చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీపై టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ తీవ్ర ఆరోపణలు చేసారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ అయిన ఎక్స్‌పెంగ్ సంస్థ తన(టెస్లా) ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ యొక్క పాత సోర్స్ కోడ్‌లను చోరీ చేసిందని ఎలోన్ మస్క్ ఆరోపించారు. అదే సమయంలో గతంలో ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ నుంచి ఎక్స్‌పెంగ్ డేటా చోరీ చేయించింది అని తెలిపారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ఉపయోగించే లిడార్ టెక్నాలజీని ఎక్స్‌పెంగ్ ఎందుకు ఉపయోగిస్తోందని తన అనుచరులలో ఒకరు ట్విటర్‌లో అడిగిన ప్రశ్నకు మస్క్ ఇలా సమాధానం ఇచ్చారు.
"వారి దగ్గర మా సాఫ్ట్‌వేర్ యొక్క పాత వెర్షన్ ఉంది, వారు ఆపిల్ కోడ్‌ను కూడా దొంగిలించారు" అని బదులిచ్చారు. 2019 జూలైలో, టెస్లా మాజీ ఇంజనీర్ గువాంగ్జి కావో టెస్లా యొక్క ఆటోపైలట్ సోర్స్ కోడ్‌ను తన ఐక్లౌడ్ ఖాతాలో అప్‌లోడ్ చేసినట్లు ఒప్పుకున్నారు. ఎక్స్‌పెంగ్‌కు సీక్రెట్ కోడ్ ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. అందుకు గాను టెస్లా కంపెనీ కావోపై కేసు కూడా నమోదు చేసింది. (చదవండి: వన్‌ప్లస్ 9ప్రో డిజైన్ ఫస్ట్ లుక్)
Comments
Please login to add a commentAdd a comment