Yulia
-
పుతిన్‌పై పోరాటమే..
మాస్కో: రష్యా ప్రభుత్వం, అధ్యక్షుడు పుతిన్‌పై పోరాటం కొనసాగిస్తానని ఇటీవల మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నయా ప్రతిజ్ఞ చేశారు. సోమవారం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో పలువురు ఈయూ నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. భర్త నవాల్నీ అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. ఆయన్ను సుదూర ప్రాంతంలో ఉండే జైలుకు పంపి పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్‌ను, ఈ పాపంలో పాలు పంచుకున్న వారందరినీ శిక్షించేదాకా పోరాటం కొనసాగిస్తానన్నారు. నవాల్నీ మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించేందుకు కూడా అధికారులు నిరాకరిస్తున్నారని, సాక్ష్యాలు దొరక్కుండా చేయడమే వారి ఉద్దేశమని ఆరోపించారు. -
అంతరిక్షంలో సినిమా షూటింగ్
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ తన తదుపరి సినిమాలో ఒక సీక్వెన్స్‌ను నాసా సహకారంతో అంతరిక్షంలో షూట్ చేయబోతున్నారన్న వార్త ఇటీవల అందరినీ ఆకర్షించింది. కానీ ఆయన కంటే ముందే రష్యా ఈ ఘనత సాధించేసింది. రష్యా దర్శకుడు క్లిమ్ షిపెంకో రూపొందిస్తున్న సినిమా ‘ద చాలెంజ్’లో ఒక సీక్వెన్స్‌ను 2021 అక్టోబర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తీశారు. అందులో నటించిన యూలియా పెరెస్లిడ్‌తో కలిసి ఇందుకోసం 12 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపారు. తద్వారా అంతరిక్షంలో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమాగా ద చాలెంజ్ రికార్డు సృష్టించింది. తాజాగా విడుదలైన దీని ట్రైలర్ దుమ్ము రేపుతోంది. ఓ కాస్మొనాట్ ప్రాణాలు కాపాడేందుకు ఐఎస్ఎస్కు వెళ్లిన డాక్టర్‌గా యూలియా ఇందులో నటిస్తోంది. షూట్ కోసం సినిమా బృందం ఐఎస్ఎస్లో లాండైన తీరును కూడా సినిమాలో చూపించనున్నారు. మున్ముందు చంద్రునితో పాటు అంగారకునిపైనా షూటింగ్ చేస్తానని క్లిమ్ చెబుతున్నారు! -
అంతరిక్షంలో సినిమా షూటింగ్
మాస్కో: తొలిసారిగా భూకక్ష్యలో సినిమా షూటింగ్ జరగనుంది. ఇందుకోసం రష్యా నటి, సినిమా డైరెక్టర్ మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు చేరుకున్నారు. కజఖ్‌స్తాన్‌లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి ఎగిసిన సోయుజ్ అంతరిక్ష నౌక ద్వారా ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ఈ బృందంలో నటి యులియా పెరెసిల్డ్(37), దర్శకుడు క్లిమ్ షిపెంకో(38)తోపాటు వ్యోమగామి అంటోన్ ష్కాప్లెరోవ్ ఉన్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన అంటోన్ ఈ ప్రయాణానికి నాయకత్వం వహించారు. ఛాలెంజ్ అనే పేరున్న సినిమాలో నటి యులియా సర్జన్‌గా నటిస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలోని ఒక సభ్యుడికి గుండెపోటు రావడంతో ఆమె అక్కడికి వెళ్లి చికిత్స అందించే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇప్పటికే ఐఎస్ఎస్లో ఉన్న నోవిట్స్కీ, పీటర్ డుబ్రోవ్ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నటించనున్నారు. నోవిట్స్కీ గుండెపోటుకు గురైన వ్యోమగామి పాత్ర పోషించనున్నారు. ఈనెల 17వ తేదీన భూమికి చేరుకుని, సినిమాలోని మిగతా సన్నివేశాలను షూట్ చేస్తారు. ఈ ప్రయాణం కోసం నాలుగు నెలల నుంచి కఠిన శిక్షణ పొందారు. ‘ఛాలెంజ్’ను రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ సాయంతో ప్రభుత్వ టీవీ ‘చానెల్ వన్’నిర్మిస్తోంది. సభ్యుల శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే చానెల్ వన్ విస్తృతంగా కవరేజీ అందించింది. ఈ మిషన్ రష్యా శక్తి, సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి చాటి చెబుతుందని ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. -
కాజ్ కోసం అమ్మకానికి కన్యత్వం
సాక్షి, కీవ్: ఉక్రెయిన్‌కు చెందిన 18 ఏళ్ల అందమైన అమ్మాయి యూలియా తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు స్థానిక పత్రిక ‘టార్బింకా’లో వాణిజ్య ప్రకటన ఇచ్చింది. అలారం గడియారాలు, పురాతన వస్తువులకు కొనుగోలుదారులు కావాలంటూ ఇచ్చిన ప్రకటన పక్కనే ఆ పత్రిక ఈ అమ్మాయి ప్రకటనను ప్రచురించింది. అమ్మాయిని గుర్తుపట్టకుండా కాస్త మెడ కింద నుంచి పెదవుల వరకు కనిపించేలా ఆమె ఫొటోను ప్రచురించింది. ‘నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ ఇప్పటికీ కన్యగానే ఉండిపోయాను. ఎప్పుడో మద్యం పార్టీలో మత్తుగా తాగి కన్యత్వాన్ని కోల్పోవడం కన్నా ఓ మంచి కాజ్ కోసం కన్యత్వాన్ని కోల్పోవడం మంచిదని అనుకున్నాను. అందుకనే ఈ నిర్ణయానికి వచ్చాను. ఎవరైన 1500 పౌండ్లకు కొనుక్కోవచ్చు. దీనికి పోటీ పడాల్సిన పనిలేదు. మగతనం ఉన్న పురుషుడైతే చాలు అనుమతిస్తా. లైంగిక పిచ్చి ఉన్నవాళ్లు తగుల కూడదని కోరుకుంటున్నా’ అని ఆ ప్రకటనలో ఆమె వివరించారు. అయితే మంచి కాజ్ కోసం అని చెప్పిన ఆమె, ఆ కాజ్ ఏమిటో వెల్లడించలేదు. కన్యత్వం కోసం వచ్చే పురుషుడు తన వైద్యులతో పరీక్షించుకోవచ్చని కూడా యూలియా సూచించింది. ఒప్పందం ప్రకారం డబ్బులు తీసుకునేందుకు తన వెంట ఓ సహచరుడు వస్తారని, ఆయన డబ్బులు తీసుకెళ్లిన గంటలోగా సదరు పురుషుడి ముందు తాను కన్యత్వాన్ని సమర్పించుకునేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు. అలా ఉండకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని కూడా చెప్పారు. అయితే తాను ఎంపిక చేసిన చోటనే తనను అనుభవించాలని ఆమె షరతు విధించారు. ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం తమ పత్రికకు ఇదే మొదటిసారని, స్పందన ఎలా ఉంటుందో చూడాలని టార్బింకా పత్రికా యాజమాన్యం తెలిపింది. -
రష్యన్ మోడల్స్ హొయలు