‘మరో మనిషి’ కోసం డ్రాగన్ వేట | China invests in the hunt for aliens with world's largest radio telescope | Sakshi
Sakshi News home page

‘మరో మనిషి’ కోసం డ్రాగన్ వేట

Published Sat, Jul 16 2016 1:58 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

‘మరో మనిషి’ కోసం డ్రాగన్ వేట

‘మరో మనిషి’ కోసం డ్రాగన్ వేట

గ్రహాంతరవాసులు (ఏలియన్స్) ఉన్నారో లేదో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ ఈ జీవులపై ఎన్నో కథలు మరెన్నో ఊహాగానాలను మనం వింటున్నాం. వీటి ఆధారంగా ఎన్నో సినిమాలు, సీరియళ్లు వచ్చాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా గ్రహాంతరవాసులపై అందరికీ అంతులేని ఆసక్తి. కొందరు గ్రహాంతరవాసులను చూశాం అంటారు..మరికొందరు గుడ్రంగా ఉండే పళ్లాల్లో వచ్చారు అంటారు.

అసలు భూమి మీద తప్ప మరో గ్రహాంపై జీవం ఉండే అవకాశం లేదని కొంత మంది శాస్త్రవేత్తలు ఈ వదంతులను కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రహాంతర వాసుల జాడ కోసం ఏళ్లుగా కొనసాగుతున్న పరిశోధనకు మరింత ఉపయోగపడేలా ఒక పెద్ద టెలిస్కోపును చైనా నిర్మించింది. ఇప్పటికే టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చైనా దీంతో మరో రికార్డు సొంతం చేసుకుంది. ఈ భారీ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోని ఇతర జీవజాతుల ఆనవాళ్లు పసిగట్టేందుకు ఉపయోగించనున్నారు.
 
ఏలియన్ల గురించి పరిశోధనలు జరుగుతున్న తరుణంలో దాదాపు 30 ఫుట్‌బాల్ మైదానాల సైజులో చైనా నిర్మించిన 500 మీటర్ల అపర్చర్ స్పెరికల్ టెలిస్కోపు ప్రపంచంలోని పెద్ద టెలిస్కోపుల్లో ఒకటి.  దాదాపు 4,450 ప్యానల్స్ ఉపయోగించి తయారు చేసిన దీని వ్యాసార్థం 500 మీటర్లు, కటక సామర్థ్యం 140 మీటర్లు. 2016 సెప్టెంబరు నుంచి దీనిని చైనా సైంటిస్టులు వాడుకలోకి తీసుకురానున్నారు. ఈ టెలిస్కోప్ చాలా శక్తివంతమైన భూమి ఆకర్షణ తరంగాలను సృష్టిస్తుంది.

టెలిస్కోపు ద్వారా భూమి, విశ్వం, మిగతా గ్రహాల గురించి కూడా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ద్వారా లభించిన సమాచారాన్ని విశ్లేషించి ఇతర గ్రహాల మీద ఉన్న జీవజాతులు, ఏలియన్ల గురించి త్వరగా కనుక్కునే వీలుందని సమాచారం.  దీనిని నైరుతి చైనాలోని గాయిజూ ప్రావిన్సులో గల కార్ట్స్ వ్యాలీలో ఏర్పాటు చేశారు.  దీనిని నిర్మించేందుకు దాదాపు రూ. 1200 కోట్లకు పైగా ఖర్చు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement