చంద్రయాన్-3పై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నవేళ.. ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్ స్పందించారు. చంద్రయాన్-3 బడ్జెట్.. హాలీవుడ్ ఇంటర్‌స్టెల్లార్ చిత్రం బడ్జెట్ కంటే తక్కువనే ఓ నెటిజన్ ట్వీట్‌కు ఎక్స్(ట్విటర్)లో మస్క్ బదులిచ్చారు. ఎలన్ మస్క్ సైతం స్పేస్‌ఎక్స్ అనే స్పేస్ సంస్థకు యాజమాని అనే సంగతి తెలిసిందే.
Good for India 🇮🇳!
— Elon Musk (@elonmusk) August 22, 2023
దాదాపు ఏడు వందల కోట్ల ఖర్చుతో(75 మిలియన్ల డాలర్ల) చంద్రయాన్-3 ప్రాజెక్టును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ మిషన్ కోసం ఖర్చు చేసిన బడ్జెట్‌ను ఓ నెటిజెన్ హాలీవుడ్ సినిమాతో పోల్చాడు. ఇంటర్‌స్టెల్లార్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో చంద్రయాన్-3 మిషన్‌ను చేపట్టినట్లు ఓ నెటిజన్ అన్నాడు. ఇదే చంద్రయాన్ ప్రయోగాన్ని ఆమధ్య ఓ నెటిజెన్ ప్రభాస్ ఆదిపురుష్ బడ్జెట్‌తో పోల్చిన సంగతి తెలిసిందే. ఇంటర్‌స్టెల్లార్ చిత్ర నిర్మాణం కోసం దాదాపు 1200 కోట్లు ఖర్చు చేశారు. ఇక ఆదిపురుష్ కోసం 700 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా.
అయితే లోబడ్జెట్ చంద్రయాన్‌పై మస్క్ మాత్రం ఇది మంచి పరిణామమే అన్నట్లుగా ఆయన రియాక్ట్ అయ్యారు. గుడ్ ఫర్ ఇండియా అంటూ ఓ నెటిజన్ పోస్టుకు ఆయన కామెంట్ జోడించారు. ఇక స్పేస్‌ఎక్స్ ద్వారా అంతరిక్ష టూరిజంలో క్రియాశీలకంగా ఉన్న ఎలన్ మస్క్.. అంగారకుడితో పాటు చంద్రుడిపైకి మనిషిని పంపాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment