హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ తన తదుపరి సినిమాలో ఒక సీక్వెన్స్‌ను నాసా సహకారంతో అంతరిక్షంలో షూట్ చేయబోతున్నారన్న వార్త ఇటీవల అందరినీ ఆకర్షించింది. కానీ ఆయన కంటే ముందే రష్యా ఈ ఘనత సాధించేసింది. రష్యా దర్శకుడు క్లిమ్ షిపెంకో రూపొందిస్తున్న సినిమా ‘ద చాలెంజ్’లో ఒక సీక్వెన్స్‌ను 2021 అక్టోబర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో తీశారు. అందులో నటించిన యూలియా పెరెస్లిడ్‌తో కలిసి ఇందుకోసం 12 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌లో గడిపారు.
తద్వారా అంతరిక్షంలో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమాగా ద చాలెంజ్ రికార్డు సృష్టించింది. తాజాగా విడుదలైన దీని ట్రైలర్ దుమ్ము రేపుతోంది. ఓ కాస్మొనాట్ ప్రాణాలు కాపాడేందుకు ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన డాక్టర్‌గా యూలియా ఇందులో నటిస్తోంది. షూట్ కోసం సినిమా బృందం ఐఎస్‌ఎస్‌లో లాండైన తీరును కూడా సినిమాలో చూపించనున్నారు. మున్ముందు చంద్రునితో పాటు అంగారకునిపైనా షూటింగ్ చేస్తానని క్లిమ్ చెబుతున్నారు!
Comments
Please login to add a commentAdd a comment