సీడీపీవోపై వేటు.. | cdpo prabhatamma suspended by sakshi effect | Sakshi
Sakshi News home page

సీడీపీవోపై వేటు..

Published Sun, Dec 8 2013 12:33 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

cdpo prabhatamma suspended by sakshi effect

 ఆదిలాబాద్, న్యూస్‌లైన్ :
 విధుల్లో నిర్లక్ష్యం.. నిధుల్లో గోల్‌మాల్‌కు పాల్పడిన ఐసీడీఎస్ ఆదిలాబా ద్ రూరల్ సీడీపీవో ప్రభావతిపై ఎట్టకేలకు వేటు పడింది. ‘ఐసీడీఎస్‌లో నిధు ల స్వాహా’ శీర్షికన అక్టోబర్ 27న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమెను జిల్లా నుంచి బదిలీ చేయాలని, క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకోవాలని కలెక్టర్, మహిళ శిశు సంక్షేమ శాఖ చైర్మన్ అహ్మద్‌బాబు హైదరాబాద్‌లోని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు శనివారం సిఫార్సు చేశారు. సీడీపీవోపై ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేస్తారని శాఖ ఉద్యోగులు భావించినా జిల్లా నుంచి బదిలీతో సరిపెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. కలెక్టర్ చర్యపై ఐసీడీఎస్‌లో హర్షం వ్యక్తమవుతోంది. సీడీపీవోతో పాటు ఇద్దరు అటెండర్లపైనా వేటు పడింది. బదిలీలపై ఆంక్షలు ఉండడంతో వారిని జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు డెప్యుటేషన్‌పై పంపారు.
 
 వేటు తప్పదేమో..?
 సీడీపీవో ప్రభావతి ఆదిలాబాద్ రూరల్‌తోపాటు ముథోల్ ఇన్‌చార్జి సీడీపీవో వ్యవహరిస్తున్నారు. గతంలో సూపర్‌వైజర్‌గా ఇక్కడే పనిచేశారు. పదోన్నతిపై సీడీపీవోగా బోథ్ ప్రాజెక్టులో కొద్ది కాలమే పనిచేసి తిరిగి ఆదిలాబాద్ రూరల్ ప్రాజెక్టుకు బదిలీ చేయించుకున్నారు. ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. సీడీపీవోనే ప్రాజెక్టుకు సంబంధించి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ఆ అకౌంట్‌లో జమ అయిన డబ్బులను వారం రోజుల్లో ఖర్చు చేయాలి. ఉద్యోగుల వేతనాలు, అంగన్‌వాడీల ఖర్చు డబ్బులు వెంటనే ఇచ్చేసి డీడీలు, చెక్ రూపంలో చెల్లించాల్సినవైతే నెలరోజుల వరకు సమయం తీసుకోవచ్చు. అంతకుమించి అకౌం ట్‌లో డబ్బులుంటే వాటిని వెంటనే సంబంధిత శాఖ ఉన్నతాధికారికి అప్పజెప్పాలి.
 
 అయితే.. రూరల్ సీడీపీవో మార్చిలో అకౌంట్‌లోకి వచ్చిన రూ.లక్షల నిధులను ఖర్చు చేయకుండా అంటిపెట్టుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అదే కార్యాలయంలో యూడీసీగా పనిచేస్తున్న రాణి సీడీపీవో వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. తాను పీడీ కార్యాలయం నుంచి ఆదిలాబాద్ రూరల్ ప్రాజెక్టుకు యూడీసీగా బదిలీపై వచ్చినా తనకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పజెప్పకుండా కొన్ని రిజిస్టర్లు, సర్వీసు బుక్ మాత్రమే ఇచ్చారని, రూ.58.71 లక్షల పేమెంట్ కాని నిధులు ఖాతా లో ఉన్నాయని సీడీపీవోపై యూడీసీ ఫిర్యాదు చేశారు. రూ.10 లక్షలకు సంబంధించిన చెక్కు లు కూడా బ్యాంకులో బౌన్స్ అయినట్లు ఆరోపించారు. ఈ నిధులు ఎక్కడివి, దానికి సంబంధించిన రికార్డులు ఏవి అన్న విషయంలో స్పష్ట త లేదని ఆమె ఏజేసీగా ఉన్న వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు.
 
 అంగన్‌వాడీలకు సంబంధించి భవనాల అద్దె, అంగన్‌వాడీలు, ఆయాల టీఏ, అమృతహస్తం, అంగన్‌వాడీలకు అదనపు గౌర వ వేతనం, వంట చెరుకు, వీవో బిల్స్ తదితర వాటికి సంబంధించిన నిధులనే సీడీపీవో అంగన్‌వాడీలకు ఇవ్వకుండా కాజేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఏజేసీ వెంకటయ్య సీడీపీవో కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను సీజ్ చేశారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణకు సంబంధించి ఐసీడీఎస్ పీడీ కార్యాలయం నుంచి నివేదిక పం పించడంలో తాత్సారం చేయడంతో దాదాపు నెల రోజుల తరువాత ఆమెపై చర్యలు తీసుకున్నారు. అన్‌డిస్బర్స్, క్యాష్‌బుక్ రిజిష్టర్లు సరిగ్గా లేవని, స్టాక్ వివరాలు కూడా సరిగా లేనందున ఆమెపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిఫారసు చేశారు. కాగా.. కలెక్టర్ సిఫారసు నేపథ్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
 
 మొదట చార్జ్‌మెమో జారీ చేసే అవకాశాలు లేకపోలేదు. దానికి సీడీపీవో ఇచ్చే జవాబు సంతృప్తిగా లేనిపక్షంలో శాఖపరంగా విచారణ అధికారిని నియమిస్తారు. ఇదిలా ఉంటే సీడీపీవో కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేటర్లుగా ఉన్న కీర్తిపాల్, రాములపై కూడా వేటుపడింది. అయితే వారికి స్థానభ్రంశం కల్పించారు. కీర్తిపాల్‌ను నిర్మల్‌కు, రామును ముథోల్‌కు డెప్యుటేషన్ వేశారు. విచారణలో నిధుల దుర్వినియోగం తేలితే సీడీపీవోను సస్పెండ్ చేసే అవకాశమూ లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement