అంతరిక్షంలో సినిమా షూటింగ్‌ విజయవంతం | Russian Flim Crew Return To Earth After Shooting The First Movie In Space | Sakshi
Sakshi News home page

Russian Flim Crew Return To Earth: "అంతరిక్షంలో సినిమా షూటింగ్‌ విజయవంతం"

Published Sun, Oct 17 2021 1:49 PM | Last Updated on Sun, Oct 17 2021 3:37 PM

Russian Flim Crew Return To Earth After Shooting The First Movie In Space  - Sakshi

మాస్కో: రష్యన్‌ సిని బృందం తొలిసారిగా భూకక్ష్యలో విజయవంతంగా సినిమా షూటింగ్‌ని  పూర్తి చేసుకుంది.  రష్యా నటి యులియా పెరెసిల్డ్,  దర్శకుడు క్లిమ్ షిపెంకో, వ్యోమగామి అంటోన్‌ ష్కాప్లెరోవ్‌  కజికిస్తాన్‌లోని బైకనూర్‌ అంతరిక్ష కేంద్రం నుంచి సోయుజ్‌ ఎంఎస్‌-18 అంతరిక్ష నౌక ద్వారా  ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో 12 రోజులు పాటు విజయవంతంగా షూటింగ్‌ పూర్తి చేసుకుని భూమికి చేరుకున్నారు. అయితే వీరు కజకిస్తాన్ స్టెప్పీ సమీపంలో సురక్షింతంగా ల్యాండ్‌ అయ్యినట్లు రష్యన్‌ స్పేస్‌​ ఏజెన్సీ పేర్కొంది. ఈ మేరకు ఈ సినిమా బడ్జెట్‌ వ్యయం విషయం కూడా అ‍త్యంత గోప్యంగా ఉంచారు.

పైగా వారు ఈ ప్రయాణం కోసం నాలుగు నెలలు శిక్షణను కూడా  తీసుకున్నారు. అంతేకాకుండా అమెరికాలో  అత్యాధునిక రాకెట్ ప్రయోగాలతో స్పేస్ ఎక్స్ దూసుకెళ్తున్న నేపథ్యంలో దాన్ని బ్రేక్‌ చేసేలా సరి కొత్త చరిత్రను తిరగారాయలన్న ఉద్దేశంతోనే రష్యా స్పేస్‌ ఏజెన్సీ ఈ ప్రాజెక్టును చేపట్టింది.

ఈ మేరకు 'చాలెంజ్‌' అను పేరుతో నిర్మిస్తున్న ఈ సినిమా అంతరిక్షంలోని వ్యోమోగామీకి  గుండె నొప్పి రావడంతో అతనికి చికిత్స చేసేందుకు వెళ్తున్న సర్జన్‌ ఏ విధంగా అంతరిక్షం చేరుకుంటుంది అనేది ఇతివృత్తంగా చేసుకుని తీస్తున్నారు. ఇందులో ఇద్దరూ రష్యన్‌ వ్యోమోగాములు అతిధి పాత్రలో నటించడం విశేషం. ఈ సోయుజ్‌ ఎంఎస్‌-18 అంతరిక్షం నుంచి తిరిగి భూమికి పయనమయ్యే సమయంలో కొంత సమయం ఇబ్బంది తలెత్తినప్పటికీ సురక్షితం అనుకున్న సమయానికి భూమికి చేరుకన్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement