Profanity
-
USA Presidential Elections 2024: పరిధులు దాటుతున్న మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అతి సమీపానికి వచ్చిన నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతిచ్చే క్రమంలో స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పరిధులు దాటుతున్నారు. డెమొక్రటిక్ అభ్యరి్థ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై హింసాత్మక, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. ట్రంప్, హారిస్ పోటీని గ్లాడియేటర్ నేపథ్య పోరాటంగా అభివర్ణిస్తూ మస్క్‌కు చెందిన అమెరికా సూపర్ పీఏసీ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో దుమారం రేపుతోంది. రెచ్చగొట్టే, హింసాత్మక చిత్రాలతో రూపొందించిన ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్‌ను చేతిలో కత్తులతో గ్లాడియేటర్లా చూపారు. మైదానంలో హారిస్ తలపడుతున్నట్టు, ఆమె ముఖంపై తన్నుతున్నట్టు రూపొందించారు. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియా ర్యాలీని చూపుతూ మస్క్ వాయిస్ ఓవర్‌తో వీడియో మొదలవుతుంది. ఈ ఎన్నికలు అమెరికాతో పాటు పాశ్చాత్య నాగరికత భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని భావిస్తున్నట్టు మస్క్ చెబుతారు. రాకెట్లు, జెట్లు, హల్క్ చొక్కా విప్పడం, ట్రంప్ ప్రసంగాలు, పలు సినీ క్లిప్పింగులు వీడియలో చోటుచేసుకున్నాయి. దీని సృష్టికర్తలు నియో–నాజీలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ పీఏసీ ఎక్స్ గతంలోనూ హారిస్ లక్ష్యంగా ఇలాంటి వీడియోలు చేసింది. ఆమెను ‘సి–వర్డ్’(కమ్యూనిస్టు)గా అభివరి్ణస్తూ పోస్ట్ చేసిన ఆ వీడియోను వెంటనే తొలగించింది. ట్రంప్‌కు మద్దతుగా, డెమొక్రాట్లను విమర్శిస్తూ ప్రకటనల కోసం సూపర్ పీఏసీ ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వైద్యురాలితో అసభ్య ప్రవర్తన... తండ్రీ కొడుకుల అరెస్ట్
బంజారాహిల్స్: కిరాయి చెల్లించకుండా ఇంట్లో ఉండటమేగాక ఇంటిని ఖాళీ చేయాలని చెప్పిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు, విశ్రాంత ప్రొఫెసర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించి దుర్భాషలాడిన ఘటనలో తండ్రీ కొడుకులను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 7లోని ఉమెన్ కో అపరేటివ్ సొసైటీ ప్లాట్ నెంబర్ 88లో విశ్రాంత ప్రొఫెసర్, ప్రముఖ పీడియాట్రిక్ నిపుణురాలు డా.గంటా కుసుమకు ఇల్లు ఉంది. పదేళ్ల క్రితం ఈ ఇంట్లో మొయ్యా రాఘవేంద్రనాథ్, ఆయన తండ్రి మొయ్యా రవీంద్రనాథ్ కిరాయికి దిగారు. కాగా నాలుగేళ్ల క్రితం తన భర్తతో కలిసి సొంతింట్లో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇంటిని ఖాళీ చేయాలని రాఘవేంద్రనాథ్‌ను కోరారు. అయితే ఇంటిని ఖాళీ చేయ కుండా రోజుకో సాకును చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ఇంటిని ఖాళీ చేయకపోగా గత కొన్నినెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదు. ఇల్లు ఖాళీ చేయాలని డా. కుసుమతో పాటు ఆమె కుటుంబ సభ్యులు రాఘవేంద్రనాథ్‌ను ఈనెల 8న కోరారు. దీంతో తీవ్ర పదజాలంతో వారిని దూషించడంతో పాటు అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించడంతోపాటు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులకు గురిచేశారు. నాలుగేళ్ల వరకు ఇంటిని ఖాళీ చేసే ప్రసక్తే లేదని, కిరాయి కూడా ఇచ్చేది లేదంటూ దబాయించారు. దీంతో బాధితురాలు డా.కుసుమ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఈ మేరకు మొయ్యా రవీంద్రనాథ్, మొయ్యా రాఘవేంద్రనాథ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. గతంలో పార్కు స్థలం కబ్జా కేసులో.. ఇదిలా ఉండగా వృద్ధురాలైన వైద్యురాలి ఇంట్లో కిరాయికి దిగి ఖాళీ చేయకుండా వేధిస్తుండడంతో పాటు బెదిరింపులకు దిగిన నిందితులు మొయ్యా రవీంద్రనాథ్, మొయ్యా రాఘవేంద్రనాథ్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.9లోని సత్వా ఎన్క్లేవ్ కాలనీలో పార్కుస్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసినట్లు సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులిద్దరూ అరెస్టయినట్లు విచారణలో తేలింది. ఫోర్జరీ పత్రాలతో సుమారు రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయడంతోపాటు ఏకంగా జీహెచ్ఎంసీని బురిడీ కొట్టించి నిర్మాణ అనుమతులు తీసుకున్న వ్యవహారంపై కూడా విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. అధికారులను బెదిరించడం, భూములను కబ్జా చేసినట్లు తేలింది. (చదవండి: కోమటిరెడ్డి సోదరులు.. కోవర్టు బ్రదర్స్) -
అసభ్య పదజాలం..విద్యార్థుల ధర్నా
ఉపాధ్యాయినిలతో దుర్భాషలాడిన ప్రధానోపాధ్యాయుడు పాల్వంచ(కొత్తగూడెం): పాఠశాలలో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయులతో అసభ్యంగా మాట్లాడిన ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ధర్నాకు దిగారు. పాల్వంచలోని వికలాంగుల కాలనీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న సూర్యనారాయణ మహిళ ఉపాధ్యాయులతో దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపానికి గురైన ఉపాధ్యాయినిలు గురువారం విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. -
అసభ్యపదజాలంతో దూషించారు
అంగన్వాడీ కార్యకర్త తీరుపై సీడీపీవో ఆవేదన పీలేరు: అంగన్వాడీ కార్యకర్త తన పట్ల దురుసుగా ప్రవర్తించి, అసభ్య పదజాలంతో దూషించారని చిన్నగొట్టిగల్లు సీడీపీవో వసంతభాయి విలపించారు. బుధవారం పీలేరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీడీపీవో కథనం మేరకు.. బుధవారం పీలేరు పట్టణం అజంతా టాకీస్ సమీపంలోని అంగన్వాడీ కేంద్రాన్ని అసిస్టెంట్ సీడీపీవోతో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశా. అంగన్వాడీ కార్యకర్త చిన్నమ్మ కేంద్రంలో ఉన్నారు.రోజువారి ఫ్రీస్కూల్ పిల్లల హాజరు రిజిస్టర్లో 13 మంది వచ్చినట్లు నమోదు చేశారు. తాము కేంద్రాన్ని తనిఖీ చేసినపుడు ఏడుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు. స్టాక్ వివరాలు తెలియజేసే రిజిస్టర్ లేదు. మరోవైపు బియ్యం, పప్పు, నూనె అంగన్వాడీ కేంద్రలో లేవు. కోడిగుడ్లు సైతం తక్కువగా ఉన్నాయి. అమృతహస్తం రిజిస్టర్లో 16 మంది పేర్లు ఉండగా అందులో కొందరి పేర్లవద్ద ఈ నెలాఖరు వరకు సంతకాలు చేసి ఉండడం కనిపించింది. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నిస్తే కార్యకర్త సమాధానం దాటవేశారు. అసభ్యపదజాలంతో నన్ను దూషించారు’ అని సీడీపీవో విలపించారు. జరిగిన సంఘటనపై జిల్లా