SpaceX: చీకటి పడటాన్ని ఆకాశం నుంచి చూశారా? | SpaceX Released Video Of An Orbital Sunset From Dragons Cupola | Sakshi
Sakshi News home page

SpaceX: చీకటి పడటాన్ని ఆకాశం నుంచి చూశారా?

Published Sat, Sep 18 2021 4:24 PM | Last Updated on Sat, Sep 18 2021 6:23 PM

SpaceX Released Video Of An Orbital Sunset From Dragons Cupola - Sakshi

స్పేస్‌ టూరిజం టార్గెట్‌గా రంగంలోకి దిగిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ మరో అద్భుతానికి సాక్షిగా నిలిచింది. ఆ సంస్థ ప్రయోగించిన డ్రాగన్‌ ‍క్యూపోలా భూమికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను కెమెరాలో బంధించింది.  

585 కిలోమీటర్ల ఎత్తులో
స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఇన్సిపిరేషన్‌ 4 మిషన్‌లో భాగంగా గత బుధవారం డ్రాగన్‌ క్యూపోలాను అంతరిక్షంలోకి పంపించింది. మొత్తం నలుగురు వ్యక్తులు ఈ డ్రాగన్‌ స్పేస్‌ షిప్‌లో అంతరికక్షానికి చేరుకున్నారు. భూమి నుంచి 585 కిలోమీటర్ల ఎత్తులో ఇప్పుడా డ్రాగన్‌ చక్కర్లు కొడుతోంది.
చూసేందుకు వీలుగా
గతంలో నాసాతో పాటు పలు అంతరిక్ష సంస్థలు అంతరిక్షంలోకి స్పేస్‌షిప్‌లను పంపినప్పటికీ ఎందులో కూడా పై నుంచి భూమిని చూసేందుకు అనువైన ఏర్పాట్లు లేవు. కానీ స్పేస్‌ఎక్స్‌ ఇన్సిపిరేషన్‌ 4 మిషన్‌లో ప్రత్యేక పద్దతిలో ట్రాన్స్‌పరెంట్‌ మెటీరియల్‌తో  అతి పెద్ద క్యూపోలాను రూపొందించారు. అక్కడి నుంచి భూమిని స్పష్టంగా చూసే వీలుంది. 
చీకటి పడుతుండగా
డ్రాగన్‌ క్యూపోలా నుంచి శుక్రవారం సాయంత్రం భూమిపై చీకటి పడే దృశ్యాలను చిత్రీకరించారు. ఈ వీడియో ఫుటేజీని స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేసింది. ఆకాశం నుంచి చూస్తుంటే సగం భూమిపై చీకటి ఉండగా సగం భూమిపై వెలుతురు ఉంది. క్రమంగా సగ భాగం చీకటిగా మారిపోయింది. ఆ తర్వాత స్పేస్‌ షిప్‌ ఉన్న వైపు భూమి మొత్తం చిమ్మ చీకటిలో కలిసిపోయింది.

చదవండి: విజయవంతమైన స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement