిసిందే.