చంద్రుని వద్దకు మనుషుల్ని పంపేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్న నాసా కీలక విషయాన్ని వెల్లడించింది. జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి రానున్న నలుగురు ఆస్ట్రోనాట్లకు ట్రైనింగ్ ప్రారంభించింది. ఈ శిక్షణ 18 నెలల పాటు కొనసాగనుందని నాసా తెలిపింది.
51 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపైకి మనుషులను పంపిస్తున్న నాసా ఆర్టెమిస్ 2పై పనిచేస్తుంది. ఇందులో భాగంగా జాబిలి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి రానున్నారు. నలుగురు ఆస్ట్రోనాట్లును సురక్షితంగా తీసుకెళ్లే ఓరియన్ క్యాప్య్సూల్, స్పేస్ లాంచ్ సిస్టం గురించి ఈ 18 నెలల కఠిన శిక్షణలో వివరించనుంది.
వీటితో పాటు సిస్టమ్‌లను ఆపరేట్ చేయడం, పర్యవేక్షించడం కూడా నేర్చుకుంటారు. ఆరోహణ, కక్ష్య, తీరం, ఎంట్రీ ఫేజ్‌లతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి’ అనే అంశం గురించి ఆస్ట్రోనాట్స్ వీరికి వివరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment