అంగన్‌వాడీ కార్యకర్త తన పట్ల దురుసుగా ప్రవర్తించి, అసభ్య పదజాలంతో దూషించారని చిన్నగొట్టిగల్లు సీడీపీవో వసంతభాయి విలపించారు
అంగన్‌వాడీ కార్యకర్త తీరుపై సీడీపీవో ఆవేదన
పీలేరు: అంగన్‌వాడీ కార్యకర్త తన పట్ల దురుసుగా ప్రవర్తించి, అసభ్య పదజాలంతో దూషించారని చిన్నగొట్టిగల్లు సీడీపీవో వసంతభాయి విలపించారు. బుధవారం పీలేరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీడీపీవో కథనం మేరకు.. బుధవారం పీలేరు పట్టణం అజంతా టాకీస్ సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని అసిస్టెంట్ సీడీపీవోతో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశా. అంగన్‌వాడీ కార్యకర్త చిన్నమ్మ కేంద్రంలో ఉన్నారు.రోజువారి ఫ్రీస్కూల్ పిల్లల హాజరు రిజిస్టర్‌లో 13 మంది వచ్చినట్లు నమోదు చేశారు. తాము కేంద్రాన్ని తనిఖీ చేసినపుడు ఏడుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు. స్టాక్ వివరాలు తెలియజేసే రిజిస్టర్ లేదు.
మరోవైపు బియ్యం, పప్పు, నూనె అంగన్‌వాడీ కేంద్రలో లేవు. కోడిగుడ్లు సైతం తక్కువగా ఉన్నాయి. అమృతహస్తం రిజిస్టర్‌లో 16 మంది పేర్లు ఉండగా అందులో కొందరి పేర్లవద్ద ఈ నెలాఖరు వరకు సంతకాలు చేసి ఉండడం కనిపించింది. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నిస్తే కార్యకర్త సమాధానం దాటవేశారు. అసభ్యపదజాలంతో నన్ను దూషించారు’ అని సీడీపీవో విలపించారు. జరిగిన సంఘటనపై జిల్లా