స్టార్ లింక్ ప్రాజెక్ట్ లో భాగంగా భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించటానికి ఎలోన్ మస్క్ స్థాపించిన స్పేస్‌ఎక్స్ టెక్నాలజీస్ చేసున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)లకు స్పేస్‌ఎక్స్ టెక్నాలజీస్ స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల బీటా వెర్షన్‌ను ముందే అమ్మకుండా నిరోధించాలని లేఖ రాసింది. భారతదేశంలో ఇటువంటి సేవలను అందించడానికి స్పేస్‌ఎక్స్‌కు అనుమతులు లేవని ఎకనామిక్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది.
స్పేస్‌ఎక్స్ భారతదేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ బీటా సేవల ప్రీ-ఆర్డర్‌ల కోసం 99 డాలర్లు( సుమారు రూ.7,000) చెల్లించాలని గతంలో ఆఫర్ చేసింది. ఇదే తరహా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భారతి గ్రూప్(ఎయిర్ టెల్), యుకే ప్రభుత్వ కలిసి వన్‌వెబ్ ప్రాజెక్ట్ కింద 2022 వరకు అందించాలని చూస్తున్నాయి. అలాగే అమెజాన్ ప్రాజెక్ట్ కైపెర్ ఇతర ఉపగ్రహ కమ్యూనికేషన్ సేవల కోసం ఇతర సంస్థలతో పోటీపడుతుంది. ఇండియాలో స్టార్‌లింక్‌కు సొంత గ్రౌండ్ లేదా ఎర్త్ స్టేషన్లు లేకపోవడంతో పాటు ఇస్రో & టెలికమ్యూనికేషన్ విభాగం(డిఓటి) నుంచి శాటిలైట్ ఫ్రీక్వెన్సీ ఆథరైజేషన్ లేదని ఫోరం తెలిపింది. యుఎస్, కెనడా, యుకే దేశాలలో ఇప్పటికే ఇటువంటి సేవలను అందిస్తున్న స్పేస్‌ఎక్స్ టెక్నాలజీస్ 2022 వరకు ఉపగ్రహాల ద్వారా భారతదేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని చూస్తుంది. వివిధ దేశాలలో విజయవంతంగా బీటా పరీక్షలు జరగడంతో ఇండియాలో కూడా బీటా సేవల కోసం బుక్ ఫ్రీ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సేవలు అందించనున్నట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment