
అంతరిక్షంలో చిక్కుపోయి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకు రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.. తన అనుభవాలను మరోసారి పంచుకున్నారు. అంతరిక్షం నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడారు. ‘ నేను, బుచ్ ఒక మిషన్ ను కంప్లీట్ చేసే క్రమంలో అంతరిక్షంలో అడుగుపెట్టాం. ఇక్కడ ఉన్నాన్నాళ్లు ఒకరికొకరు సమన్వయంతో సహకారంతో పని చేశాం. మేము ఇక్కడ పరిస్థితుల్లో మార్పులు గమనించాం. ఇక్కడ మనం నివసించడం వల్ల ఒక ప్రత్యేకమైన థృక్పదం ఏర్పడుతుంది. ఇక్కడ నా సుదీర్గ ప్రయాణం ఒక స్ఫూర్తిగా మిగిలిపోతుంది. ఆ మెరుపును ఎప్పటికీ కోల్పోను. దాన్ని నాతోనే దాచుకుంటాను’ అని సునీతా విలియమ్స స్పష్టం చేశారు.
సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులు. అంటే సుమారు 9 నెలలకు పైగానే అయ్యింది. 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్‌ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది! దాంతో కొన్ని నెలల పాటు వారు అంతరిక్షంలోనే ఉండిపోయారు.
అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం విజయవంతమైంది. ఇవాళ (ఆదివారం) ఉదయం 9:40 గంటలకు ఈ అనుసంధాన ప్రక్రియ జరిగినట్లు వెల్లడించిన నాసా.. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.
నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సుల్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. సునీతా విలియమ్స్, బచ్ లు బుధవారం భూమ్మీదకు వచ్చే అవకాశం ఉంది.
That’s good to hear! #SunitaWilliams returns to earth 🌎 https://t.co/RGUUmJh6lQ
— Samina Shaikh 🇮🇳 (@saminaUFshaikh) March 16, 2025
Comments
Please login to add a commentAdd a comment