వ్యోమగాములు
న్యూయార్క్ : ‘స్పేస్ ఎక్స్’ అంతరిక్ష సంస్థ మరోసారి మానవసహిత అంతరిక్ష ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. నాసాకు చెందిన ముగ్గురు, జపాన్‌కు చెందిన ఓ వ్యోమగామిని ఈ శనివారం నింగిలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి నాసా మంగళవారం అనుమతి తెలిపింది. శనివారం రాత్రి 7:49 గంటల ప్రాంతంలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి రాకేట్ ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్)కు బయలుదేరనుంది. ( ఇన్‌స్టా మొరాయింపు: ‘నేను ఎలా బ్రతకగలను’ )
అమెరికన్ వ్యోమగాములు మైకెల్ హాప్కిన్స్, విక్టర్ గ్లోవర్, శనాన్ వాకర్, జపాన్‌కు చెందిన సోచి నగూచీలు ఈ మిషన్‌లో భాగం కానున్నారు. 2021లో మరో మానవసహిత అంతరిక్ష ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది. కాగా, గత మే నెలలో స్పేస్ ఎక్స్‌కు చెందిన ఓ రాకేట్ ఇద్దరు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాంటి నష్టం లేకుండా ఆగస్టు నెలలో క్షేమంగా భూమిపైకి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment