హారిస్‌ను ట్రంప్ తన్నుతున్నట్టు వీడియో
నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అతి సమీపానికి వచ్చిన నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతిచ్చే క్రమంలో స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పరిధులు దాటుతున్నారు. డెమొక్రటిక్ అభ్యరి్థ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై హింసాత్మక, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. ట్రంప్, హారిస్ పోటీని గ్లాడియేటర్ నేపథ్య పోరాటంగా అభివర్ణిస్తూ మస్క్‌కు చెందిన అమెరికా సూపర్ పీఏసీ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో దుమారం రేపుతోంది.
రెచ్చగొట్టే, హింసాత్మక చిత్రాలతో రూపొందించిన ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్‌ను చేతిలో కత్తులతో గ్లాడియేటర్‌లా చూపారు. మైదానంలో హారిస్ తలపడుతున్నట్టు, ఆమె ముఖంపై తన్నుతున్నట్టు రూపొందించారు. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియా ర్యాలీని చూపుతూ మస్క్ వాయిస్ ఓవర్‌తో వీడియో మొదలవుతుంది. ఈ ఎన్నికలు అమెరికాతో పాటు పాశ్చాత్య నాగరికత భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని భావిస్తున్నట్టు మస్క్ చెబుతారు.
రాకెట్లు, జెట్లు, హల్క్ చొక్కా విప్పడం, ట్రంప్ ప్రసంగాలు, పలు సినీ క్లిప్పింగులు వీడియలో చోటుచేసుకున్నాయి. దీని సృష్టికర్తలు నియో–నాజీలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ పీఏసీ ఎక్స్ గతంలోనూ హారిస్ లక్ష్యంగా ఇలాంటి వీడియోలు చేసింది. ఆమెను ‘సి–వర్డ్’(కమ్యూనిస్టు)గా అభివరి్ణస్తూ పోస్ట్ చేసిన ఆ వీడియోను వెంటనే తొలగించింది. ట్రంప్‌కు మద్దతుగా, డెమొక్రాట్లను విమర్శిస్తూ ప్రకటనల కోసం సూపర్ పీఏసీ ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment