ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఏం చేసిన అది సెన్సేషన్, ఏం చెప్పిన అది వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. ట్విటర్ లాంటి దిగ్గజ సంస్థతో కుదర్చుకున్న డీల్ నుంచి తప్పుకునేంత సాహసం చేయాలన్నా, ఉక్రెయిన్ రష్యా వార్‌పై కామెంట్ చేసినా, అది మస్క్‌కి మాత్రమే సాధ్యం. వ్యాపార పరంగానే ఎంత బిజీగా ఉన్నా ఈ కుబేరుడు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ చమత్కారమైన ట్వీట్‌లతో తన మిలియన్లు ఫాలోవర్లను నవ్విస్తూ ఉంటాడు. తాజాగా మస్క్‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఎలాన్ మస్క్ డబ్బులపై తన అభిప్రాయం తెలిపారు. అందులో.. ఆర్థిక వ్యవస్థ అంటే కేవలం డబ్బు అని కొందరు భావిస్తారు. అంతేకాకుండా ఇదే విషయంలో కాస్త గందరగోళానికి కూడా గురువుతారు. డబ్బు అనేది కేవలం వస్తు సేవల మార్పిడికి వినియోగించి ఓ డేటాబేస్ మాత్రమేనని, ప్రత్యేకించి చెప్పాలంటే మనీకి ఎలాంటి పవర్ లేదని అన్నారు. ఈ వీడియో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఎంటీ మస్క్ అంత మాట అన్నావని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు నిజం చెప్పాడని కామెంట్ చేశారు.
ఎలన్ మస్క్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించి ఆపై పలు కారణాల వల్ల ఈ డీల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ట్విటర్ యాజమాన్యం.. మస్క్‌కు వ్యతిరేకంగా కోర్ట్‌ను ఆశ్రయించింది. కోర్టులో మస్క్‌కి ప్రతికూలంగా.. ఫిబ్రవరిలో 11రోజుల పాటు విచారణ చేపట్టాలన్న విజ్ఞప్తిని తిరస్కరించడంతో పాటు అక్టోబర్‌లో 5రోజుల పాటు విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.
"People get confused sometimes they think an economy is money. Money is a database for exchange of goods & services. Money doesn't have power in & of itself. The actual economy is goods & services"- @elonmusk pic.twitter.com/TzquCRWNqb
— DogeDesigner (@cb_doge) July 23, 2022
చదవండి: Airtel Sunil Mittal Salary: ఎయిర్‌టెల్ చీఫ్ మిట్టల్ ప్యాకేజీ తగ్గింపు.. ఎంతంటే
Comments
Please login to add a commentAdd a comment