చంద్రయాత్ర.. పారాచ్యూట్ ల్యాడింగ్
చంద్రయాత్ర.. పారాచ్యూట్ ల్యాడింగ్
Published Tue, Feb 28 2017 10:03 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
సాధారణ మనిషిని త్వరలో చంద్రమండలానికి తీసుకెళ్లనున్నట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. 2018లో ఈ ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్పేస్ షిప్‌ను నాసాకు చెందిన ఆస్ట్రోనాట్లు అభివృద్ధి చేస్తున్నారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నుంచి 2018 ద్వితీయార్ధంలో చంద్రమండల యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వారం రోజులపాటు జరిగే చంద్రయాత్రకు ఒక్కొక్కరి నుంచి ఎంత చార్జ్ చేస్తున్నారనే విషయంపై స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ చీఫ్ ఎలాన్ మస్క్ మాట్లాడలేదు. అయితే, హాలీవుడ్ నుంచి మాత్రం ఎవరూ ఈ యాత్రలో పాల్గొనడంలేదని ఆయన వెల్లడించారు. చంద్రునిపై కాలుమోపేందుకు ఇద్దరు యాత్రికులు ఇప్పటికే తమను కలిశారని.. వారివురికి అంతరిక్ష యానం గురించి విస్తృత శిక్షణ ఇస్తామని తెలిపారు. ఒకసారి యాత్రకు వెళ్లి రావడానికి ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.
భూమి నుంచి చంద్రమండల యాత్రకు బయల్దేరే వ్యక్తులు 4,80,000 కిలోమీటర్ల నుంచి 6,40,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రునిపై పారాచ్యూట్ ద్వారా ల్యాండ్ అవుతారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల రక్షణ చర్యలను నాసా తీసుకుంటున్నట్లు మస్క్ తెలిపారు. చంద్రుని యాత్ర చేయాలంటే మాత్రం ఒక్కో టిక్కెట్టు ధర రూ.16,69,06,252లతో కొనాల్సిందేనని తెలిసింది.
Advertisement