వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ చేపట్టిన చంద్రమండల యాత్రకు తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. ‘హ్యూమన్ ఎక్స్‌ఫ్లోరేషన్, ఆపరేషన్స్ మిషన్ డైరెక్టరేట్’ హెడ్‌గా కాథీ లూడెర్స్‌ను నియమిస్తున్నట్లు నాసా ప్రతినిధి జిమ్ బ్రైడెన్‌స్టోన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇద్దరు వ్యోమగాములతో మే 30వ తేదీన ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించారు. ఈ కార్యక్రమాన్ని కాథీ లూడెర్స్ స్వయంగా పర్యవేక్షించారు. ఆమె 1922లో నాసాలో చేరారు. స్పేస్ ఎక్స్, బోయింగ్ సంస్థలు తయారు చేసిన స్పేస్ క్యాప్సూల్స్ అభివృద్ధి విషయంలో టెస్టింగ్ ప్రోగ్రామ్‌లకు ఇన్‌చార్జిగా సేవలందించారు. 2024లో చేపట్టనున్న చంద్రమండల యాత్రకు నాసా సన్నద్ధమవుతోంది. వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించాలన్నదే ఈ యాత్ర లక్ష్యం. నాసా చంద్రమండల యాత్ర కాథీ లూడెర్స్ ఆధ్వర్యంలోనే జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment